Advertisement
Google Ads BL

రాంచరణ్ వరి చిత్తరువు జైరాజ్ నవ్యావిష్కరణం


ఏదైనా కొత్తగా  చేస్తేనే  నలుగురి మెప్పు పొందుతున్న  విజయ సూత్రాన్ని నమ్మిన జైరాజ్ మెగాహీరోలకు వీరాభిమాని చిన్నతనం నుంచి ఆర్ట్ పట్ల అభిరుచి పెంచుకున్న మీరు నచ్చిన  మెచ్చిన మెగాస్టార్ శ్రీ రాంచరణ్ గారి చిత్రాల్ని పొలాల్లో పండించి  ఆకాశమంత  అభిమానాన్ని చాటుకుంటూ వస్తున్నారు . 

Advertisement
CJ Advs

మెగాపవర్ స్టార్  శ్రీ  రాంచరణ్  జన్మదిన వేడుకల్లో భాగంగా  ఆయన  వరిచిత్రాల్ని పండించారు .

గొర్లఖాన్ దొడ్డి  పొలాల్లో రాంచరణ్ వరిచిత్రం

గద్వాల్ జిల్లా గట్టు మండలం గోర్లఖాన్ దొడ్డి   ప్రాంతం లో పొలాల్ని కౌలుకు తీసుకుని రాంచరణ్ వరిచిత్రాన్ని వేయడం ప్రారంభించారు జైరాజ్ .

అంతెత్తునుంచి ఈ చిత్రాన్ని తీస్తే రాంచరణ్ చిత్తరువు స్పష్టంగా కనిపిస్తుంది . 

ఇందుకోసం మూడునెలల శ్రమపడ్డారు . జైరాజ్ వరినాట్లేసి  బొమ్మను చిత్రీకరించారు.

ప్రతి పుట్టినరోజు నాడు కొత్తగా ఏదో చేసి అభిమాన హీరో కి అంకితం చేయాలన్న తపనతో  ఉన్న జైరాజ్ అభిమాని అంటే ఇలా ఉండాలనే విధంగా తనని తాను తీర్చి దిద్దుకుంటున్నారు . 

పాదయాత్ర ద్వారా రాంచరణ్ తో కలయిక 

తన ఊరినుంచి హైదరాబాద్ లో ని రాంచరణ్  ఇంటిదాకా 264  కిలోమీటర్లు  పాదయాత్ర  చేసే మరి ఆయన్ని స్వయంగా కలుసుకున్నానంటూ  జైరాజ్ చెప్తున్నారు  ఆయన్ని కలుసుకున్న క్షణాలు గుండెల్లో పెట్టుకుని భద్రపరుచుకున్నారంటున్నారు. 

అమ్మ నాన్న లేరని ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తూ ఇప్పుడు రాంచరణ్ వరిచిత్రాన్ని పొలాల్లో పండించేందుకు వేల రూపాయలదాకా ఖర్చయిందన్నారు. 

అప్పు చేసి ఖర్చుచేయదంటూ శ్రీర్ స్వామి నాయుడు గారు హితవు పలికారన్నారు 

US లో ఉన్న విజయ్ రేపల్లె గారు ఈ చిత్రాలు పండించేందుకు అయ్యే ఖర్చును భరించారని జైరాజ్ చెప్పారు 

అడుగడుగునా స్వామినాయుడు గారు అందిస్తున్న ప్రోత్సహం మరిచిపోలేనిదన్నారు .

ఈ విషయం తెలుసుకున్న మెగా పవర్ రాంచరణ్ ఈ రోజు Mr . Jayraj ని  తన నివాసానికి పిలిపించుకుని సుమారు 45  నిముషాలు మాట్లాడి అతనికి  ఆర్థిక సహాయం చేయడమేగాక అతని మేధస్సు మెచ్చుకుని సినీపరిశ్రమలో తగిన స్తానం కల్పిస్తామని మాట ఇవ్వడం విశేషం .

ఈ సందర్భంగా  Mr . జైరాజ్ మాట్లాడుతూ  మారుమూల గ్రామంలో ఉన్న నన్ను గుర్తించి నాకు ఇంత సప్పోర్ట్ చేస్తున్న శ్రీ రామ్ చరణ్ గార్కి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను  అని తెలపడం జరిగింది .

Mega Power star met Mega Fan:

Mega Power Star Ram Charan Met His Die Hard Fan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs