Advertisement
Google Ads BL

చోర్ బజార్ నన్ను కొత్తగా చూపిస్తుంది


మాస్, కమర్షియల్ అంశాలతో తెరకెక్కిన చోర్ బజార్ సినిమా ప్రేక్షకులను తప్పక ఆకట్టుకుంటుందని అంటున్నారు యువ హీరో పూరి ఆకాష్. జీవన్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాకు వీఎస్ రాజు నిర్మాత. యూవీ క్రియేషన్స్ సమర్పిస్తున్నది. గెహనా సిప్పీ నాయిక. రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను తాజా ఇంటర్వ్యూలో తెలిపారు పూరి ఆకాష్.

Advertisement
CJ Advs

నాకు ఈ సినిమా కథను ఐదు గంటల పాటు చెప్పారు దర్శకుడు జీవన్ రెడ్డి. ఇందులో బచ్చన్ సాబ్ అనే హీరో క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. చోర్ బజార్ ఏరియా అంటే మనం అక్కడి వాళ్లు దొంగతనాలు చేస్తారు అనుకుంటాం. కానీ దగ్గరగా చూస్తే వాళ్ల జీవితాలు వేరుగా ఉంటాయి. అక్కడి మనుషులు, కుటుంబాలు, వాళ్ల కష్టాలు అవన్నీ ఈ సినిమాలో చూస్తారు. హీరో టైర్లు విప్పిసే అమ్మే దొంగ. మీరు కార్ పార్క్ చేస్తే నిమిషాల్లో టైర్లు మాయం చేస్తాడు. ఇందులో రికార్డులు కూడా సాధించేస్తుంటాడు. అయితే ఆ డబ్బుతో అక్కడి పేదవారికి సాయం చేస్తుంటాడు. వాళ్లకు మాత్రం హీరో మంచి వాడు.

నేను ఇప్పటిదాకా చేసిన చిత్రాల్లో ఇది భిన్నమైన సినిమా. పూర్తి కమర్షియల్ అంశాలతో హీరోయిజం ఎలివేట్ చేస్తూ సాగుతుంది. దర్శకుడు జీవన్ రెడ్డి గత చిత్రాల్లోనూ హీరోయిజం బాగా చూపించారు. అలాగే ఈ సినిమాలోనూ ఉంటుంది. నాకు కొత్త ఇమేజ్ క్రియేట్ అవుతుందని ఆశిస్తున్నాను. సీనియర్ నటి అర్చనతో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఆమె మా సినిమాలో నటించేందుకు ఒప్పుకోవడమే అదృష్టం అనుకుంటాం. నా పేరు బచ్చన్ సాబ్ అని ఆమె పెడతారు. నాకు బచ్చన్ సాబ్ అనే పేరు పెట్టడం నాన్న పూరీకి బాగా నచ్చింది. దిల్ దార్ గా బతుకే వ్యక్తి అతను. ఇది కంప్లీట్ గా ఫిక్షన్ క్యారెక్టర్.

ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు చాలా స్టైలిష్ గా ఉంటాయి. క్లైమాక్స్ పదిహేను నిమిషాలు అదిరిపోతుంది. ఫైట్ మాస్టర్ పృథ్వీ బాగా ఫైట్స్ కంపోజ్ చేశారు. వజ్రం ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తుంది. డైమండ్ ఒక క్యారెక్టర్ గా కనిపిస్తుంది. హీరోయిన్ మూగ అమ్మాయిగా ఉంటుంది అనగానే నాకు ఎగ్జైటింగ్ గా అనిపించింది. మూగ అమ్మాయి అంటే మనం జాలి పడతం కానీ వాళ్లు మాకేం తక్కువ కాదు అనే ఆత్మవిశ్వాసంతో ఉంటారు. మాటలు రాకున్నా హీరోయిన్ స్పీకర్ పెట్టి సినిమా డైలాగ్స్ తో సమాధానం చెబుతుంది.

పాటలు, ట్రైలర్ చూశాక నాన్న పూరి జగన్నాథ్ ..సినిమా బాగుందిరా గ్రాండ్ గా కనిపిస్తుంది అని చెప్పారు. ఈ సినిమా కథ ఆయనకు తెలియదు. నీ సినిమాల నిర్ణయాలు నువ్వే తీసుకో, ధైర్యంగా ముందుకెళ్లు అంటారు. నాన్న ఆయన పనుల్లో బిజీగా ఉంటారు. నేను కథ వినేప్పుడే ఒక ప్రేక్షకుడిగా వింటాను. ఈ సినిమాను దర్శకుడు జీవన్ రెడ్డి మీదున్న నమ్మకంతో చేశాను. చానార్ వంటి లొకేషన్స్ లో షూటింగ్ చేశాం. ఒక పెద్ద సెట్ లో కూడా చిత్రీకరణ జరిపాం.

నాకూ వెను వెంటనే సినిమాలు చేయాలని ఉంటుంది. కానీ పరిస్థితులు వేరుగా ఉంటాయి. నాకు ఇప్పటికిప్పుడు ఒక హిట్ సినిమా కావాలి. అందుకోసం ప్రయత్నిస్తున్నా. రొమాంటిక్ సినిమా వేడుకలో నేను హీరోగా నిలబడతాను అని వేదిక మీద చెప్పాను. అందుకు కాలర్ ఎగరేసా. అది ఒక సినిమాతో అయ్యేది కాదు. జర్నీలో జయాపజయాలు భాగమే. చోర్ బజార్ సినిమాలో ఒక కొత్త ప్రపంచం చూస్తారు. జీవన్ రెడ్డి పెద్ద సీన్స్ తెరకెక్కిస్తారు. ఒక సీన్ సాయంత్రం ఆరు గంటలకు మొదలు పెడితే రాత్రి మూడయ్యింది. 

వెబ్ సిరీస్ లలో నటించడం ఇష్టమే కానీ నా మొదటి ప్రాధాన్యం సినిమాకే. సినిమాను థియేటర్ లో చూడాలని కోరుకుంటా. ఎందుకంటే అక్కడే సినిమాకు గౌరవం లభిస్తుంది. నా గత సినిమాలు చూసిన వాళ్లు నా వయసుకు మించిన పాత్రలు చేశానని అన్నారు. ఇక నుంచి అందరికీ నచ్చే సినిమాలే ఎంచుకోవాలని అనుకుంటున్నాను. రెండు మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటి వివరాలు త్వరలో వెల్లడిస్తా.

Akash Puri Interview :

Akash Puri Interview about Chor Bazar
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs