Advertisement
Google Ads BL

విక్రమ్ ఫస్ట్ సింగల్ మత్తుగా మత్తుగా


కమల్ హాసన్-లోకేష్ కనగరాజ్- శ్రేష్ట్ మూవీస్- రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ విక్రమ్ ఫస్ట్ సింగల్ మత్తుగా మత్తుగా లిరికల్ వీడియో విడుదల

Advertisement
CJ Advs

యూనివర్సల్ హీరో కమల్ హాసన్, సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ విక్రమ్. కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్  ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం ట్రైలర్ ఇటివలే విడుదలై సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. విక్రమ్ మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగల్ మత్తుగా మత్తుగా పాట లిరికల్ వీడియోని విడుదల చేసింది చిత్ర యూనిట్. 

స్టార్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ ఈ పాట ని మాస్, గ్రూవీ సాంగ్ గా డిజైన్ చేశారు. అదిరిపోయే బీట్ తో డ్యాన్సింగ్ నెంబర్ గా కంపోజ్ చేసిన ఈ పాట థియేటర్ లో ఫ్యాన్స్ తో విజల్స్ వేయించేలా వుంది. ఈ పాటలో కమల్ హాసన్ డ్యాన్స్ మూవ్స్ నెక్స్ట్ లెవల్ లో వున్నాయి. ముఖ్యంగా తలపై షర్టు కప్పుకొని కమల్ హాసన్ చేసిన మాస్ డ్యాన్స్ ప్రేక్షకులని అలరిస్తుంది. కమల్ హాసన్ ఈ పాటని స్వయంగా పాడటం మరో ప్రత్యేకత. చంద్రబోస్ అందించిన సాహిత్యం కూడా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ మరో పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. అలాగే స్టార్ హీరో సూర్య ఈ చిత్రంలో గెస్ట్ లో అలరించబోతున్నారు. కమల్ హాసన్ హీరోగానే కాకుండా రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.

ప్రధాన తారణంతో పాటు కాళిదాస్ జయరామ్, నరైన్, అర్జున్ దాస్, శివాని నారాయణన్ కూడా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్ గా, ఫిలోమిన్ రాజ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. స్టార్ హీరో నితిన్‌ హోమ్ బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదల చేయనుంది.  జూన్ 3న విక్రమ్ ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమౌతుంది.

తారాగణం: కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్, కాళిదాస్ జయరామ్, నరేన్, అర్జున్ దాస్, శివాని నారాయణన్ తదితరులు.

Vikram First Song Mathuga Mathuga Lyrical Out:

<span>Kamal Haasan, Lokesh Kanagaraj, Sreshth Movies, Raaj Kamal Films International s Vikram First Song Mathuga Mathuga Lyrical Out</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs