Advertisement
Google Ads BL

ఫ్రీ గానే RRR మీ ZEE5 లో


ZEE5 తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ మరియు ఇతర భాషల్లో వివిధ ఫార్మాట్‌లలో అనేక రకాల కంటెంట్‌ను నిర్విరామంగా అందిస్తోంది. ZEE5  ప్రారంచిన నాటినుండి వినోదంలో వీక్షకులను ఆకట్టుకుంటూ ఓటిటి లలోనే ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌గా దేశవ్యాప్తంగా ZEE5 మంచి పేరు తెచ్చుకుంది. అటువంటి పాపులర్ ప్లాట్‌ఫారమ్ ఇప్పుడు RRR రౌద్రం రణమ్ రుధిరంని అన్ని భారతీయ భాషలలో తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. మరో మాటలో చెప్పాలంటే, భారతదేశపు అతిపెద్ద డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ఈ సంవత్సరంలో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌ RRR ద్వారా ZEE5 అత్యుత్తమ వినోదాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది.

Advertisement
CJ Advs

RRR (రౌద్రం రణం రుధిరం) స్ట్రీమింగ్ ప్రారంభం కావడానికి మే 20 గొప్ప రోజు కానుంది. రాజమౌళి సినిమా పే పర్ వ్యూ విధానంలో అందుబాటులో ఉంటుందని ఇంతకుముందు ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే..కానీ ఆ నిర్ణయాన్ని ప్రేక్షకులు స్వాగతించడం లేదు. 

అయితే ZEE5 టీం సాధారణ ప్రజల అభిప్రాయాలను  పరిగణనలోకి తీసుకుని, ZEE5 T-VOD మోడ్‌ను తొలగించాలని నిర్ణయించింది మరియు సాధారణ చందా ఉన్న చందాదారులందరికీ RRR ను ఫ్రీ గా చూసే అవకాశం కల్పించాలని నిర్ణయించింది. 

ఇప్పటికే ఉన్న ZEE5 సబ్‌స్క్రైబర్‌ లు RRRని ఉచితంగా అందించాలని డిమాండ్ చేస్తూ నెటిజన్లు చేసిన అభ్యర్థనలను ZEE5 టీం పరిగణనలోకి తీసుకుంది. కాబట్టి, స్ట్రీమింగ్ దిగ్గజం ZEE5 వారు మే 20 నుండి ఇప్పటికే ఉన్న సబ్‌స్క్రైబర్‌లు/పెయిడ్ యూజర్‌లకు RRRని ఉచితంగా అందించనుంది. 

RRR S-VODలో మే 20, 00:00 గంటల నుండి ZEE5 వీక్షకులకు అందుబాటులో ఉంటుంది. రూ. 699 (RRR ప్లస్ ZEE5 యొక్క వార్షిక చందా) చెల్లించి కాంబో ప్యాక్‌ని కొనుగోలు చేసిన వినియోగదారులందరికీ మేము చేయింజ్ చేసిన ప్లాన్ ప్రకారం మూడు నెలలు అదనపు కాలపరిమితి చెల్లుబాటు అయ్యేవిధంగా అందించడం జరుగుతుంది. .

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా దర్శకుడు రాజమౌళి రూపొందించిన దృశ్య కావ్యం ఆర్ఆర్ఆర్. మే 20వ తేదీన ZEE5 ఓటీటీ వేదికలో తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో సినిమాను వీక్షకుల ముందుకు తీసుకొస్తోంది.

ఆర్‌ఆర్‌ఆర్‌ థియేటర్లలో విడుదలై 50 రోజులు దాటింది. మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ఆయన అభిమానులకు ప్రత్యేక రోజు! అందుకే ZEE5 వారు ఆయన అభిమానులకు కానుకగా డిజిటల్ తెరపైకి RRRప్రీమియర్‌ ను ప్రత్యేక బహుమతిగా వీక్షకులకు అందిస్తున్నారు. వీక్షకులు ఈ ల్యాండ్‌మార్క్ ఫిల్మ్‌ను అత్యుత్తమ 4K నాణ్యతలో మరియు డాల్బీ అట్మాస్‌తో వారి ఇళ్లలో సౌకర్యవంతంగా చూడవచ్చు. 

RRRని మీ ఇంటికి తీసుకురావడం ద్వారా, ZEE5 మరోసారి వీక్షకులకు అత్యుత్తమ వినోదం అందించడానికి ZEE5 కృషి చేస్తుందని మరోసారి రుజువైంది. ఇప్పుడు ZEE5 పేరు ప్రతి ఇంట  వినబడుతోందనడంలో ఆశ్చర్యం లేదు. కేవలం దక్షిణ భారత వీక్షకులే కాదు, దక్షిణాది భాషల్లో ఏదీ తెలియని OTT వినియోగదారులు కూడా RRRని ఆంగ్ల ఉపశీర్షికలతో వీక్షించే అవకాశం ఉన్నందున ఈ వార్తలను చూసి సంతోషిస్తున్నారు. 

ZEE5 Announces SVOD for RRR from 20Th May.:

Due to heavy public demand ZEE5 Announces SVOD for RRR from 20Th May.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs