Advertisement
Google Ads BL

కార్తీ సర్దార్ రిలీజ్ డేట్ ఫిక్స్


హీరో కార్తీ, అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్‌ కాంబినేషన్ లో ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌ పై తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ సర్దార్. కింగ్ అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమా తెలుగు రాష్ట్రాల పంపిణీ హక్కులను సొంతం చేసుంది. ఇటీవలి కాలంలో అన్నపూర్ణ స్టూడియోస్ చిత్రాలని సెలక్టీవ్ గా పంపిణీ చేస్తూ, క్యాలిటీ చిత్రాలను అందించే నిర్మాణ సంస్థలతో జతకడుతోంది.

Advertisement
CJ Advs

కార్తీకి తెలుగులో భారీ ఫాలోయింగ్ ఉంది. అభిమన్యుడు చిత్రంతో ప్రశంసలు అందుకున్నాడు దర్శకుడు పిఎస్ మిత్రన్. టెక్నాలజీకల్ థ్రిల్లర్స్ అందించడంలో పేరుపొందిన దర్శకుడు సర్దార్‌ ను మరో ఆసక్తికరమైన కథాంశంతో రూపొందిస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై తమిళంతో పాటు తెలుగులోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.

సర్దార్‌లో రాశి ఖన్నా కథానాయికగా నటిస్తుండగా, రజిషా విజయన్, చుంకీ పాండే కీలక పాత్రలలో కనిపించనున్నారు. జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జివి ప్రకాష్ కుమార్ సంగీత సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. సర్దార్ 2022 దీపావళికి తెలుగు, తమిళంలో థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. 

 

Annapurna Studios Releasing Sardar Grandly In Telugu States:

Annapurna Studios Releasing Karthi, PS Mithran, Prince Pictures Sardar Grandly In Telugu States
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs