Advertisement
Google Ads BL

నాన్ క‌మ‌ర్షియ‌ల్ రేట్ల‌కే ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్


ప్రేక్షకుల మధ్య గోపిచంద్ బర్త్ డే సెలబ్రేషన్స్ జరిపిన పక్కా కమర్షియల్ చిత్ర యూనిట్. స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ మారుతి దర్శకత్వంలో మ్యాచో స్టార్ గోపిచంద్, రాశిఖన్నా జంటగా నటిస్తున్న సినిమా ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌. ఇటీవ‌లే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 1న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. తాజాగా ఆదివారం నాడు మ్యాచో స్టార్ గోపిచంద్ పుట్టిన రోజు సందర్బంగా అభిమానులు మధ్య ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు.

Advertisement
CJ Advs

ఈ ట్రైలర్ ఈవెంట్ లో గోపిచంద్ మాట్లాడుతూ.. నేను ఈ సినిమా చెయ్యడానికి  కారణం యూవీ క్రియేషన్స్ వంశీ, ఈ సినిమా చూస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతారు.రాశిఖన్నా ఈ సినిమాలో మంచి రోల్ చేసింది. ఈ సినిమాకి నాన్ కమర్షియల్ టికెట్ రేట్స్ పెట్టారు మీరు మీ ఫ్యామిలీ తో కలిసి ఎంజాయ్ చెయ్యండి. అల్లు అరవింద్, బన్నీ వాసు, మారుతి తో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది.  

మారుతి మాట్లాడుతూ.. మీరు హ్యాపీగా కాలర్ ఎగరేసుకునే చూసే సినిమా ఇది, ఒక మంచి ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తీసాం. ఈ సినిమా తీయడానికి నాకు అవకాశం ఇచ్చిన యూవీ క్రియేషన్స్ కి, గీతా ఆర్ట్స్ కి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమాలో పనిచేసిన నటీనటులకి, టెక్నీషియన్స్ అందరికి చాలా థాంక్స్.

నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ.. మల్టీప్లెక్స్ లు లేని టైం లో మేము ఇలాంటి సింగిల్ స్క్రీన్ లోనే సినిమాలు చూసేవాళ్ళం, మేము కూడా ఇలా మీలానే ఎంజాయ్ చేసేవాళ్ళం. ఈ సినిమాను తీసింది మాస్ ప్రేక్షకులు గురించే, ఈ సినిమాని చూడండి, ఈ నెల 26న ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంది అక్కడ కలుద్దాం. ఈ సినిమాకి అందరికి అందుబాటులో ఉండే టికెట్స్ రేట్స్ పెట్టాం. నేను పక్కా కమర్షియల్ సినిమా తీసిన కూడా నేను నాన్ కమర్షియల్ గా మాట్లాడుతున్నాను.

రాశిఖన్నా మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఫుల్ లెన్త్ రోల్ చేశాను, ఈ సినిమాలో నేను హీరోయిన్ కాదు కమెడియన్. మారుతీ గారు చాలా మంచి కథ రాసారు. యూవీ క్రియేషన్స్ కి, గీతా ఆర్ట్స్ కు, అలానే ఈ సినిమాకి పనిచేసిన అందరికి చాలా థాంక్స్.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. మీతో సెల్యూట్ కొట్టించుకోడానికి నేను హీరో కాదురా.. విలన్ అంటూ గోపీచంద్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. ట్రైలర్ అంతా పక్కా కమర్షియల్ కోణంలో ఉంది. రాశీ ఖన్నా డైలాగ్స్ కూడా ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకున్నాయి. సత్యరాజ్, రావు రమేష్ పాత్రలు విభిన్నంగా డిజైన్ చేసారు మారుతి ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

Pakka Commercial Trailer Launched:

Pakka Commercial Trailer Launched celebrating Gopi Chand Birthday
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs