హీరో నితిన్ హీరోగా ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్ మాచర్ల నియోజకవర్గం. ఈ చిత్రంలో సిద్ధార్థ్ రెడ్డి అనే ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో నితిన్ కనిపించబోతున్నారు. ఫస్ట్ లుక్ తోనే దుమ్మురేపిన ఈ చిత్రాన్ని ముందుగా జూలై 8న విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే కొన్ని పనులు పెండింగ్ లో వుండటం చేత సినిమా వాయిదా పడింది. ఇప్పుడు మాచర్ల నియోజకవర్గం చిత్రం కొత్త విడుదల తేది ఖరారైయింది.
ఆగస్ట్ 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా మాచర్ల నియోజకవర్గం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే ఫెస్టివల్ కూడా ఈ చిత్రానికి కలసిరానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో నితిన్ లుక్ ఆకట్టుకుంది. బ్లూ జీన్స్ వైట్ షర్టులో టక్ చేసుకొని హాండ్స్ ని పోల్డ్ చేస్తున్న స్టిల్ లో నితిన్ సాలిడ్ గా కనిపించారు. స్టయిలీస్ గా కనిపిస్తూనే మాస్ యాక్షన్ లుక్స్ తో దూకుడు చూపించారు నితిన్. ప్రస్తుతం ఈ చిత్రంలోని పాటలని ఇటలీ, ఆస్ట్రియాలోని అందమైన ప్రదేశాలలో చిత్రీకరిస్తున్నారు.