ఎక్కడెక్కడో వున్న కొత్త కొత్త ప్రతిభావంతులైన గాయనీ గాయకులను పరిచయం చేయడంలో ముందుంటుంది "స్టార్ మా". ఎన్నో అద్భుతమైన స్వరాలను సినిమా రంగానికి పరిచయం చేసింది స్టార్ మా.
స్టార్ మా స్టార్ సింగర్ వేదిక పైన పాడిన ఎందరో ఇప్పుడు మంచి సింగర్స్ గా తమ స్వరాలను వినిపిస్తున్నారు. ఈ పరంపరలో స్టార్ మా ఇప్పుడు కేవలం పిల్లల కోసం "సూపర్ సింగర్ జూనియర్" పేరుతో ఓ కొత్త సిరిస్ ని రూపొందించింది. 6 నుంచి 15 సంవత్సరాల పిల్లలతో జరగనున్న ఈ సిరీస్ కోరుకున్నంత వెరైటీ గా, కావాల్సినంత ఫన్ పంచడానికి సిద్ధమవుతోంది.
ఈ సిరీస్ కోసం పిల్లల నుంచి ఎంట్రీలు పంపించమని స్టార్ మా లో ప్రోమో ప్రసారం చేసినపుడు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి 3 వేలకు పైగా ఎంట్రీ లు వచ్చాయి. వీళ్ళ నుంచి రకరకాల వడపోతలు జరిగాక 14 మంది టాప్ కంటెస్టెంట్స్ షో లో పాల్గొనే అర్హత సాధించారు. వీళ్ళతో "సూపర్ సింగర్ జూనియర్" సిరీస్ ప్రారంభం అవుతుంది. టెలివిజన్ యువసంచలనాలు సుధీర్, అనసూయ ఈ షో ని ఎనెర్జిటిక్ గా నడిపించబోతున్నారు.
ఎన్నో భాషల్లో వేల పాటలు పాడి, ఎన్నో సినిమాలకు డబ్బింగు చెప్పిన మనో, నిత్య వసంత కోయిల చిత్ర, సెన్సషనల్ టాలెంట్స్ రెనినా రెడ్డి, హేమచంద్ర న్యాయ నిర్ణేతలు.
సూపర్ సింగర్ జూనియర్ - మే 22 న సాయంత్రం 6 గంటలకు అంగరంగ వైభవంగా లాంచ్ అవుతోంది. ఆ ఆ తరవాతి వారం నుంచి ప్రతి శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రసారమవుతుంది.
సూపర్ సింగర్ జూనియర్ ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://youtu.be/rrGt_GP5C_Q
Content Produced by: Indian Clicks, LLC