Advertisement
Google Ads BL

థ్రిల్లింగ్ ఎంటర్ టైనర్ గా నటరత్నాలు


ఈ రోజుల్లో కంటెంట్ బేస్డ్ సినిమాలకు భారీ ఆదరణ దక్కుతుండటం చూస్తూనే ఉన్నాం. విలక్షణ కథలపై ఆడియన్స్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అలాంటి కోవలోకి తీసుకొచ్చేలా ఎన్.ఎస్  నాగేశ్వర రావు నిర్మాణంలో రూపుదిద్దుకోనున్న వినూత్న కథాంశం నటరత్నాలు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా సాగుతున్నాయి. అతిత్వరలో పూజా కార్యక్రమాలతో ఘనంగా సినిమా ప్రారంభోత్సవం చేయబోతున్నారు మేకర్స్. 

Advertisement
CJ Advs

గాదె నాగభూషణం దర్శకత్వం లో 

కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ పరివేక్షణ నర్రా  శివ నాగు వహించగా ఎవరెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తెరకెక్కనున్న ఈ సినిమాకు ఆనందాసు శ్రీ మణికంఠ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పలు సూపర్ హిట్ సినిమాల్లో భాగమై తెలుగు తెరపై తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సుదర్శన్, రంగస్థలం మహేష్ లతో పాటు తెలుగు చిత్రసీమలో ఎంతోమంది హీరోలకు నటనలో శిక్షణ అందించిన సత్యానంద్ ఇన్స్‌స్టిట్యూట్‌లో ట్రైనింగ్ తీసుకున్న యంగ్ అండ్ డైనమిక్ పర్సన్ అర్జున్ తేజ్ ప్రధాన పాత్రలలో  నటిస్తున్నారు. డా భద్రం, తమిళ నటుడు శేషాద్రి,  తదితరులు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.

అన్ని వర్గాల ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా క్రైం, థ్రిల్లర్, మిస్టరీ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. చిత్రంలో కామెడీ పార్ట్ హైలైట్ అయ్యేలా, ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకునేలా కథకు తెరరూపమివ్వబోతున్నారట. జూన్ మొదటివారంలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి త్వరత్వరగా ఫినిష్ చేసేలా ప్లాన్ రెడీ చేసుకున్నారు మేకర్స్. సన్నివేశాలకు తగిన లొకేషన్స్ ఎంచుకున్న దర్శకనిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా చాలా గ్రాండ్‌గా ఈ నటరత్నాలు సినిమా కంప్లీట్ చేసి ప్రేక్షకులకు వినూత్న అనుభూతి కలిగిస్తామని చెబుతున్నారు.

నటీనటులు: సుదర్శన్, రంగస్థలం మహేష్, అర్జున్ తేజ్, డా భద్రం, తమిళ నటుడు శేషాద్రి,  

సాంకేతిక వర్గం: దర్శకత్వం :  గాదె నాగభూషణం, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ పరివేక్షణ : నర్రా శివనాగు, బ్యానర్: ఎవరెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్,  నిర్మాత: ఎన్.ఎస్ నాగేశ్వర రావు, సహ నిర్మాత: ఆనందాసు శ్రీ మణికంఠ, ఎడిటర్: ఆవుల వెంకటేష్, కెమెరా: గిరి కుమార్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: నాగ మధు, పిఆర్ఓ: సాయి సతీష్, పర్వతనేని రాంబాబు

Nataratnalu as a thrilling entertainer:

Nataratnalu movie update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs