Advertisement
Google Ads BL

‘తీస్ మార్ ఖాన్’ టీజర్ 2: గెలికింగ్ షురూ!


విలక్షణ కథలను ఎంచుకుంటూ యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలల్లో నటిస్తూ మాస్ ఆడియెన్స్‌కు కూడా చేరువయ్యాడు ఆది సాయికుమార్. ఆయన తాజా చిత్రం ‘తీస్ మార్ ఖాన్’. ప్రొడక్షన్ నెంబర్ 3‌గా విజన్ సినిమాస్ బ్యానర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త డా. నాగం తిరుపతి రెడ్డి ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. నాటకం వంటి విభిన్న కథాంశంతో కూడుకున్న చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకులను అలరించిన దర్శకుడు కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతోంది. చిత్రంలో ఆది సాయికుమార్ సరసన పాయల్ రాజ్ పుత్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సునీల్, పూర్ణ కీలకపాత్రలు పోషిస్తున్నారు. 

Advertisement
CJ Advs

 

తాజాగా ఈ సినిమా నుంచి రెండో టీజర్‌ను మేకర్లు విడుదల చేశారు. ఇందులో ఆది సాయి కుమార్ ఇది వరకెన్నడూ కనిపించనంత స్టైలిష్‌గా కనిపించారు. రౌడీ కాప్‌గా యాక్షన్ సీక్వెన్స్‌లో మాస్ ఆడియెన్స్‌‌కు కిక్కిచ్చేలా ఉన్నారు. ఇక పాయల్ రాజ్‌పుత్, ఆదిల రొమాన్స్ ప్రేక్షకులకు కొత్త ఫీలింగ్ ఇచ్చేలా ఉంది.

 

‘ఈ తీస్ మార్ ఖాన్ ఎవరు?’ అనే డైలాగ్‌తో టీజర్ మొదలవుతుంది.. టీజర్ చివర్లో ‘అన్నా ప్లీజ్ అన్నా.. ఒక్క పది నిమిషాలు.. చంపను అన్నా.. జస్ట్ కాళ్లు చేతులు విరగ్గొట్టి వెళ్లిపోతా..’, ‘థ్యాంక్స్ ఫర్ గెలికింగ్ మీ.. నౌ గెట్ రెడీ ఫర్ మై గెలికింగ్’ అనే డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.

 

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ తీస్ మార్ ఖాన్ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 19న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నామని ప్రకటించారు దర్శకనిర్మాతలు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ సినిమా పోస్టర్స్, గ్లింప్స్, మొదటి టీజర్‌లు అంచనాలు పెంచేశాయి. స్టూడెంట్, రౌడీ, పోలీస్‌గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆది సాయికుమార్ నటించడం ఈ సినిమాకు మేజర్ అసెట్. ఈ చిత్రానికి సంగీతం సాయి కార్తీక్ అందించగా.. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ చేశారు. మణికాంత్ ఎడిటర్‌ వ్యవహరిస్తున్నారు.

Aadi Saikumar Tees Maar Khan Teaser 2 Unveiled:

Tees Maar Khan Teaser 2 Talk out
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs