Advertisement
Google Ads BL

రాజమౌళి చేతుల మీదుగా ఓ కల ఫస్ట్ లుక్ విడుదల


ఎటిర్నిటి ఎంటర్‪టైన్‪మెంట్, అహం అస్మి ఫిల్మ్స్ బ్యానర్లపై గౌరీశ్ యేలేటి, రోషిణి, ప్రాచీ ఠక్కర్ హీరోహీరోయిన్లుగా దీపక్ కొలిపాక దర్శకత్వంలో లక్ష్మీ నవ్య మోతూరు, రంజిత్ కుమార్ కొడాలి, అదిత్య రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ఓ కల. ఈ చిత్ర ఫస్ట్ లుక్‪ను శనివారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‪లో జరిగిన కార్యక్రమంలో.. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి విడుదల చేశారు. ఫస్ట్ లుక్ విడుదల అనంతరం రాజమౌళి మాట్లాడుతూ.. ఓ కల మూవీ ఫస్ట్ లుక్ చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇందులోనే సినిమా ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది. దర్శకుడు దీపక్ కొలిపాక ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని భావిస్తున్నాను. సినిమా అనేది ప్రతి ఒక్కరి కల. ఈ చిత్రంతో మీరంతా ఆ కలను నెరవేర్చుకున్నారు. ఇంకా ఎందరో ఈ కలతో బతుకుతున్నారు. గట్టిగా కృషితే చేస్తే అలాంటి వారందరి కల నెరవేరుతుంది. ఈ చిత్రానికి పనిచేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.. అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో హిట్ సినిమా దర్శకుడు శైలేష్ కొలనుతో పాటు చిత్రయూనిట్ మొత్తం పాల్గొంది.

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా దర్శకుడు దీపక్ కొలిపాక మాట్లాడుతూ.. తెలుగు సినిమాకి ప్రపంచ స్థాయి గుర్తింపుని తీసుకువచ్చిన మన దర్శకధీరుడు రాజమౌళిగారి చేతుల మీదుగా ఫస్ట్ లుక్ విడుదలవడం నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. ఆయన ఆశీస్సులు మాకు ఎంతో బలాన్నిచ్చాయి. ఆయనెప్పుడు ఇలా డైరెక్టర్స్‪కి స్పూర్తిగానే నిలుస్తుండాలని కోరుకుంటున్నాను. సినిమా విషయానికి వస్తే.. ఒక మంచి కథని తెలుగు ప్రేక్షకులకు చెప్పే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు నా ధన్యవాదాలు. వారిచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. హీరో హీరోయిన్లు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ ఎంతగానో సహకరిస్తున్నారు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‪తో.. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‪టైనర్‪గా ఉండబోతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుందని చెప్పగలను.. అని తెలిపారు.

Kala Movie first look release:

Kala Movie first look release on the hands of Rajamouli
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs