Advertisement
Google Ads BL

నేను c/o నువ్వు మోషన్ పోస్టర్


ఆగాపే అకాడమీ పతాకంపై రతన్ కిషోర్,సన్య సిన్హా, సాగారెడ్డి, సత్య,ధన, గౌతమ్ రాజ్ నటీ,నటులుగా సాగారెడ్డి తుమ్మ దర్శకత్వంలో నిర్మిస్తున్న అతవుల, శేషిరెడ్డి, దుర్గేష్ రెడ్డి, కె .జోషఫ్ లు  సంయుక్తంగా నిర్మించిన చిత్రం నేను c/o నువ్వు.అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 9 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అవుతున్న సందర్బంగా ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ ను హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ కొల్లి రామకృష్ణ నేను c/o నువ్వు చిత్ర మోషన్  పోస్టర్ లాంచ్ చేశారు.. ఈ కార్యక్రమం లో చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబందించి ఒక చిన్న సాంగ్ కు డ్యాన్స్ కంపోజ్ చేసి పంపిస్తే లక్ష  రూపాయలు ప్రైజ్ మనీని అందజేస్తామని తెలిపారు.

Advertisement
CJ Advs

ముఖ్య అతిధులుగా విచ్చేసిన ఫిలిం ఛాంబర్  ప్రెసిడెంట్ కొల్లి రామకృష్ణ మాట్లాడుతూ.. నాకు ఈ చిత్ర దర్శకుడు సాగా పది సంవత్సరాల నుండి తెలుసు. సినిమా రంగంపై ఎంతో ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీ కి వచ్చాడు. ఇది సాగా కు రెండో చిత్రం. ఈ సినిమా కోసం తానే దగ్గరుండి కథ, స్క్రీన్ ప్లే దర్శకత్వం అన్నీ తన బుజాలమీద వేసుకుని ఈ చిత్రాన్ని ముందుకు తీసుకువెళ్లాడు.. ఈ చిత్రంలో ఉన్న ఫైట్స్, మరియు మ్యూజిక్ చాలా బాగావచ్చాయి .ఈ చిత్ర యూనిట్ కు అల్ ధ బెస్ట్ అన్నారు.

చిత్ర దర్శకుడు సాగా రెడ్డి తుమ్మ మాట్లాడుతూ.. 1980 లో నా చిన్న తనంలో నేను దగ్గరగా చూసిన  కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించాను. ఈ చిత్రానికి పని చేసిన మ్యూజిక్ డైరెక్టర్, పాటల రచయిత తో పాటు మొత్తం టెక్నిసియన్స్  అందరూ నాకు మంచి స్నేహితులు. అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. చిన్న సినిమాలను దయచేసి సపోర్ట్ చేయండి.సెప్టెంబర్ 9 న ప్రపంచ వ్యాప్తం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు.

సహ నిర్మాత జోషఫ్ మాట్లాడుతూ.. నాకు దర్శకుడు సాగా కథ చెప్పగానే నచ్చి ఈ  ప్రాజెక్ట్ లొకి వచ్చాను. సాగా ఎంతో విజనరీ ఉన్న డైరెక్టర్. పోస్టర్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఓ వైపు వివాహ శుభకార్యాన్ని చూపిస్తూ, మరోవైపు సంకెళ్ళ తో కాళ్ళను బందించిన ఒక చిన్న క్రైమ్ స్టోరీ లా క్రియేట్ అయ్యేలా పోస్టర్ కనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే కథ డిఫరెంట్ గా ఉంటుందని అర్థం అవుతుంది.ఈ సినిమా చూశాను. విడుదల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను. సెప్టెంబర్ 9 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను అన్నారు.

లిరిసిస్ట్ ప్రణవ్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో మొత్తం నాలుగు పాటలు ఉంటాయి. ముందుగా ఈ ప్రాజెక్ట్ ను వేరే వాళ్ళు చేస్తుండగా ఆలస్యం కావడంతో ఈ అవకాశం నాకు వచ్చింది. సాగా నాకు సన్నివేశం చెప్పగానే రెండో రోజే పాటను రాసిచ్చేవాన్ని. అలా ఇందులో నాలుగు పాటలు నేనే రాశాను. నాకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సాగా బాగా కో ఆపరేట్ చేశాడు. ఇంతమంచి అవకాశం ఇచ్చిన సాగా కు, నిర్మాతలకు కృతజ్ఞతలు.

నటీ నటులు: రతన్ కిషోర్, సన్య సిన్హా, సాగారెడ్డి, సత్య, ధన, గౌతమ్ రాజ్ తదితరులు

సాంకేతిక నిపుణులు, బ్యానర్: అగపే అకాడమీ, డిఓపి: జి.కృష్ణ ప్రసాద్, లిరిక్స్: ప్రణవం, కొరియోగ్రాఫర్: నరేష్, మ్యూజిక్: ఎన్.ఆర్.రఘునందన్, ఆర్ట్: పి.ఎస్.వర్మ, యాక్షన్: షొలిన్ మల్లేష్, సహా నిర్మాతలు: అతవుల, శేషి రెడ్డి, దుర్గేష్ రెడ్డి,జోషఫ్, కథ- స్క్రీన్ ప్లే- డైలాగ్స్- డైరెక్షన్: సాగా రెడ్డి తుమ్మ.

Nenu c/o Nuvvu movie motion poster:

<pre id="tw-target-text" class="tw-data-text tw-text-large tw-ta" dir="ltr"><span class="Y2IQFc" lang="en">Nenu c/o Nuvvu movie motion poster release</span></pre>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs