Advertisement
Google Ads BL

లైగర్ ఫస్ట్ సింగల్ అక్డీ పక్డీ సాంగ్


విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్  లైగర్(సాలా క్రాస్‌బ్రీడ్) ఫస్ట్ సింగల్ అక్డీ పక్డీ ప్రోమో సంచలనం సృష్టించింది. యూట్యూబ్, మ్యూజికల్ చార్ట్‌లలో నంబర్ వన్ గా ట్రెండింగ్‌ లో నిలిచింది. దేశం మొత్తం ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్న అక్డీ పక్డీ పూర్తి పాట ఇప్పుడు విడుదలైయింది. అక్డీ పక్డీ మెస్మరైజింగ్ మాస్ బీట్స్ తో పర్ఫెక్ట్ పార్టీ సాంగ్ గా అలరించింది. పాటలో వినిపించిన సాహిత్యం క్యాచీ గా ఉంటూ మళ్ళీ మళ్ళీ పాడుకునేలా వుంది. వివిధ భాషల గాయకులందరూ ఈ పార్టీ ట్రాక్‌ ని అద్భుతంగా ఆలపించారు. మ్యూజిక్ బ్యాకింగ్, ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఫ్రెష్ ఉంటూ అదిరిపోయే బీట్ తో డ్యాన్సింగ్ నెంబర్ గా జోష్ క్రియేట్ చేసింది అక్డీ పక్డీ. సునీల్ కశ్యప్ ఇచ్చిన హుక్ లైన్ లైగర్ విజయ్ డ్యాన్స్ మూమెంట్ లానే అదిరిపోయింది.

Advertisement
CJ Advs

లిజో జార్జ్-డిజె చేతాస్ స్వరపరిచిన ఈ పాటలో విజయ్ దేవరకొండ మాస్, స్టన్నింగ్ డ్యాన్స్‌లు అవుట్ స్టాండింగ్ గా వున్నాయి. డ్యాన్స్ మూమెంట్స్ లో విజయ్ దేవరకొండ గ్రేస్ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. విజయ్‌ కి జోడీగా అనన్య పాండే డ్యాన్స్ మూమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఈ పాటలో విజువల్స్ నెక్స్ట్ లెవెల్ లో వున్నాయి. అక్డీ పక్డీ పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Akdi Pakdi Song From LIGER (Saala Crossbreed) Out:

Akdi Pakdi Song From The Vijay Deverakonda, Puri Jagannadh, Karan Johar, Charmme Kaur LIGER (Saala Crossbreed) Out
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs