Advertisement
Google Ads BL

ఎవ‌ర్‌గ్రీన్ చిత్రం ఎఫ్‌3 – F3 విజ‌యోత్స‌వ స‌భ‌


విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, దిల్‌రాజు కాంబినేషన్ లో విడుద‌లైన సినిమా ఎఫ్‌3. మే 27న విడుద‌లై డ‌బుల్ హ్యాట్రిక్ సాధించింది. ఈ సంద‌ర్భంగా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ వేడుక‌ను హైద‌రాబాద్ లో చిత్ర యూనిట్ నిర్వ‌హించింది. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ అంతా పాల్గొంది.

Advertisement
CJ Advs

విక్ట‌రీ వెంక‌టేష్ మాట్లాడుతూ, నాకు నిజంగా చాలా సంతోషంగా వుంది. తెలుగు ప్రేక్ష‌కులంద‌రికీ న‌చ్చినందుకు హ్యాపీగా ఫీల‌వుతున్నాను. బిగ్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ఇచ్చారు. నేను మాట‌ల్లో చెప్ప‌లేను. ఈ సినిమా షూటింగ్ జ‌రిగిన 100 రోజుల్లోనూ పాజ‌టివ్ వైబ్రేష‌న్స్ వ‌చ్చాయి. ప్ర‌తీ సీన్ చేసేట‌ప్పుడు ఎంక‌రేజ్ మెంట్ వండ‌ర్‌ఫుల్ అనుభ‌వం. అలాంటిదే ప్రేక్ష‌కులు ఇచ్చారు. రియ‌ల్ టీమ్ వ‌ర్క్ ఇది. ఎఫ్‌2 త‌ర్వాత ఎఫ్‌3 చేశారంటే ప్ర‌తి ఒక్క‌రూ స్వంత సినిమాగా భావించి చేశారు. ప్రేక్ష‌కులు ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియ‌న్స్ థియేట‌ర్‌ కు వ‌స్తున్నారు. వెరీవెరీ హ్యాపీ. నా అభిమానులు థియేట‌ర్‌ లో న‌న్ను చూసి మూడేళ్ళ‌యింది. నా సినిమా చూసి మ‌న‌స్పూర్తిగా అభినందిస్తున్న ఇండ‌స్ట్రీలోనివారికి థ్యాంక్స్ చెబుతున్నా. నాకు చాలా కాల్స్ వ‌చ్చాయి. అంద‌రికీ వెరీవెరీ థ్యాంక్స్ అన్నారు.

వ‌రుణ్‌తేజ్ మాట్ల‌డుతూ, ఎఫ్‌3 సినిమాను స‌క్సెస్ చేసిన తెలుగుప్రేక్ష‌కుల‌కు థ్యాంక్స్‌. స‌హ‌జంగా యాక్ష‌న్‌, మైథ‌లాజిక‌ల్ సినిమాల‌ను ఎంక‌రేజ్ చేస్తుంటారు. ఆ కోవ‌లోనే ఎఫ్‌3 సినిమాను స‌క్సెస్ చేశారు. పిల్ల‌లు కూడా సినిమా చూసి డాన్స్ చేస్తున్నారు. ఇలాంటి సినిమా తీసి ప్రెస్టేష‌న్ లేకుండా చేసిన ద‌ర్శ‌కుడు అనిల్‌గారికి థ్యాంక్స్‌. మా ఎఫ్‌3 కుటుంబ స‌భ్య‌లంద‌రికీ ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు. కోవిడ్‌లో టైంలో ఇంటిలోవారికంటే ఈ టీమ్‌తోనే ఎక్క‌వ సేపు గ‌డిపాను. రాజేంద్ర‌ప్ర‌సాద్‌గారు నాకు ఫ్రెండ్ లాంటివారు. వెంక‌టేష్‌గారికి, దిల్‌రాజు, అనిల్ గారికి బిగ్ థ్యాంక్స్‌. ఇంకా మిగ‌తా ఫంక్ష‌న్ల‌లో మ‌రిన్ని విష‌యాలు మాట్లాడుకుందాం అని అన్నారు.

రాజేంద్ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ, నా 45 ఏళ్ళ సినీ జీవితంలో నాకు న‌చ్చిందే చెప్పాను. ఎఫ్‌3 సినిమా చూశాక ఈ సినిమా హిట్ కాక‌పోతే మొహం చూపించ‌న‌ని అన్నాను. అందుకే నేను మాస్క్ వేసుకుని ఇలా వ‌చ్చాను. ఇప్పుడు నిజ‌మైన స‌క్సెస్ ప్రేక్ష‌కులు ఇచ్చారు. ఈ సినిమాను త్రిబుల్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ఇచ్చారు. సోమ‌వారంనాడు కూడా గుంటూరుతో అన్ని ప్రాంతాల్లో హౌస్ ఫుల్ అయ్యాయి. ఈ సినిమాను రెండు న‌మ్ముకుని తీశాం. ఒక‌టి న‌వ్వు. రెండు ప్రేక్ష‌కులు న‌మ్ముకుని తీశాం. 45 ఏళ్ళుగా నేను న‌వ్వునే న‌మ్ముకుని సినిమాలు చేస్తున్నాను. అలా ఎఫ్‌2, ఎఫ్‌3 చేశాను. ప్ర‌పంచంలోని న‌లుమూల‌ల‌నుంచి నాకు ఫోన్లు వ‌స్తున్నాయి. మ‌ళ్ళీ మీ రోజులు గుర్తుకువ‌చ్చాయి అంటూ నాతో అంటున్నారు. నాకు మాత్రం మాయ‌లోడు సినిమా గుర్తుకు వ‌చ్చింది. మ‌న‌కు పండుగ రోజుల్లో పాత సినిమాలు టీవీల్లో వేస్తుంటారు. గుండ‌మ్మ‌క‌థ‌, అప్పుచేసి ప‌ప్పుకూడు.. వంటి చిత్రాలు న‌వ్వులు పూయిస్తుంటాయి. అలా ఎఫ్‌3 న‌వ్వులు పూయించింది అని తెలిపారు.

అలీ మాట్లాడుతూ, అద్భుత‌మైన హిట్ ఇచ్చిన ప్ర‌పంచంలోని తెలుగు ప్రేక్ష‌కుల‌కు థ్యాంక్స్‌. ఈరోజు నిజ‌మైన పండ‌గు రోజు. సోమ‌వారం కూడా హౌస్‌ఫుల్ అవ్వ‌డానికి కార‌ణం ఈ బేన‌ర్ కున్న విలువ‌, ద‌ర్శ‌కుడు అనిల్‌రావిపూడి, హీరోలైన వెంక‌టేష్‌, వ‌రుణ్‌తేజ్ పై వున్న న‌మ్మ‌కం. సినిమా బాగుంటే ఎంత పెద్ద హిట్ ఇస్తార‌నేందుకు ఎఫ్‌3 నిద‌ర్శ‌నం. చాలామంది ఫోన్లు చేసి రెండు, మూడు సార్లు చూశామంటున్నారు. సినిమా హిట్ అయితే అంద‌రూ బాగుంటారు. కొంత‌మంది హిట్ అయిన సినిమాను బాగోలేద‌ని ప్ర‌చారం చేస్తున్నారు. ఇలా చేయ‌డం స‌రైందికాద‌ని మ‌న‌వి. ఎందుకంటే మీరుకూడా సినిమాను న‌మ్ముకున్న‌వారే క‌దా. గ‌తంలో చెన్నైలో వుండ‌గా ఇలాంటి వార్త‌లు వినిపించేవికాదు. ఒక‌రి సినిమా హిట్ అయితే మ‌రొక‌రు బాధ‌ప‌డ‌డం ఏమిటో అర్థంకాదు. అవ‌త‌లివారు బాగుండాలి అని కోరుకుంటే దేవుడు మ‌న‌ల్ని బాగా చూస్తాడు. అనిల్‌గారు నా చేతికి గ‌న్ ఇచ్చి చేయించినందుకు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు. ఇది చాలా అద్భుత‌మైన పండుగ‌. అందులో నేనూ వుండ‌డం చాలా ఆనందంగా వుంది అన్నారు.

ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ, నాకిది 6వ సినిమా. ఉద‌య‌మే ఒక ఫోన్ కాల్ వ‌స్తే బ్లాక్ బ‌స్ట‌ర్‌. నాకు ప్ర‌తిసారీ వి.వి. వినాయ‌క్‌గారు చేస్తుంటారు. ఇలా ఆరోసారి చేశారు. ఇంకా చాలామంది ఫోన్‌లు చేశారు. మైత్రీమూవీస్‌ వారు ప‌ర్స‌న‌ల్‌గా కాల్ చేశారు. డి.సురేష్‌బాబు గారు సినిమా విడుద‌ల‌కు ముందే చూశారు. ఆయ‌న ముందే హిట్ అన్నారు. అలా నా సినిమాను హిట్ చేసిన ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేక ధ‌న్యవాదాలు తెలియ‌జేసుకుంటున్నాను. ఈనెల 27న విడుద‌లై నేటికీ క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురుస్తూనే వుంది. ఈ వీక్ కూడా ఎగ్జిబిట‌ర్ల‌కు, కొన్న పంపిణీదారుల‌కు క‌లెక్ష‌న్ల‌తో న‌వ్వులు పూయించాల‌ని కోరుకుంటున్నా. ఈరోజు సినిమాను జ‌నాల‌ముందుకు తీసుకెళ్ళాలంటే ప్ర‌మోష‌న్ కీల‌కం. అందుకు వంశీ శేఖ‌ర్‌, నాని, మ‌నోజ్‌ల‌కు ధ‌న్య‌వాదాలు. నైజాంలో దాదాపు 9ల‌క్ష‌ల 50వేల మంది ఆడియ‌న్స్ చూశారు. పాండ‌మిక్ త‌ర్వాత సినిమారంగం ఇబ్బందిలోవుంది. అందుకే ప్ర‌తి సెక్ష‌న్‌కు సినిమా చేరువ‌కావాల‌ని కోరుకున్నాం. అందుకు అఖండ‌, పుష్ప‌, ఆర్‌.ఆర్‌.ఆర్‌., భీమ్లానాయ‌క్‌, స‌ర్కారువారిపాట చిత్రాలు థియేట‌ర్‌కు ప్రేక్ష‌కుల‌ను తీసుకు వ‌చ్చాయి. ఇప్పుడు ఎఫ్‌3 తీసుకువ‌చ్చింది. తెలుగు సినిమాకు పూర్వ‌వైభ‌వం తీసుకువ‌చ్చిన ప్రేక్ష‌కుల‌కు థ్యాంక్స్‌. ఈ సినిమాకు నా వెన్నంటి వుండి బ‌లంగా నిల‌బ‌డిన దిల్‌రాజు, శిరీష్‌కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నాను అన్నారు.

వై. విజ‌య మాట్లాడుతూ, సినిమా చేసేట‌ప్పుడే సూప‌ర్ డూప‌ర్ హిట్ అవుతుంద‌ని అనుకున్నాం. అలాగే అయింది. ఇందులో న‌టించినందుకు గ‌ర్వంగా వుంది. వెంక‌టేష్‌గారితో క‌లియుగ పాండ‌వులు నుంచి చేశాను. దిల్‌రాజు, శిరీష్‌గారి సినిమాలు మ‌రిన్ని హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

F3 Success Meet:

F3 Excellent Hit
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs