Advertisement
Google Ads BL

అనిల్ రావిపూడి కామెడీ కింగ్: సోనాల్ చౌహాన్


F3 అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో హీరోయిన్ సోనాల్ చౌహాన్ కూడా కీలక పాత్ర పోషించారు. తాజాగా ఎఫ్ 3తో పాటు తన పాత్రకు సంబధించిన విశేషాలు మీడియాతో పంచుకున్నారు సోనాల్.  

Advertisement
CJ Advs

ఎఫ్ 3 ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?

ఎఫ్ 3 ప్రాజెక్ట్ లోకి రావడం వెనుక చాలా ఆసక్తికరమైన కథ వుంది. లెజెండ్ సినిమా జరుగుతున్నప్పుడే దర్శకుడు అనిల్ రావిపూడి గారితో పరిచయం. రామోజీ ఫిల్మ్ సిటీలో లెజెండ్ షూటింగ్ జరుగుతున్న సమయంలో అనిల్ గారు వేరే సినిమా షూటింగ్ చేస్తున్నారు. అదే సమయంలో మాట్లాడుకున్నాం.  కలసి వర్క్ చేయాలని అనుకున్నాం. ఐతే చాలా ఏళ్ల తర్వాత ఆయన నుండి ఫోన్ వచ్చింది. ఎఫ్3 అనే సినిమా చేస్తున్నాను. ఓ పాత్ర కోసం మిమ్మల్ని అనుకుంటున్నాను అన్నారు. మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పాను. అనిల్ గారు కామెడీ కింగ్. అప్పటికే ఎఫ్ 2 సినిమా చూశాను. హిలేరియస్ మూవీ అది. ఎఫ్ కి మించిన ఫన్ ఎఫ్ 3లో వుంటుంది.

ఎఫ్ 3 ట్రైలర్ లో కూడా మీ పాత్ర గురించి ఎలాంటి డిటెయిల్ ఇవ్వలేదు.. ఇంతకీ ఎఫ్3లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది?

ఎఫ్ 3లో నేను చేస్తున్న పాత్ర చాలా సర్ప్రైజింగా వుంటుంది. ట్రైలర్ లో కూడా సీక్రెట్ గా దాచిపెట్టాం. నా పాత్రలో ఒక ట్విస్ట్ వుంటుంది. ఆ ట్విస్ట్ రివిల్ అయినప్పుడు ప్రేక్షకులు తప్పకుండా ఎంటర్టైన్ ఫీలౌతారు. ఇప్పటికైతే నా పాత్ర గురించి ఇంతకంటే ఎక్కువ చెప్పలేను.

ఎఫ్ 3 కథలో మీ పాత్ర ప్రాధన్యత వుంటుందా ?

ఎఫ్2 కంటే ఎఫ్ 3లో భారీ తారాగణం వుంది. అన్ని పాత్రలకు కథలో ప్రాధాన్యత వుంది. నా పాత్ర వరకూ వస్తే .. కథలో కీలకమైన పాత్రే. పైగా ఫుల్ లెంత్ కామెడీ సినిమా చేయడం నా కెరీర్ లో ఇదే మొదటిసారి. ఎఫ్ 3 లాంటి అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ చేయడం ఒక ఛాలెజింగా అనిపించింది. ఎందుకంటె కామెడీ చేయడం అంత తేలిక కాదు.  

మీ కెరీర్ లో ఎఫ్ 3 ఫస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ కదా..దీని కోసం ప్రత్యేకంగా హోం వర్క్ ఏమైనా చేశారా ?

కామెడీ ఎంటర్ టైనర్ చేయడం నాకు కొత్త. చాలా టెన్షన్ పడ్డాను. ఎలా ప్రిపేర్ అవ్వాలి ? ఏవైనా సినిమాలు చూడాలా ? అని దర్శకుడు అనిల్ రావిపూడి గారిని అడిగాను. ఆయన సూపర్ కూల్. ఏమీ అలోచించకుండా నేరుగా షూటింగ్ కి వచ్చేమని చెప్పారు. అనిల్ గారితో వర్క్ చేయడం ఆర్టిస్ట్ కి చాలా ఈజీ. ఆయనే నటించి చూపిస్తారు. ఆయనకి చాలా క్లారిటీ వుంటుంది. ఆర్టిస్ట్ నుండి పర్ఫార్మెన్స్ రాబట్టుకోవడం ఆయనకు తెలుసు. ఆయన చెప్పినట్లే చేస్తే చాలు మన పని తేలికైపోతుంది.

వెంకటేష్, వరుణ్ తేజ్ లాంటి స్టార్ హీరోలతో పని చేయడం ఎలా అనిపించింది ?

వెంకటేష్ గారితో కలసి పని చేయడం ఒక గౌరవం. ఆయన గొప్ప నటుడే కాదు.. గొప్ప మనిషి. సెట్స్ లో అందరితో కలసి మాట్లాడతారు. సహానటులు ఎక్కడైనా ఇబ్బంది పడుతుంటే హెల్ప్ చేస్తారు. అలాగే ఆయన ఎప్పుడూ నిర్మాతల పక్షం ఆలోచిస్తుంటారు. సమయం వృధా చేయడం ఆయనకి నచ్చదు. ప్రొడక్షన్ వైపు నుంచి ఎక్కువ ఆలోచిస్తారు. వెంకటేష్ గారి నుండి చాలా విషయాలు నేర్చుకోవచ్చు.

వరుణ్ తేజ్ చాలా పాజిటివ్ గా వుంటారు. చాలా ఫ్రెండ్లీ పర్శన్. వరుణ్ తేజ్ స్టార్ తో వర్క్ చేయడం కూడా ఆనందాన్ని ఇచ్చింది.

తమన్నా, మెహ్రీన్ లతో స్క్రీన్ పంచుకోవడం గురించి ?

తమన్నా, మెహ్రీన్ లతో కలసి పని చేయడం వండర్ ఫుల్ ఎక్స్పిరియన్స్. ఈ సినిమా తర్వాత మేము మంచి ఫ్రండ్స్ అయిపోయాయం.

దర్శకుడు అనిల్ రావిపూడి గారి పని చేయడం ఎలా అనిపించింది ?

లెజండ్ సినిమా సమయంలో ఆయన్ని కలసినప్పుడు చాలా పాజిటివ్ నైస్ పర్శన్ అనిపించారు. ఎఫ్ 3లో కలసి వర్క్ చేసిన తర్వాత ఆయనపైగౌరవం ఇంకా పెరిగింది. అనిల్ గారు  గొప్ప కధకుడు. చాలా పాజిటివ్ గా వుంటారు. ఆయన పాజిటివిటీనే తెరపై కనిపిస్తుంటుంది. ఇంతమంది స్టార్ కాస్ట్  తో సినిమా చేస్తున్నపుడు కూడా కొంచెం కూడా ఒత్తిడి తీసుకోరు. పైగా సెట్స్ లో చాలా సరదాగా జోకులు వేస్తుంటారు. కష్టాన్ని కూడా కామెడీగా మార్చగలరు. ఆయనకి గ్రేట్ సెన్స్ అఫ్ హ్యుమర్ వుంది.

ఎఫ్ 3 లో మెమొరబుల్ మూమెంట్  ?

ఫస్ట్ సీన్ వెంకటేష్ గారితో చేయాలి. చాలా కంగారు పడ్డా. ఎలా వుంటుందో అనుకున్నా. ఐతే ఆ సీన్ చాలా కూల్ గా జరిగింది. బెస్ట్ మూమెంట్ అది.

దిల్ రాజు గారి నిర్మాణంలో పని చేయడం ఎలా అనిపించింది ?

దిల్ రాజు గారు, శిరీష్ గారు గ్రేట్ ప్రోడ్యూసర్స్. వారి నిర్మాణంలో పని చేయాలనీ ఎప్పటినుంచో కోరుకుంటున్నాను. ఎఫ్ 3తో ఆ కోరిక తీరింది. సినిమా పట్ల ఇష్టం, అంకితభావం వున్న నిర్మాతలు. సినిమాకి సంబధించిన ప్రతి అంశాన్ని దగ్గరుండి చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో పని చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాను.

మీరు చాలా భాషల్లో నటిస్తున్నారు కదా.. తెలుగు చిత్ర పరిశ్రమ ప్రత్యేకత ఏమిటి ?

తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతలు, దర్శకులు చాలా క్లారిటీగా వుంటారు. ప్రేక్షకుడు కోరుకునే వినోదం అందించడానికి తపన పడతారు. ప్రేక్షకుడిని గౌరవిస్తారు. ఈ క్రమంలోనే గొప్ప సినిమా వస్తున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమ గురించి ఇప్పుడు దేశం అంతా గొప్పగా మాట్లాడుతుంది.

ఎఫ్ 3 మీ కెరీర్ కి గేమ్ చేంజర్  సినిమా అవుతుందని భావిస్తున్నారా ?

ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుందనే నమ్మకం వుంది. సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా ఉండబోతుంది.

కొత్తగా చేస్తున్న సినిమాలు ?

నాగార్జున గారితో ఘోస్ట్ సినిమా చేస్తున్నా. ఇందులో నాది ఫుల్ యాక్షన్ రోల్.  

Sonal Chauhan Interview:

Sonal Chauhan Interview about F3
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs