Advertisement
Google Ads BL

రామ్ గోపాల్ వర్మ విడుదల చేసిన నఘం టీజర్


గణేష్ రెడ్డి, వేమి మమత రెడ్డి, అయేషా టక్కి, రాజేంద్ర కుమార్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న చిత్రం నఘం. విభు ప్రొడక్షన్స్ బ్యానర్ పై శివ దొసకాయల ఈ సినిమాను నిర్మించగా నరసింహ జీడీ దర్శకత్వం వహించారు. హారర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విడుదల చేసి చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరామెన్‌గా అరవింద్ బి వ్యవహరించగా కిచ్చు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. భగవత్ సంగీతం సమకూర్చారు. త్వరలోనే నిర్మాణాంతర పనులు పూర్తి చేసుకొని విడుదల తేదీని ప్రకటించనున్నారు. 

Advertisement
CJ Advs

రామ్ గోపాల్ వర్మ  చేతుల మీదుగా విడుదలైన ఈ టీజర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. టీజర్‌లో ఒక్క డైలాగ్ లేకపోయినా.. ప్రేక్షకుల చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది. అరవింద్ కెమెరాపనితనం, భగవత్ సంగీతం అద్భుతంగా కుదిరాయి. టీజర్ చూస్తుంటే టెక్నికల్‌గా ఈ సినిమా ఉన్నత స్థాయిలో కనిపిస్తోంది. విజువల్స్ అదిరిపోయాయి. హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలకు ఉండాల్సిన మూడ్‌ను బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ ద్వారా తీసుకొచ్చారు. టీజర్‌తో నఘం సినిమా మీద అంచనాలు పెరిగాయి. హారర్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునేలా, సీటు అంచున కూర్చోబెట్టేలా ఉంటుందని చిత్రయూనిట్ తెలిపింది. త్వరలోనే రిలీజ్ డేట్‌ను మేకర్లు అధికారికంగా ప్రకటించనున్నారు.

నటీనటులు : గణేష్ రెడ్డి, వేమి మమత రెడ్డి, అయేషా టక్కి, రాజేంద్ర కుమార్, శరత్ చంద్ర, లక్కీ దానయ్య ఎం, శివ దోసకాయల, మెర్సీ మిరాకిల్, గౌతమ్ మానవ, మణి గోగిశెట్టి, బృందావన్ కేతిరెడ్డి.

సాంకేతిక బృందం; నిర్మాత : శివ దోసకాయల, బ్యానర్ : విభు ప్రొడక్షన్స్, దర్శకత్వం : నరసింహ జీడీ, రచయిత : దేవోజు లింగాచారి, సంగీతం : భగవత్ (కరుణాకర్), ఎడిటర్ : కిచ్చు, DOP: అరవింద్. బి, ఆర్ట్ : ఎం నరేంద్ర బాబు, పీఆర్వో : సాయి సతీష్, పర్వతనేని.

Ram Gopal Varma Launched And Appreciated Nagham Teaser:

<span>Star Director Ram Gopal Varma Launched And Appreciated Nagham Teaser</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs