Advertisement
Google Ads BL

ధర్మచక్రం షూటింగ్ ప్రారంభం


సంకేత్ తిరుమనీడి, మోనిక చౌహాన్ హీరో హీరోయిన్లుగా నాగ్ ముంత దర్శకత్వంలో.. జీ పీ రెడ్డి నిర్మాతగా పద్మ నారాయణ ప్రొడక్షన్ బ్యానర్ మీద తెరకెక్కుతున్న ధర్మచక్రం ఇటీవలె పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. వినూత్న కథ కథనాలతో రాబోతున్న ఈ మూవీ ప్రారంభోత్సవంలో సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ధర్మచక్రం షూటింగ్ లాంఛనంగా ప్రారంభమవ్వగా.. మొదటి సన్నివేశానికి వరుణ్ క్లాప్ కొట్టగా.. రాజశేఖర్ గారు కెమెరా స్విచ్ఆన్ చేశారు. ఎం శ్రీధర్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం చిత్రయూనిట్ మీడియాతో ముచ్చటించింది.

Advertisement
CJ Advs

నిర్మాత జీపీ రెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో ఆడపిల్లల మీద జరిగే అన్యాయాల మీద ఈ కథను దర్శకుడు రాసుకున్నారు. ఆయన చెప్పిన కథాకథనాలు నచ్చి.. ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చాను అని అన్నారు.

మోనిక చౌహాన్ మాట్లాడుతూ.. నిర్భయ, దిశ ఘటనలాంటివి మనం చూశాం. అలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకు రాకూడదు. నేను ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నాను. మీ ఆశీర్వాదం లభిస్తే ఇంకా మంచి మంచి పాత్రలను పోషించగలను అని అన్నారు.

హీరో సంకేత్ మాట్లాడుతూ.. దర్శకుడు మంచి కథను చెప్పారు. ఎన్ని చట్టాలు వచ్చినా సమాజంలో ఆడపిల్లలకు భద్రత లేకుండా పోతోంది. మంచి సందేశంతో మీ ముందుకు రాబోతున్నాం. ప్రేక్షకుల ఆశీస్సులు కావాలని కోరుకున్నారు.

దర్శకుడు నాగ్ ముంత మాట్లాడుతూ.. ఆడవాళ్ల మీద జరిగే అఘాయిత్యాలు రోజూ చూస్తుంటాం. ఆడవాళ్లకు స్వీయ సంరక్షణ నేర్పించేలా ఈ చిత్రం ఉంటుంది. హీరోయిన్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. నిర్మాత జీపీ రెడ్డి గారికి కథ చెప్పిన వెంటనే నచ్చడంతో.. ఈ సందేశాత్మక చిత్రాన్ని చేద్దామన్నారు.సినిమా షూటింగ్‌ను ప్రారంభించాం. సెప్టెంబర్‌లో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని అన్నారు.

ఈ చిత్రానికి ప్రణయ్ రాజపుటి సంగీతాన్ని అందిస్తున్నారు. ఆనంద్ మిలింగి కొరియోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. ఎం. ఆనంద్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ను చిత్రయూనిట్ మొదలుపెట్టింది.

నటీనటులు: సంకేత్ తిరుమనీడి, మోనిక చౌహాన్ తదితరులు

Dharmachakram movie opening:

<div>Dharmachakram Officially Launched With Pooja Ceremony</div>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs