Advertisement
Google Ads BL

శివకార్తికేయన్-అనుదీప్ మూవీ రిలీజ్ డేట్


వరుణ్ డాక్టర్ , కాలేజ్ డాన్ వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న స్టార్ హీరో శివకార్తికేయన్ హీరోగా జాతి రత్నాలు సినిమాతో  బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్న దర్శకుడు అనుదీప్ దర్శకత్వంలో #SK20 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం శర వేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది.  అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

Advertisement
CJ Advs

కాలేజ్ డాన్ చిత్రం తెలుగులో బ్లాక్ బస్టర్ విజయం సాధించడంపై  హీరో శివకార్తికేయన్ ని నిర్మాత సురేష్ బాబు అభినందించారు. అలాగే  SK20విడుదల తేదీని కూడా ప్రకటించారు. #SK20 చిత్రాన్ని వినాయక చవితి పర్వదినాన తెలుగు, తమిళంలో ఆగస్టు 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల చేస్తున్నాం. ఫస్ట్ లుక్, ఇతర అప్‌డేట్‌లు త్వరలో వెల్లడిస్తాం అని తెలిపారు సురేష్‌బాబు.  

ఈ సినిమా కథ భారతదేశంలోని పాండిచ్చేరి,  బ్రిటన్‌లోని లండన్ నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రంలో మరియా ర్యాబోషప్క కథానాయికగా నటిస్తుండగా, సీనియర్ నటుడు సత్యరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

SK20 Releasing In Telugu & Tamil On August 31st:

Sivakarthikeyan, Anudeep KV, SVCLLP, Suresh Productions, Shanthi Talkies #SK20 Releasing In Telugu & Tamil On August 31st
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs