డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో 9 అవర్స్


ప్రముఖ దర్శకుడు క్రిష్ షో రన్నర్ గా వ్యవహరిస్తున్న వెబ్ సిరీస్ 9 అవర్స్. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ఓటీటీ ఈ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ను స్ట్రీమింగ్ కు తీసుకొస్తోంది. తారకరత్న, అజయ్, వినోద్ కుమార్, మధు షాలినీ, రవి వర్మ, ప్రీతి అస్రానీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రాజీవ్ రెడ్డి వై, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ కు నిరంజన్ కౌషిక్, జాకోబ్ వర్గీస్ దర్శకత్వం వహించారు. పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ జూన్ 2 తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ ప్రీ రిలజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా 

షో రన్నర్ క్రిష్ మాట్లాడుతూ...టెలివిజన్ సీరియల్స్ నిర్మించడం ఖర్చుతో, శ్రమతో కూడిన పని. ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ వచ్చాక ఒక మంచి కథను వెబ్ సిరీస్ గా చూపించే వీలు దొరికింది. అందుకు డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ వాళ్లకు కృతజ్ఞతలు చెబుతున్నా. మల్లాది గారి రచనలకు నేను అభిమానిని. మా నిర్మాణ సంస్థ నుంచి ఆయన నవలలు కొన్ని రైట్స్ తీసుకున్నాం. ఇంకొన్ని తీసుకోబోతున్నాం. మల్లాది రచన నుంచి వస్తున్న తొలి వెబ్ సిరీస్ 9 అవర్స్. రియల్ టైమ్ క్రైమ్ థ్రిల్లర్ గా ఆకట్టుకుంటుంది. నా గమ్యం సినిమాను కన్నడలో చేసిన జాకోబ్ వర్గీస్, యాడ్ ఫిల్మ్ మేకర్ నిరంజన్ ఈ వెబ్ సిరీస్ ను ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. అన్నారు.

హీరోయిన్ ప్రీతి అస్రానీ మాట్లాడుతూ...9 అవర్స్ వెబ్ సిరీస్ లో నేనొక స్పెషల్ రోల్ చేశాను. ఇంత మంచి పాత్రను నాకు అందించిన క్రిష్ గారికి థాంక్స్. ప్రతి క్యారెక్టర్ బ్యూటిఫుల్ గా ఉంటుంది. టెక్నికల్ గా సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, మ్యూజిక్ ఆకట్టుకుంటాయి. అన్నారు.

నటుడు బెనర్జీ మాట్లాడుతూ...గమ్యం సినిమా నుంచి క్రిష్ గారి సినిమాలో నటించాలని అనుకుంటున్నాను. ఆయన మంచి దర్శకుడు. ఆయన ప్రాజెక్ట్ లో ఉండాలని ప్రతి ఒక్క నటుడు కోరుకుంటారు. ఈ వెబ్ సిరీస్ లో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అన్నారు.

మధు షాలినీ మాట్లాడుతూ...ఈ వెబ్ సిరీస్ లో నేను చిత్ర అనే జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్నాను. క్రైమ్ థ్రిల్లర్ గా 9 అవర్స్ ఆకట్టుకుంటుంది. నేను ఈ కథలో క్రైమ్ సీన్ జరిగేప్పుడు అక్కడే ఉంటాను. వెబ్ సిరీస్ మొత్తం ఒక వింటేజ్ ఫీల్ తో సాగుతుంది. ఈ కథా నేపథ్యానికి తగినట్లు నటించేందుకు ప్రయత్నించాను. క్రిష్ గారి సినిమాలు ఎంతో బాగుంటాయి. ఆయనతో పనిచేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఈ వెబ్ సిరీస్ లో నటించడం సంతోషంగా ఉంది. అన్నారు.

తారకరత్న మాట్లాడుతూ...9 అవర్స్ వెబ్ సిరీస్ లో నాకు బాగా నచ్చిన అంశం ఇందులో ప్రతి క్యారెక్టర్ బాగుండటం. చాలా రోజుల తర్వాత సెట్ లో ఎంజాయ్ చేశాను. ఇద్దరు దర్శకులు ఒక్కొక్కరు ఒక్కో పార్ట్ డైరెక్షన్ చేస్తూ మంచి ఔట్ పుట్ ఇచ్చారు. బ్యాంక్ దొంగతనం అనేది దీంట్లో ఒక భాగం మాత్రమే. కథలో ఇంకా కొత్త విషయాలు ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ ను కుటుంబమంతా కలిసి చూడొచ్చు. క్రిష్ గారి ఆధ్వర్యంలో గుర్తుండిపోయే వెబ్ సిరీస్ చేయగలిగాం. అన్నారు.

ఈ కార్యక్రమంలో వెబ్ సిరీస్ కు పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.

9 Hours Release Date: Disney+ Hotstar Sets June 2 Premiere:

9 Hours Release Date: Disney+ Hotstar
Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES