Advertisement
Google Ads BL

SVP లో లవ్ ట్రాక్ మెయిన్ హైలెట్: మహేష్


సర్కారు వారి పాట మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా విడుదల కాబోతున్న నేపధ్యంలో... సూపర్ స్టార్ మహేష్ బాబు మీడియాతో ముచ్చటించారు. ఆయన పంచుకున్న సర్కారు వారి పాట విశేషాలు...

Advertisement
CJ Advs

సర్కారు వారి పాట ట్రైలర్ లో అద్భుతంగా కనిపించారు. క్యారెక్టర్ చాలా కొత్తగా హుషారుగా వుంది..క్యారెక్టర్ లో ఇంత ఫ్రెష్ నెస్ కి కారణం ?

ముందుగా మీ అందరినీ ఇలా రెండేళ్ళ తర్వాత కలుసుకోవడం ఆనందంగా వుంది. కరోనా కాలంలో అందరం కష్టకాలం ఎదుర్కున్నాం. లాక్ డౌన్ వలన షూటింగ్ పలుమార్లు ఆగింది. చిత్ర యూనిట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్,  నిర్మాతలు ఇంత కష్టకాలంలో బలంగా నిలబడ్డారు. వారికి థ్యాంక్స్ చెప్పాలి.

సర్కారు వారి పాట క్రెడిట్ దర్శకుడు పరశురాం గారికి దక్కుతుంది. పాత్రని చాలా కొత్తగా డిజైన్ చేశారు. చాలా ఎంజాయ్ చేసి పని చేశాను. పోకిరి రోజులు గుర్తుకు వచ్చాయి. బాడీ లాంగ్వెజ్, డైలాగ్ డెలివరీ .. ఇలా ప్రతిది కొత్తగా వుంటుంది. 

మేజర్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో నాలుగేళ్ళుగా ఏది పట్టుకున్నా బ్లాక్ బస్టర్ అన్నారు.. ఇలా వరుస విజయాలు రావడానికి కారణం అడిగితే ఏం చెప్తారు ?

మంచి కథలు ఎంపిక చేసుకోవడం. అనుభవం పెరగడం కూడా ఒక కారణం. గత నాలుగేళ్ళుగా అద్భుతమైన జర్నీ. సర్కారు వారి పాట కూడా విజయవంతమైన సినిమా అవుతుంది.

సర్కారు వారి పాటని పోకిరితో పోల్చడానికి కారణం ?

సర్కారు వారి పాటలో క్యారెక్టర్  పోకిరి మీటర్ లో వుంటుంది. పోకిరి షేడ్స్ లో వున్న క్యారెక్టర్ మళ్ళీ దొరికింది. పోకిరి చూస్తే థియేటర్ లో ఒక మాస్ ఫీలింగ్ వుంటుంది. అలాంటి క్యారెక్టర్ మళ్ళీ సర్కారు వారి పాటతో కుదిరింది.

మీరు చాలా మంది దర్శకులతో పని చేశారు. పరశురాం గారి స్పెషాలిటీ ఏంటి ?

పరాశురాం గారు అద్భుతమై రచయిత. అంత అద్భుతమైన రచయిత దర్శకుడైతే అద్భుతంగా వుంటుంది.

కథ యు.ఎస్ నేపధ్యంలో వుంటుందా ?

కథ ఫస్ట్ హాఫ్ లో యుఎస్ లో మొదలై .. సెకండ్ హాఫ్ వైజాగ్ కి వస్తుంది.

మ మ మహేష్ పాట షూటింగ్ రెస్ట్ లెస్ గా చేశారని విన్నాం ?

రెస్ట్ లెస్ అని కాదు కానీ.. నిజానికి మొదట ఒక సాంగ్ అనుకున్నాం. సినిమా ఫ్లో చూసినప్పుడు ఆ పాట సరిగ్గా కుదరలేదని దర్శకుడు పరశురాం భావించారు. ఒక మాస్ సాంగ్ ఐతే బావుంటుందని టీం మొత్తం నిర్ణయానికి వచ్చాం. తమన్  మమా మహేష్ .. పాట ట్యూన్ వినిపించారు. చాలా ఎనర్జీటిక్ గా అనిపించింది. పది రోజుల్లో  ఒక భారీ సెట్ వేసి షూట్ చేశాం. పాట అద్భుతంగా వచ్చింది. సర్కారు వారి పాటలో మమ మహేష్ పాట ఒక హైలెట్ గా ఉండబోతుంది.

సినిమా ఒకసారి వాయిదా పడింది...ఈ గ్యాప్ లో మార్పులు చేర్పులు ఏమైనా చేశారా ?

ఎలాంటి మార్పులు చేయలేదు. మొదట ఏం అనుకున్నామో అదే చేశాం. ఇక వాయిదా అంటే మేమే కాదు కరోనా కారణంగా దాదాపు సినిమాలన్నీ ఆలస్యమౌతు వచ్చాయి. అన్ని సినిమాలు ఈ పరిస్థితి ఎదురుకున్నాయి.

మీ మెడపై టాటూ  ట్రెండీగా వుంది.. ఇది ఎవరి ఆలోచన ?

దర్శకుడు పరశురాం గారికి ఈ క్రిడెట్ దక్కుతుంది. భరత్ అనే నేను షూటింగ్ పూర్తయిన తర్వాత నాకు ఇంకా లాంగ్ హెయిర్ రాలేదు. కానీ ఆ స్టిల్ తీసుకొని మెడపై టాటూ పెట్టి లుక్ ఇలా వుంటుందని చూపించారు. అద్భుతంగా అనిపించింది. తర్వాత లుక్ పై వర్క్ చేయడం మొదలుపెట్టాం.

మీరు దాదాపు పెద్ద స్టార్ దర్శకులతోనే వర్క్ చేస్తుంటారు. దర్శకుడు పరశురాం పై పాజిటివ్ ఫీలింగ్ ఎలా  వచ్చింది ?

పరశురాం గారి గీత గోవిందం నాకు చాలా నచ్చింది. పరశురాం సర్కారు వారి పాట కథ చెప్పినపుడు చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. మరో ఆలోచన లేకుండా సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను.

సర్కారు వారి పాటలో మెసేజ్ వుంటుందా ?

గత మూడు సినిమాల్లో మెసేజ్ బాగా రుద్దారు. మహేష్ బాబుని ఇలా బౌండరీలు లేకుండా చూడటం బావుంది అని సర్కారు వారి పాట ట్రైలర్  ఫీడ్ బ్యాక్ వస్తుంది. సినిమా కూడా చాలా రిఫ్రెషింగ్ గా వుంటుంది.

పాన్ ఇండియా ఆలోచనలు ఏమైనా వున్నాయా ?

తెలుగు సినిమా తీద్దామనే మొదలుపెట్టాం. దీనికి బాగా సమయం పట్టింది. నా దృష్టి తెలుగు సినిమాపైనే వుంది. తెలుగు సినిమానే బాలీవుడ్ కి రీచ్ కావాలని కోరుకుంటాను.

మీ నెక్స్ట్ మూవీ పాన్ ఇండియా రిలీజ్ వుంటుందా ?

నేను, రాజమౌళి గారు చేస్తే పాన్ ఇండియా కాకుండా ఎలా వుంటుంది.

అభిమానులతో పాటు ప్రయోగాత్మక చిత్రాలు చేసే ఆలోచన వుందా ?

సినిమా అభిమానులతో పాటు అందరికీ నచ్చాలి. అందరికీ నచ్చే సినిమా చేయాలనే వుంటుంది. ఇంత భారీ బడ్జెట్ తో పూర్తిగా ప్రయోగాత్మక సినిమాలు కూడా చేయలేం. అందరూ మెచ్చే సినిమా చేసే దిశగానే కష్టపడుతుంటా.

సర్కారు వారి పాట ఈవెంట్ లో చాలా ఎమోషనల్ అవ్వడానికి కారణం ?

ఈ రెండేళ్ళలో చాలా జరిగాయి. కొంతమంది ఆప్తులు దూరమయ్యారు. దీని కారణంగానే కొంచెం ఎమోషనల్ అయ్యాను.

సర్కారు వారి పాట టైటిల్ ఎలా పుట్టింది ?

పరశురాం గారు మొదట టైటిల్ చెప్పలేదు.  కథ నుంచే టైటిల్ పుట్టింది. సర్కారు వారి పాట అని ఆయన చెప్పిన వెంటనే నాకు నచ్చేసింది. మరో ఆలోచన లేకుండా ఫిక్స్ చేయమని చెప్పాను.

హీరోయిన్  కీర్తి సురేష్ మీ గ్లామర్, టైమింగ్ ని మ్యాచ్ చేయలేనని చెప్పారు ? మీ టైమింగ్ అందుకోవడం అంత కష్టమా?

కీర్తి సురేష్ అలా చెప్పింది కానీ సినిమాలో ఇరగదీసింది. సర్కారు వారి పాటలో కీర్తి పాత్ర చాలా సర్ ప్రైజింగా వుంటుంది. లవ్ ట్రాక్ మెయిన్ హైలెట్. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు. 

చాలా గ్యాప్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు ? ఎలాంటి జోనర్ సినిమా ఉండబోతుంది.

సినిమా చాలా కొత్తగా ఉండబోతుంది. మా కాంబినేషన్ అంటేనే డిఫరెంట్ లెవల్ వుంటుంది. ఆయన అద్భుతమైన రచయిత. ఆయన రాసిన డైలాగ్ నేను పలుకుతుంటే ఆ కిక్కే వేరు. ఆయన సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురుచుస్తున్నా.

మైత్రీ మూవీ మేకర్స్, 14రీల్స్ నిర్మాతలలో పని చేయడం ఎలా అనిపించింది ?

నాకు బాగా తెలిసిన నిర్మాతలు. దూకుడు, శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్స్ సినిమాలు మా కాంబినేషన్ లో వున్నాయి. సర్కారు వారి పాట కి లాక్ డౌన్ కారణంగా చాలా కష్టాలు ఎదురయ్యాయి. ఎక్కడా రాజీ పడకుండా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాం. ఆలాంటి నిర్మాతలతో వర్క్ చేయడం గొప్ప అనుభవం.

ప్రతి సినిమాకి ఎదో ఒకటి నేర్చుకుంటారు. సర్కారు వారి పాట నుంచి ఏం నేర్చుకున్నారు ?

సర్కారు వారి పాట కొత్త ఎక్స్ పిరియన్స్.  ఆరు నెలల్లో సినిమా అయిపోతుంది. కానీ ఈ సినిమా జర్నీ రెండేళ్ళు సాగింది. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఎక్కడ ఆపమో అక్కడి నుంచి అదే ఎనర్జీతో మొదలుపెట్టడం అంత తేలిక కాదు. ఈ విషయంలో దర్శకుడు పరశురాం, టీమ్  ని మెచ్చుకోవాలి. ఎనర్జీని హోల్డ్ చేసి పట్టుకున్నారు.

తమన్ ఎనర్జీ గురించి ?

తమన్ మ్యూజికల్ సెన్సేషన్. అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు.. కళావతి పాట నా కెరీర్ లోనే బెస్ట్ సాంగ్ గా నిలిచింది. ట్యూన్ ఇచ్చినపుడు ఈ పాట ఇంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలేదు. ఐతే తమన్ బలంగా నమ్మాడు. ప్రతి పెళ్లిలో ఇదే పాట వినిపిస్తుందని చెప్పాడు. అదే జరిగింది. మిగాత పాటలు అద్భుతంగా వచ్చాయి. రీరికార్డింగ్ కూడా అదరగొట్టాడు.

సర్కారు వారి పాట కు సీక్వెల్ వుంటుందా ?

లేదు.

సినిమా విడుదలకు ముందు టెన్షన్ వుంటుంది కదా .. సర్కారు వారి పాట కి ఎలా అనిపిస్తుంది ?

ఈ సినిమా వరకూ చాలా హాయిగా వుంది. ఎలాంటి ఒత్తిడి లేదు. చాలా పాజిటివ్ గా వుంది. సినిమా ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుంది.

ఈ మధ్య కాలంలో రీపిట్ ఆడియన్స్ తగ్గారు. కానీ సర్కారు వారి పాటకు రిపీట్ ఆడియన్స్ వస్తారని చెబుతున్నారు?

దూకుడు సినిమాకి రిపీట్ ఆడియన్స్ వచ్చారు. ఫారిన్ లో వున్న లవ్ ట్రాక్ రిపీట్ ఆడియన్స్ రావడానికి మెయిన్ రీజన్. ఆ ట్రాక్ చాలా ఎంజాయ్ చేశారు. సర్కారు వారి పాట లో కూడా లాంటి అద్భుతమైన ట్రాక్ కుదిరింది. ఖచ్చితంగా ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ చూస్తారు.

రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ తో కాంబినేషన్ గురించి ?

రామ్ లక్ష్మణ్ నా ఫేవరేట్ మాస్టర్స్. ప్రతి సినిమాని కొత్తగా డిజైన్ చేస్తారు. అలాగే ఫైట్ తీస్తున్నపుడు హీరోతో పాటు అందరినీ చాలా జాగ్రత్తగా చూసుకుంటారు.

మీ పిల్లలు మీ వారసులుగా వస్తారా ?

పిల్లలపై ఎలాంటి వత్తిడి లేదు. సితార పాప తనకి నచ్చింది చేస్తుంది. గౌతమ్ కి చదువుకోవడం ఇష్టం. వాళ్ళ ఇష్టాలని గౌరవిస్తాను.

సముద్రఖని గారి ఈ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?

ఈ పాత్రకి సముద్రఖని గారైతే బావుంటుందని పరశురాం గారికి చెప్పాను. ఆ పాత్ర కు చాలా ఫ్రెష్ నెస్ తీసుకొచ్చారు. ఈ సినిమాలో నేను చాలా కళ్ళ జోళ్ళు వాడను. గుర్తుగా వుంటుంది ఒక కళ్ళ జోడు ఇవ్వమని అడిగారు. ఆయనతో వర్క్ చేయడం మంచి ఎక్స్ పిరియన్స్.

ఏపీ సిఎం జగన్ గారిని కలసినప్పుడు ఎలా అనిపించింది ?

జగన్ గారు చాలా సింపుల్. ఇంత సింపుల్ గా ఉంటారా ? అనిపించింది. మీటింగ్ చాలా ప్లజంట్ గా జరిగింది.

నాన్నగారి బయోపిక్ చేయాలనే ఆలోచన ఉందా ?

లేదండీ, మీరు ఆ ప్రశ్న అడగ్గానే కాళ్ళు వణుకుతున్నాయి,( నవ్వుతూ). ఆయన నాకు దేవుడితో సమానం. ఆయన బయోపిక్ లో నేను నటించలేను.

 

 

Mahesh Babu Interview:

Mahesh Babu Interview about Sarkaru vaari Paata
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs