Advertisement
Google Ads BL

మ్యూజిక్ స్కూల్ షూటింగ్ పూర్తి


లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళ‌య రాజా సంగీత సార‌థ్యం వ‌హించిన తాజా చిత్రం మ్యూజిక్ స్కూల్. తెలుగు, హిందీ భాష‌ల్లో రూపొందుతోన్న ఈ మోస్ట్ అవెయిటెడ్ మూవీపై ప్రారంభం నుంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. హైద‌రాబాద్‌, గోవా స‌హా ప‌లు ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రిపారు. తాజాగా హైద‌రాబాద్‌లో జ‌రిగిన షెడ్యూల్‌తో చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది. ఈ సినిమాలో మొత్తం 11 పాటలున్నాయి. అందులో కేవ‌లం మూడు పాట‌లు కేవ‌లం మ్యూజిక్‌తోనే సాగుతాయి. సినిమాటోగ్రాఫ‌ర్ కిర‌ణ్ డియోహ‌న్స్ త‌న కెమెరా ప‌నిత‌నంతో విజువ‌ల్స్‌ను గ్రాండ్‌గా తెర‌కెక్కించి సినిమాను నెక్ట్స్ లెవ‌ల్లో తీసుకెళ్లార‌ని రైట‌ర్ - డైరెక్ట‌ర్ పాపారావు బియ్యాల భావిస్తున్నారు. అలాగే శర్మన్ జోషి, శ్రియా శరన్ ప్రాణం పెట్టి తమ నటనతో పాత్రలకు ప్రాణం పోశారని ఆయన తెలిపారు.

Advertisement
CJ Advs

శ్రియా శరన్ మాట్లాడుతూ.. మ్యూజిక్ స్కూల్ ఓ అద్భుత‌మైన స్క్రిప్ట్‌. త‌ల్లిగా మారిన త‌ర్వాత ఈ సినిమాలో న‌టించ‌డానికి అంగీక‌రించాను. కాబ‌ట్టి ఈ సినిమా నాకెంతో ప్ర‌త్యేక‌మైనది. నేను చిన్న పాప‌గా ఉన్న‌ప్ప‌టి నుంచి ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్ వింటూ పెరిగాను. ఇప్పుడు వాటిలో కొన్నింటికి మ్యూజిక్ స్కూల్‌లో న‌టించ‌టం అనేది గొప్ప వ‌రంగా భావిస్తున్నాను. అద్భుత‌మైన న‌టీన‌టులు, చిన్న పిల్ల‌లు, టెక్నిక‌ల్ టీమ్‌తో కలిసి ఈ సినిమా కోసం ప‌ని చేశాను. శ‌ర్మ‌న్ జోషిగారికి ప్ర‌త్యేక‌మైన కృత‌జ్ఞ‌త‌లు. ఆయ‌న ఎప్పుడూ నేను న‌వ్వుతూ ఉండేలా చూసుకున్నారు. అలాగే యామిని రావుగారికి ధ‌న్య‌వాదాలు. మా యూనిట్‌కు ఏది అవ‌స‌ర‌మో దాన్ని స‌మ‌యానికి ఏర్పాటు చేయ‌టంలో వారు ఎంతో స‌పోర్ట్ చేస్తూ వ‌చ్చారు. ఓ గొప్ప పాత్ర‌ను క్రియేట్ చేసి అందులో న‌న్ను న‌టింప చేసినందుకు ద‌ర్శ‌కులు పాపారావుగారికి ధ‌న్యవాదాలు. ఆయ‌న తొలి సినిమా ఇది. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న విజ‌న్ ఎంతో గొప్ప‌గా ఉంది. నా క‌ల‌ను నిజం చేసిన కిర‌ణ్‌గారికి థాంక్స్‌. ఈ సినిమా నాకెప్ప‌టికీ గుర్తుండిపోయే సినిమా ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నాను.

శ‌ర్మ‌న్ జోషి మాట్లాడుతూ.. ఈ సినిమా ప్ర‌యాణం నా హృద‌యాన్ని హ‌త్తుకుంది. మ్యూజిక్ స్కూల్ సినిమా ప్ర‌యాణం ముగిసింది. ఈ సినిమాను ఎంజాయ్ చేశాం. ఎన్నో అనుభూతులున్నాయి. వాట‌ని ఇప్పుడు ప్రేక్ష‌కుల‌కు అందించ‌బోతున్నాం. ఓ గొప్ప ప్యాష‌న్‌తో ఎవ‌రూ ఊహించ‌ని విధంగా భారీ స్కేల్‌తో ఇలాంటి అద్భుత‌మైన సినిమా చేసిన ప్యాష‌నేట్ డైరెక్ట‌ర్ పాపారావుగారి నుంచి మ‌రిన్ని గొప్ప చిత్రాలు రావాల‌ని కోరుకుంటున్నాను. ఆయ‌న హ్యాట్సాఫ్‌ అన్నారు.

Music School Shooting is complete:

It s a wrap for Ilaiyaraaja s musical Music School starring Sharman Joshi and Shriya Saran
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs