Advertisement
Google Ads BL

రజిషా విజయన్ ఇంటర్వ్యూ


మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలోశరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ రామారావు ఆన్ డ్యూటీ. రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జూలై 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ విడుదలకు సిద్ధమవుతోన్న నేపధ్యంలో చిత్ర హీరోయిన్స్ లో ఒకరైన రజిషా విజయన్ విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె పంచుకున్న రామారావు ఆన్ డ్యూటీ చిత్ర విశేషాలివి.

Advertisement
CJ Advs

రామారావు ఆన్ డ్యూటీ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ? 

దర్శకుడు శరత్ గారు నేను తమిళ్ లో చేసిన కర్ణన్ సినిమా చూసి నాకు కాల్ చేసి రామారావు ఆన్ డ్యూటీ ప్రాజెక్ట్ గురించి చెప్పారు. రామారావు ఆన్ డ్యూటీ లో మాళిని అనే పాత్రలో కనిపిస్తా. శరత్ గారు అద్భుతమైన కథ చెప్పారు. నా పాత్ర చాలా బలంగా వుంటుంది. ఒక భాషలో పరిచయమౌతున్నపుడు బలమైన కథ, పాత్ర కావాలని ఎదురుచూశాను. నేను ఎదురుచుసిన పాత్ర ఈ సినిమాతో దక్కింది. మాళిని పాత్ర చాలా అందంగా బలంగా వుంటుంది. ఇంతమంచి సినిమాతో తెలుగులో పరిచయం కావడం ఆనందంగా వుంది. 

రవితేజ గారితో పని చేయడం ఎలా అనిపించింది ? 

నేనునార్త్ ఇండియాలో పెరిగాను. రవితేజ గారి సినిమాలు హిందీ డబ్బింగ్ లో చూసేదాన్ని. నా స్నేహితులందరికీ రవితేజ గారు తెలుసు. ఇప్పుడు పాన్ ఇండియా అంటున్నాం కానీ ఆ రోజుల్లోనే రవితేజ గారికి ఆ రీచ్ వుంది. రవితేజ గారితో పని చేయడం గొప్ప అనుభవం. రవితేజ  గ్రేట్ మాస్ హీరో, సూపర్ స్టార్. ఆయన సెట్స్ కి వస్తే ఒక మెరుపులా వుంటుంది. మొత్తం ఎనర్జీతో నిండిపోతుంది. సెట్స్ లో అందరినీ సమానంగా చూస్తారు.  

దర్శకుడు శరత్ గారితో పని చేయడం గురించి ?

శరత్ గారు చాల ఫెర్ఫెక్షనిస్ట్. ఆయన చాలా క్లారిటీ గా వుంటారు. రామారావు ఆన్ డ్యూటీ మాస్ ఫిల్మ్, చాలా ఎంటర్ టైన్మెంట్ ఎలిమెంట్స్, యాక్షన్, డ్యాన్స్ వున్నాయి. అదే సమయంలో బలమైన కథ వుంది. వినోదం పంచుతూనే ఆలోచన రేకెత్తించే సినిమా ఇది. ఇన్ని ఎలిమెంట్స్ వున్న సినిమా తీయాలంటే దర్శకుడిలో చాలా క్లారిటీ ఉండాలి. అంత చక్కని క్లారిటీ వున్న దర్శకుడు శరత్. మంచి సాంకేతిక విలువలతో చాలా మంచి క్యాలిటీతో ఈ సినిమాని రూపొందించారు. 

డబ్బింగ్ మీరే చెప్పారా ? 

తెలుగు నేర్చుకుంటాం. త్వరలోనే తప్పకుండా డబ్బింగ్ చెబుతా. తెలుగులో చాలా సినిమాలు చేయాలనీ వుంది. తెలుగు డబ్బింగ్ గా వచ్చిన నా ఇతర భాషల చిత్రాలని కూడా  అభిమానించారు. ఇక్కడ ప్రేక్షకుల అభిమానం మర్చిపోలేను. 

మీరు తమిళ్ మలయాళం చిత్ర పరిశ్రమలలో కూడా పని చేశారు కదా ? తెలుగులో ఎలాంటి డిఫరెన్స్ గమనించారు ? 

పరిశ్రమలో వేరైనా అందరూ తీసేది సినిమానే. టెక్నిక్ ఒక్కటే. నటన కూడా ఒకటే. మిగతా పరిశ్రమలతో పోలిస్తే  తెలుగులో సినిమాల ఎక్కవ బడ్జెట్ వుంటుంది. పెద్ద కాన్యాస్ లో సినిమాకు తెరకెక్కుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలని కలుపుకుంటే ఇక్కడ థియేటర్స్, ఆడియన్స్ ఎక్కువ.       

మలయాళం నుండి చాలా చిత్రాలు, కంటెంట్ రీమేక్ అవుతాయి కదా.. కారణం ఏమిటాని భావిస్తున్నారు?

మలయాళంలో స్టార్ కాస్ట్, డైరెక్టర్, నిర్మాత కంటే స్క్రిప్ట్ చాలా ప్రధానం. బౌండ్ స్క్రిప్ట్ లేనిదే షూటింగ్ స్టార్ట్ కాదు. రచయితల మొదట బలమైన స్క్రిప్ట్ ని రాయడానికి ప్రయత్నిస్తారు. బహుశా అదో కారణం కావచ్చు. 

ఓటీటీల ప్రభావం థియేటర్ పై వుంటుందని భావిస్తున్నారా? 

సినిమా అనేది అల్టీమేట్ గా థియేటర్ ఎక్స్ పిరియన్స్. మమ్ముటి గారు ఒక సినిమా షూటింగ్  చేస్తున్నపుడు ఎలా వస్తుందో కనీసం మోనిటర్ కూడా చూడలేదు. కారణం అడిగితే.. నేను యాక్ట్ చేస్తుంది మానిటర్ కోసం కాదు .. బిగ్ స్క్రీన్ పై ఎలా వుంటుందో అనేది చూస్తాను అని చెప్పారు. థియేటర్ ఇచ్చే అనుభవం వేరు. రామారావు ఆన్ డ్యూటీ లాంటి భారీ చిత్రాన్ని అందరూ థియేటర్ లోనే చూడాలి. ఈ చిత్రం అన్ని ఎలిమెంట్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుంది, ఆలోచింపజేస్తుంది.

కొత్తగా చేస్తున్న సినిమాలు ? 

మలయంకున్జు పాటు మరో నాలుగు మలయాళం సినిమాలు విడుదల కానున్నాయి. మరో రెండు సినిమాల షూటింగ్ మొదలుపెట్టాలి.

Rajisha Vijayan Interview:

Rajisha Vijayan Interview about Ramarao on Duty
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs