Advertisement
Google Ads BL

విజయ్ వారసుడు ఫస్ట్ లుక్


దళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రానికి టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ చిత్రానికి వారసుడు అనే టైటిల్‌ను ఖరారు చేశారు. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ గా రూపొందుతున్న చిత్రం కావడంతో వారసుడు అనే యాప్ట్ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. ఫస్ట్ లుక్ తో ప్రేక్షకులని మెస్మరైజ్ చేశారు విజయ్. ఫస్ట్ లుక్ లో స్టయిలీష్ గా కనిపిస్తూనే సీరియస్ లుక్ ఇవ్వడం ఆసక్తిని పెంచింది.ది బాస్ రిటర్న్స్ అనే ట్యాగ్ లైన్ మరింత ఇంట్రస్టింగ్ గా వుంది. భారీ అంచనాలు వున్న ఈ కాంబినేషన్ పై టైటిల్, పోస్టర్ ఆ అంచనాలని మరింత భారీగా పెంచాయి. 

Advertisement
CJ Advs

అన్ని వర్గాల ప్రేక్షలని  ఆకట్టుకునే చిత్రాలను రూపొందించే ప్రతిభగల దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ సినిమా కోసం యూనివర్సల్ సబ్జెక్ట్‌ని ఎంచుకున్నారు. ఈ చిత్రానికి తమిళంలో వారిసు టైటిల్ ని ఖరారు చేశారు. ఈ చిత్రం కోసం బ్లాక్ బస్టర్ స్క్రిప్ట్‌ను తయారు చేసిన దర్శకుడు వంశీపైడిపల్లి విజయ్‌ని మునుపెన్నడూ చూడని క్యారెక్టర్‌లో ప్రెజెంట్ చేయనున్నారు.నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, శామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

ప్రస్తుతం చెన్నైలో సినిమా కోర్ టీమ్ పై కీలకమైన భారీ షెడ్యూల్‌ షూటింగ్ జరుగుతుంది. ఈ షెడ్యూల్‌లో చాలా కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. భారీ నిర్మాణ విలువలతో లావిష్ అండ్ విజువల్ గ్రాండియర్ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అత్యున్నత స్థాయి సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. 

Vijay-Vamsi Paidipally project titled in a stylishly:

Thalapathy66 gets a powerful title
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs