Advertisement
Google Ads BL

దేశవ్యాప్తంగా అడివి శేష్ మేజర్ ప్రివ్యూలు


అడివి శేష్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా చిత్రం మేజర్ జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా  విడుదలవుతోంది.  ట్రైలర్, పాటలకు విశేష స్పందన అందుకోవడంతో భారీ అంచనాల పెరిగాయి. ముఖ్యంగా రియల్ హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ బయోపిక్ ని ఘనవిజయంగా మలిచి మేజర్ సందీప్ కి ఘనమైన నివాళి అర్పించేందుకు చిత్ర యూనిట్ అన్ని సన్నాహాలు చేస్తుంది.

Advertisement
CJ Advs

సాధారణంగా స్టార్ హీరోల సినిమాల ప్రీమియర్ షోలు ముందుగా చూస్తుంటాం. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ప్రతి భారతీయుడు చూడవలసిన కథ. రియల్ హీరో సందీప్ మేజర్ చిత్రానికి కూడా దేశవ్యాప్తంగా ప్రివ్యూలు వుండబోతున్నాయి. ఇండియాలో మొట్టమొదటిసారిగా దేశవ్యాప్తంగా సినిమాను ప్రదర్శించడానికి మేజర్ చిత్ర యూనిట్ బుక్‌మైషోతో జతకట్టింది. జూన్ 3న అధికారికంగా విడుదలకాబోయే ముందే మేజర్ ప్రత్యేక ప్రివ్యూలు వివిధ నగరాల్లో ప్రదర్శించనున్నారు. బుక్‌మైషో యాప్ స్క్రీనింగ్ లిస్టు లో మీ సిటీని చూసి మేజర్ ప్రివ్యూ కోసం ఇప్పుడే  రిజిస్టర్ చేసుకోండి.

Adivi Sesh Pan India film Major is releasing on June 3rd:

<span>Adivi Sesh Pan India Film Major Previews Across The Country</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs