Advertisement
Google Ads BL

ఉత్తమ విలన్ కేరాఫ్ మహాదేవ పురం టీజర్.


హృషీకేష క్రియేషన్స్, బీష్మా ప్రొడక్షన్స్ పతాకంపై విజయ్, శ్రావ్య (తొలిపరిచయం) జంటగా రాజారెడ్డి పానుగంటి దర్శకత్వంలో వి. సాయి లక్ష్మీనారాయణ గౌడ్, పి శ్రవణ్ కుమార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఉత్తమ విలన్ కేరాఫ్ మహాదేవపురం. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంతుంది. సందర్భంగా ఈ చిత్ర టీజర్ ను నటుడు మంచు మనోజ్ విడుదల చేశారు.

Advertisement
CJ Advs

నటుడు మంచు మనోజ్ మాట్లాడుతూ.. ఉత్తమ విలన్ టీజర్ బాగుంది. లవ్, యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు పక్కా కమర్షియల్ మూవీగా వస్తున్న ఈ చిత్రాన్ని రాజారెడ్డి పానుగంటి తెరకెక్కించిన విధానం చాలా బాగుంది. నటీనటులు అందరూ చక్కగా నటించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలి అన్నారు.

చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. మంచు మనోజ్ గారు ఎంతో బిజీ గా ఉన్నా మా చిత్ర టీజర్ ను రిలీజ్ చేశారు. వారికి మా చిత్ర యూనిట్ తరుపున ధన్యవాదాలు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపు కుంటుంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ ఉత్తమ విలన్ చిత్రం అందరినీ అలరిస్తుంది అని అన్నారు.

చిత్ర దర్శకుడు రాజారెడ్డి పానుగంటి మాట్లాడుతూ.. సినిమా చాలా బాగా వచ్చింది. దుబాయ్ లో, కొండమడుగు ఊరిలో షూటింగ్ చెయ్యడం జరిగింది. ప్రొడ్యూసర్స్ సాయి, శ్రావణ్ లు ఈ మూవీ కొరకు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా  ఏం కావాలంటే అది కాదనకుండా అన్ని సమకూరుస్తూ ఈ చిత్రం ఒక రేంజ్ లో రావడానికి కారణమయ్యారు. ఈ చిత్రానికి సహకరించిన నటీనటులకు, డైరెక్షన్, టెక్నికల్ డిపార్ట్ మెంట్స్ అందరికీ థాంక్స్ చెప్పారు.

Uttama Villain teaser release:

Uttama Villain C o Mahadevpuram teaser released by Hero Manchu Manoj
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs