Advertisement
Google Ads BL

ఇంక గ్యాప్ ఉండదు: బన్నీ వాస్


ప్రముఖ నిర్మాత గీతా ఆర్ట్స్ అధినేత బన్ని వాసు పుట్టిన రోజు సందర్భంగా ఆయన మీడియాతో ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలోనే చాలా విషయాల గురించి ఆయన చర్చించారు.

Advertisement
CJ Advs

కరోనా సాధారణంగా మూడు సంవత్సరాల నుంచి చాలా సినిమాలు విడుదల కాకుండా ఆగిపోయాయి. అవన్నీ ఇప్పుడు వరసగా వచ్చేసాయి. దాంతో చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలకు టైం దొరకలేదు. ఈ మధ్య అవి కూడా వరుసగా వస్తుండడంతో.. ఇక సినిమాలు గ్యాప్ లేకుండా రిలీజ్ చేస్తాను. జులై 1న పక్కా కమర్షియల్ సినిమా వస్తుంది. ఇది 100% ఎంటర్టైనర్. గోపి చంద్ గారు యాక్షన్ హీరో అయినా కూడా.. మారుతి ఈ సినిమాను నవ్వించడానికి తెరకెక్కించాడు. సెప్టెంబర్ 10న నిఖిల్ హీరోగా వస్తున్న 18 పేజెస్ విడుదల చేస్తాము. దసరా సీజన్ లో సెప్టెంబర్ 30న కిరణ్ అబ్బవరంతో చేస్తున్న వినరో భాగ్యము విష్ణు కథ విడుదల చేస్తాను. అలాగే ఆగస్టులో అల్లు శిరీష్ సినిమా ఉంది. అది కూడా విడుదల చేస్తాను. కంటిన్యూగా ఈ మూడు నాలుగు నెలలు గీతా ఆర్ట్స్ 2 నుంచి సినిమాలు వస్తూనే ఉంటాయి.

ఓటిటి గురించి కూడా నేను చాలా క్లారిటీగా ఉన్నాను. నా సినిమాలేవీ కనీసం 35 రోజులు వ్యవధి లేకుండా ఓటిటికి ఇవ్వలేదు. రాబోయే రోజుల్లో ఆ టైం గ్యాప్ ఇంక పెంచాలని చూస్తున్నాను కానీ తగ్గించాలని కాదు. మా బ్యానర్ నుంచి వచ్చేవన్నీ ఎంటర్టైనింగ్ సినిమాలు. వాటిని థియేటర్లో చూసినప్పుడే మజా వస్తుంది. థియేటర్లో బాగా నవ్వించిన సినిమాలు కూడా ఓటిటిలో ఫ్లాప్ అవుతుంటాయి. ఎందుకంటే కేవలం థియేటర్లోనే చూసే సినిమాలు కొన్ని ఉంటాయి. ఇక టికెట్ల విషయానికి వస్తే తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ను బట్టి రేట్లు పెంచుకునే వెసలుబాటు కల్పించింది. నేను ఎంత సంపాదించాను అని కాకుండా.. ఆడియన్స్ ను థియేటర్ కి ఎంత దగ్గరగా ఉంచాం అనేది ఇంపార్టెంట్. అందుకే పక్కా కమర్షియల్ సినిమాని కూడా అందరికి అందుబాటులో ఉండే  టికెట్ రేట్స్ పెట్టాం.

కామన్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్ సినిమాకి వచ్చే పాజిబిలిటే  ఉన్నట్లే ప్లాన్ చేసాము. 2002 లో నేను ఇండస్ట్రీకి వచ్చాను. నిర్మాతగా 2011 లో నా మొదటి సినిమా చేసాను. దాదాపుగా ఈ పదేళ్లలో చాలా మార్పులు వచ్చాయి. రాముడు బుద్ధిమంతుడు అని చెప్తే ఇప్పుడు వినేవారు లేరు.. రాముడు బెత్తం పడతాడు అని చెప్తే వినే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. థియేటర్ లో ఆడటం కోసం ఎక్స్ట్రార్డనరీ కంటెంట్ తో సినిమా చేయాలి. నార్మల్ ,ఆర్డినరీ కంటెంట్ తో సినిమా చేయలేము. ఇప్పుడు చేసే సినిమాలు అన్నీ అయిపోయాక.. చందు మొండేటి , పవన్ సాధినేని సినిమాలు ఉండబోతున్నాయని తెలిపారు.

Bunny Vasu Interview:

Bunny Vasu Special Interview
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs