Advertisement
Google Ads BL

నా కెరీర్ సంతృప్తిగా వుంది: లావణ్య త్రిపాఠి


హ్యాపీ బర్త్ డే జూలై 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతున్న నేపధ్యంలో హీరోయిన్ లావణ్య త్రిపాఠి మీడియాతో మాట్లాడారు. లావణ్య పంచుకున్న హ్యాపీ బర్త్ డే చిత్ర విశేషాలివి.

Advertisement
CJ Advs

మొదటి సారి గన్ పట్టుకోవడం ఎలా అనిపించింది ?

కొత్తగా అనిపించింది. జోనర్, కథ, కథనం అన్నీ కొత్తగా వుంటాయి. సినిమా అద్భుతంగా వచ్చింది. నేను సహజంగానే జిమ్, బాక్సింగ్ చేస్తాను. కానీ మొదటిసారి స్క్రీన్ పై యాక్షన్ చూపించే అవకాశం హ్యాపీ బర్త్ డేతో దక్కింది. హ్యాపీ బర్త్ డే ఎలా వుంటుంది ?

హ్యాపీ బర్త్ డే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇందులో హ్యాపీ అనే పాత్ర చేశాను. హ్యాపీ బర్త్ డే కథలో కీలకంగా వుంటుంది. 

రితేష్ రానా కథ చెప్పినపుడు మీకు నచ్చిన అంశం ? 

కథ ఐడియా చాలా నచ్చింది. చాలా కొత్త జోనర్. సర్రియల్ వరల్డ్ థాట్ చాలా ఎక్సయిట్ చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో సినిమా చేయడం ఇంకా ఆనందం. 

మీరు కామెడీ సినిమాలు చేయడం తక్కువే,.., మొదటిసారి ఇలాంటి డిఫరెంట్ కామెడీ సినిమా చేయడం ఎలా అనిపించింది ? 

నన్ను చాలా మంది సీరియస్ పర్శన్ అనుకుంటారు. నేను చేసిన పాత్రలు కూడా అలా వుండటం వలన ఆ అభిప్రాయం వచ్చివుండోచ్చు. కానీ నేను చాలా జోవియల్ గా వుంటాను. సరదాగా అందరితో జోక్స్ వేయడం నాకు ఇష్టం. హ్యాపీ పాత్ర చేయడం చాలా ఈజీగానే అనిపించింది. పాత్రలో చాలా ఫన్ వుంది. ఇందులో ఫోర్స్ కామెడీ వుండదు. హ్యాపీ బర్త్ డే అందరినీ నవ్విస్తుంది. 

టైటిల్ రోల్ లో సినిమా రావడం ఎలా అనిపించింది ? 

ఫీమేల్ ఓరియెంటెడ్ అనగానే చాలా సీరియస్ గా వుండే పాత్రలే వస్తుంటాయి. కానీ ఇలాంటి ఎంటర్ టైనర్ లో లీడ్ రోల్ రావడం ఆనందం. రితేష్ రానా నన్ను ఒక ఇంటర్వ్యూ లో చూసి హ్యాపీ పాత్రని రాశారు. ఈ విషయంలో చాలా లక్కీగా ఫీలౌతున్నా.

ఇప్పటి వరకూ మీరు చేసిన పాత్రలలో సవాల్ గా అనిపించిన పాత్ర ?

మొదటి సినిమా అందాల రాక్షసిలో మిథున పాత్ర చేసినప్పుడు నటన నాకు కొత్త. ఈ సినిమా లో ది బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాను. తర్వాత చేసిన పాత్రలన్నీ కేక్ వాక్ లానే చేశాను. ఐతే చాలా రోజుల తర్వాత మళ్ళీ హ్యాపీ పాత్ర నాకు చాలా కొత్తగా అనిపించింది. ఇందులో నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించా. హ్యాపీ పాత్ర మీ అందరికీ నచ్చుతుంది. 

హ్యాపీ పాత్ర సవాల్ గా అనిపించిందా ? 

హ్యాపీ పాత్ర చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. మేకప్ మాత్రం కొంచెం కష్టంగా అనిపించింది. అలాగే గన్స్ ని క్యారీ చేయడం కూడా కొంచెం కష్టం అనిపించింది. ఒకొక్క గన్ 9 కేజీలు వరకూ వుంటుంది. దాన్ని మోస్తూ షూట్ చేయడం అంత సులువు కాదు. (నవ్వుతూ)

మీ మొదటి సినిమా రాజమౌళి గారు ప్రజంట్ చేశారు.. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కి ఆయన మళ్ళీ వచ్చారు ఎలా అనిపించిది? 

రాజమౌళి గారు రావడం చాలా ఆనందంగా అనిపించింది. రాజమౌళి గారు టీం అందరిలో ఒక పాజిటివ్ ఎనర్జీ నింపారు. 

పదేళ్ళ కెరీర్ లో టాప్ లీగ్ లోకి చేరుకోలేదనే భావన ఉందా? 

పదేళ్ళుగా ఇండస్ట్రీలో వుంటాను. అదే గొప్ప ఆనందం. అందరూ నెంబర్ వన్ కి వెళ్ళాలని వుండదు కదా. నా వర్క్ ని ఎంజాయ్ చేస్తున్నాను. ఎలాంటి ఒత్తిడి తీసుకొను. మనసుకు నచ్చిన పాత్రలు చేస్తున్నాను. హ్యాపీ పాత్ర కూడా చాలా అద్భుతంగా వుంటుంది. నా ప్రయాణం సంతృప్తికరంగా వుంది.

సినిమాలు తగ్గించేస్తూన్నారని అనిపిస్తుంది. దాదాపుగా ఏడాది కి ఒకే సినిమా చేయడానికి గల కారణం ? 

నేను చాలా కథలు వింటాను. కానీ కథల ఎంపికలో కొంచెం పర్టిక్యులర్ గా వుంటాను. ఒక నటిగా బలమైన పాత్రలు చేయాలనీ అనుకుంటాను. చేసిన పాత్రలే చేయడం నాకు నచ్చదు. బహుశా దీని వలన సినిమాలు తగ్గించినట్లు అనిపించవచ్చు.

క్రైమ్ కామెడీ చాలా వచ్చాయి కదా.. హాప్పీ బర్త్ డే లో  క్రైమ్ -కామెడీని ఎలా మిక్స్ చేశారు ? 

హ్యాపీ బర్త్ డే సర్రియల్ ప్రపంచంలో జరుగుతుంది. ఆ ప్రపంచానికి ఎలాంటి హద్దులు వుండవు. ఇది ఎలా సాధ్యం అనే ప్రశ్న వుండదు. ఎందుకంటే అది ఊహజనితం. హ్యాపీ బర్త్ డేలో ఇది యునిక్ గా వుంటుంది. 

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో పని చేయడం ఎలా అనిపించింది ? 

క్లాప్ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ తో కలసి పనిచేయడం ఆనందంగా వుంది. చెర్రీ గారు అద్భుతమైన నిర్మాత. సినిమా నిర్మాణంలో ఎక్కడా రాజీపడలేదు. హ్యాపీ బర్త్ డేని ఉన్నత నిర్మాణ విలువలతో తీర్చిదిద్దారు. 

హ్యాపీ బర్త్ డే లో హీరో ఎవరు ? 

హ్యాపీ బర్త్ డే విమెన్ సెంట్రిక్ సినిమా కాదు. ఇందులో పాత్రలన్నీ హీరోలే. క్యారెక్టర్ బేస్డ్ కథ ఇది.

భవిష్యత్ లో ఎలాంటి పాత్రలు చేయాలని వుంది ? 

నేను ఏదీ ప్లాన్ చేసుకోను. ఇలాంటి పాత్రలే చేయాలని అలోచించను. అయితే నాకు యాక్షన్ సినిమాలు చేయడం ఇష్టం. 

కొత్తగా చేస్తున్న సినిమాలు ? 

తమిళ్ లో అథర్వ తో ఓ సినిమా చేస్తున్నా. ఇది దాదాపు ఫినిష్ అయ్యింది.

Lavanya Tripathi Interview:

Lavanya Tripathi Interview about Happy birthday Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs