Advertisement
Google Ads BL

గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో మనసానమః


విరాజ్ అశ్విన్ నటించిన షార్ట్ ఫిలిం మనసానమః తన రికార్డుల పరంపర కొనసాగిస్తోంది. పలు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ లో అవార్డులు సహా ఆస్కార్ క్వాలిఫైకు వెళ్లిన ఈ లఘు చిత్రం, ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివెల్ లో బెస్ట్ షార్ట్ ఫిలింగా ఎంపికై ఆశ్చర్యపరిచింది. తాజాగా మనసానమః జాతీయ, అంతర్జాతీయంగా అత్యధిక పురస్కారాలు గెల్చుకున్న చిత్రంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. గిన్నీస్ రికార్డ్స్ లో ఎక్కిన తొలి తెలుగు చిత్రంగా చరిత్ర సృష్టించింది. 

Advertisement
CJ Advs

మనసానమఃలో ధృషిక చందర్, శ్రీవల్లి రాఘవేందర్, పృథ్వీ శర్మ హీరోయిన్లుగా నటించారు. గజ్జల శిల్ప నిర్మాణంలో దర్శకుడు దీపక్ రెడ్డి తన తొలి ప్రయత్నంగా మనసానమహా షార్ట్ ఫిలింను తెరకెక్కించారు. యూట్యూబ్ లో రిలీజైన ఈ షార్ట్ ఫిలిం ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శితమై 900కు పైగా జాతీయ, అంతర్జాతీయ అవార్డులను గెల్చుకుంది. ఆస్కార్, బప్టా లాంటి ప్రతిష్టాత్మక అవార్డులకు క్వాలిఫై అయ్యింది. తాజాగా గిన్నీస్ బుక్ లోనూ చోటు దక్కించుకోవడం తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వకారణం.

Manasanamah in the Guinness Book of World Records:

Manasanamah in the Guinness Book of World Records
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs