Advertisement

బ్రహ్మాస్త్ర ట్రైలర్ కి డేట్ ఫిక్స్


ఇంకో 100 రోజుల్లో బ్రహ్మస్త్రం పార్ట్ వన్  థియేటర్లలో విడుదలవుతుంది.

Advertisement

బ్రహ్మస్త్రం ట్రైలర్ కోసం ఆశక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకి  సూపర్ స్టార్ రణబీర్ కపూర్, లెజెండరీ డైరెక్టర్ S.S. రాజమౌళి మరియు దర్శకుడు అయాన్ ముఖర్జీ ట్రైలర్ తేదీని ప్రకటించి అభిమానులని ఆశ్చర్యపరిచారు.

దేశంలోనే అందమైన నగరంగా పేరు పొందిన విశాఖపట్నంను సందర్శించి అభిమానుల మధ్య ఘనంగా మూవీ ప్రమోషన్స్ ప్రారంభించారు. బ్రహ్మాస్త్రం టీం ను ప్రేమతో ఆహ్వానిస్తూ అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ చిత్ర యూనిట్  ప్రసిద్ధ చెందిన చారిత్రాత్మకమైన సింహాచలం ఆలయంలో ప్రార్థనలు కూడా జరిపారు.

ఫాన్స్ మీట్ లో రాజమౌళి మాట్లాడుతూ..

రణబీర్ కపూర్ అడిగారు ఈ సిటీ దేనికి ఫేమస్ అని.?

నేను లవ్ బర్డ్స్ కి ఫేమస్ అని చెప్పాను. (నవ్వుతూ..)

4 సంవత్సరాల క్రితం కరణ్ జోహార్ గారు ఫోన్ చేసి ఒక పెద్ద సినిమా చేయబోతున్నాను, మా డైరెక్టర్ అయాన్ ముఖర్జీ అని ఒకరున్నారు ఒక సారి ఈ కథ విన్నాక మీకు నచ్చితే మిమ్మల్ని సౌత్ ఇండియాలో ఈ సినిమాకి సమర్పకుడిగా అనుకుంటున్నాను అని చెప్పారు. ఆ తరువాత మొదటి సారి అయాన్ ను కలిసాను. ఆయన కథ చెప్పిన విధానం కంటే ఆయన సినిమా మీద పెంచుకున్న ప్రేమ, తను చెప్తున్నా ఎక్సయిట్మెంట్ కి నేను చాలా చాలా ఇంప్రెస్స్ అయ్యాను. ఆ తరువాత తను తయారుచేసుకున్న  విజువల్స్ తన అప్పటివరకు  షూట్ చేసిన మెటీరియల్ అంత చూపిస్తుంటే సినిమా ఇండస్ట్రీకి ఇంకో పిచ్చోడు దొరికాడని ఫిక్స్ అయ్యాను , ఈ సినిమాను పెద్ద స్క్రీన్ మీదే చూడాలి అనే ఒక సినిమాని తయారుచేసాడు . ఈ సినిమాని నాకు 20 నిమిషాలే చూపించి, మా నాన్నగారికి మొత్తం చూపించాడు.

ఒక బ్లాక్ బస్టర్ సినిమా తీసి పెట్టుకున్నాడు అని నాన్నగారు చెప్పారు. ట్రిపుల్ ఆర్ తర్వాత నేను రెండుసార్లు బొంబాయ్ కి వచ్చాను అయినా నాకు సినిమా మొత్తం చూపించలేదు. అయినా  అన్నం ఉడికిందా లేదా అని చెప్పడానికి రెండు మెతుకులు ముట్టుకుంటే చాలు అన్నట్లు, నాకు ఆ 20 నిమిషాల్లోనే తెలిసిపోయింది అంటూ చెప్పుకొచ్చారు.

స్క్రీన్ మీదే కాకుండా పర్సనల్ గా కూడా నాగార్జున గారు నాకు చాలా ఇష్టం అంటూ.. అలానే అలియా భట్ గురించి ప్రస్తావిస్తూ ఆమె ఈ సినిమాలో ఉండటం దర్శకుడి అదృష్టం, రణబీర్ హృదయంలో ఉండటం రణబీర్ అదృష్టం అని చెప్పుకొచ్చారు.

దర్శకుడు అయాన్ ముఖర్జీ మాట్లాడుతూ :

ఈ రోజు నాకు చాలా ప్రత్యేకమైంది, దీనికి రెండు కారణాలు ఉన్నాయ్, నా రెండో సినిమా యే జవానీ హై దీవానీ 9 ఏళ్ళ క్రితం ఇదే రోజున రిలీజ్ అయింది.  ఈ సినిమా కోసం నేను పదేళ్లు తీసుకున్నాను. నేను చాలా పెద్దగా ఊహించాను, మునుపెన్నడూ తీయని ఒక గొప్ప సినిమాను తీయాలనే  ఆలోచన నాకు ఉండేది, అప్పటికి రాజమౌళి సర్ ఇంకా బాహుబలి కూడా చెయ్యలేదు.

ఇంత గొప్ప సినిమాను ఊహించేది నేను మాత్రమే అని ఫీల్ అయ్యేవాన్నీ..

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎన్నో హాలీవుడ్ సినిమాలు 10, 20 సంవత్సరాల క్రితం రాసిన కామిక్ బుక్స్ ఆధారంగా తీసినవే.  

BRAHMĀSTRA TRAILER OUT ON..:

BRAHMĀSTRA TRAILER OUT ON JUNE 15
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement