Advertisement
Google Ads BL

ఈ ఏడాది సెన్సేషనల్ హిట్ ఇస్తాను- శ్రీవిష్ణు


భళా తందనానలో మునుపెన్నడూ చూడని క్లైమాక్స్ చూస్తారు: హీరో శ్రీవిష్ణు

Advertisement
CJ Advs

ఈ ఏడాది సెన్సేషనల్ హిట్ ఇస్తాను- హీరో శ్రీవిష్ణు

శ్రీవిష్ణు, క్యాథరిన్ థ్రెసా హీరో,హీరోయిన్లుగా నటించిన చిత్రం భళా తందనాన. వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి సమర్పణ లో రజనీ కొర్రపాటి నిర్మించారు. చైతన్య దంతులూరి దర్శకత్వం వహించారు. మే 6 న  సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారంనాడు హీరో శ్రీవిష్ణు మీడియా సమావేశంలో చిత్రం గురించి పలు విషయాలు తెలియజేశారు.

దర్శకుడు చైతన్య దంతులూరి కథ చెప్పగానే మిమ్మల్ని ఆకట్టుకున్న అంశం ఏమిటి?

ఈ కథ నాకు బాణం సినిమా అప్పుడే చెప్పారు. బసంతి టైంలో ఓ సినిమా చేద్దాం అనుకున్నాం.  కానీ అప్పటికీ పూర్తిగా కథ వర్కౌట్ కాలేదు. ఆ తరువాత తను బిజీ అయ్యాడు నేను బిజీ అయ్యాను. నాలుగేళ్ళు తర్వాత కథకు ఒక రూపం రావడంతో బాగా నచ్చి  ఈ సినిమా చేయడానికి అంగీకరించాను. అయితే ముందుగా ఈ ప్రొడక్షన్ వేరే వేరే అనుకున్నాం ఫైనల్గా  సాయి కొర్రపాటి గారు రావడంతో ఈ సినిమాకు ఒక క్రేజ్ ఏర్పడింది.

ఇందులో కొత్తగా చూపించే అంశాలు ఏమిటి?

ముందు 25 నిమిషాలు క్యారెక్టర్ల పరిచయం ఉంటుంది. రానురాను కథలో డెప్త్ వెళ్లడంతో ప్రతి క్యారెక్టర్ హైలైట్ గా ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ చాలా ఇంటరెస్టింగ్ గా ఉంటాయి. ఇంతవరకు రాని కొత్త కోణం ఇందులో హైలెట్ గా ఉంటుంది.  క్లైమాక్స్ లో  ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది.

కే జి ఎఫ్  విలన్ గరుడ రామ్ మీకు విలన్గా నటించడం ఎలా అనిపించింది?

కె.జి.ఎఫ్. వంటి అంత పెద్ద సినిమాలో చేసిన ఆయన నా సినిమాలో చేయడం చాలా గొప్పగా ఉంది. ఆయనతో వచ్చే ఫైట్ సీక్వెన్స్  సినిమాను నిలబెడతాయి. ఒక అరుదైన కొత్త క్లైమాక్స్ ఈ సినిమాలో చూస్తారు.

భళా తందనాన టైటిల్ పెట్టడానికి కారణం?

ఇది అన్నమయ్య కీర్తన లోనిది. ఆయన ఎన్నో వేల కీర్తనలు రాశారు. అందులో తందనానా భళాతందనానా అంటూ విప్లవాత్మకమైన కీర్తన రాశారు.  ప్రకృతితో పాటు మనిషికి డబ్బు, కులం, మతం వంటి  అంశాలు చర్చిస్తూ రాసిన ఈ గీతం చాలా హైలెట్ అయింది. మా కథకు యాప్ట్ అయ్యే టైటిల్ ఇది. కామన్మేన్కూ రీచ్ అవుతుంది. అచ్చమైన తెలుగు పదం ఇది. ఇప్పటి జనరేషన్ కి కూడా తెలియాలని పెట్టాం. ఈమధ్య చాలా ఆంగ్లపదాలు వస్తున్నాయి. నాకు తెలుగు టైటిల్స్ పెట్టడం అంటే ఇష్టం. బ్రోచెవారెవరురా, రాజరాజఛోళా.. వంటి నా టైటిల్స్ అన్నీ తెలుగు లోనే వుంటాయి.

దర్శకుడు చైతన్యతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది?

నేను బాణం నుంచి తనతో ట్రావెల్ అయ్యాను. 14 ఏళ్ళ అనుబంధం. తను సెట్లో మోనిటర్ చూడరు. నాకు మొదట్లో అదే అనుమానం వచ్చి అడిగాను. నాకు ఫ్రేమ్ ఎలా వుందో, లైటింగ్ ఎట్లా పెట్టారో, నటీనటులు హావభావాలు అన్నీ నేను చెప్పినట్లే వస్తుంటాయి. అప్పడు మోనిటర్తో పనేంటి? అనేవారు. మొదటి సినిమాకే ఆయన అంత క్లారిటీగా వుండడంతో ఆయన ఆలోచన విధానం బాగా నచ్చింది. ఆయనకు అన్ని శాఖలపై పట్టు వుంది. అందుకే ఆయనతో పనిచేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది.

వారాహి బ్యానర్లో  చేయడం ఎలా అనిపిస్తుంది?

డెఫినెట్గా  మంచి బేనర్ లో చేశానని తృఫ్తి వుంది. సాయి కొర్రపాటి గా రు క్యాస్టింగ్ గాని టెక్నీషియన్స్ గానీ, నిర్మాణ విలువల్లో కానీ వెనుకంజ వేయరు. ఆయనకు అన్నింటిలోనూ అనుభవం ఉంది. ఇటీవల వచ్చిన వారాహి సినిమాలో మా సినిమా ది బెస్ట్ సినిమా అవుతుంది.

ట్రైలర్లో చూపించినట్లుగా డబ్బే ప్రధానాంశమా?

అదొక్కటే కాదు సస్పెన్స్ థ్రిల్లర్, ఇంటెన్సివ్ కథ. చాలా బాగుంటుంది. ఈ సినిమా చెప్పగానే నేను చేయాలని డిసైడ్ అయిపోయాను. ఇందులో చాలా  ఫన్ ఉంటుంది.

మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?

నేను కామన్ మ్యాన్ గానటించాను. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా కేథరిన్ నటించింది. కామన్ మ్యాన్ గా చాలా చేయాలి అనుకుంటాం, కానీ చేయలేం. ఆ సందర్భంలో ఈ జర్నలిస్టు సహకారంతో తీసుకుంటే ఎలా వుంటుంది అనేది నా పాత్ర.  ఆ ప్రాసెస్ లో చిన్న లవ్ స్టోరీ కూడా ఉంటుంది.

కేథరిన్ నటన ఎలా అనిపించింది?

ఆమె చాలా టాలెంటెడ్ ఆర్టిస్ట్. ఆమె నాతో కంటే మిగిలిన చాలా పాత్రలతో కనెక్ట్ కావడంతో ఆమె నటనకు మంచి స్కోప్ వున్న పాత్ర అది. ఆమె కెరీర్ లో బెస్ట్ ఫిలిం అవుతుంది.

వీరు ఇంతకుముందు అర్జున ఫాల్గుణ.. ఇప్పుడు ఈ సినిమా మాస్ పేట్రన్లో అనిపిస్తుంది?

నేను ఇంతకుముందు చిన్న దొంగ గా చేశాను. కానీ కామన్ మ్యాన్ గా చేయడం ఇదే ఫస్ట్. కామన్ మ్యాన్ సొసైటీకి ఏం చేయగలడనే కోణంలో మాస్ అప్పీల్ వుంటుంది. ఒక బాధ్యతతో కూడిన పాత్ర కాబట్టి అలా అనిపిస్తుంది. ఇది వాంటెడ్గా చేయాలని చేయలేదు.  కథ పరంగా పాత్ర పరంగా వచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటున్నాను

సినిమా డిసప్పాయింట్ అయితే మీ ఆలోచన విధానం ఎలా ఉంటుంది?

తప్పకుండా కొంచెం  బాధ వుంటుంది.  సినిమా బాగా ఆడాలని   తీస్తాం. రిలీజ్ తర్వాత అది ప్రేక్షకుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళు ఎటువంటి తీర్పు ఇచ్చినా మనం స్వీకరించాలి. ఈ ప్రాసెస్ లో నే పెట్టిన డబ్బులు పోయినా ఎవరైనా లాస్ అయిన సందర్భాలు తక్కువ.  నేను చేసిన సినిమా వల్ల ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంది.

గరుడ రామ్ విలన్ అనగానే ఎలా ఫీలయ్యారు?

కే జి ఎఫ్ సినిమా తో దేశం మొత్తం తెలిసిన విలన్ ఆయన. ఆయన నా సినిమాలో విలన్ ఏంటి అనేది అందరికీ అనిపిస్తుంది. మొదట్లో నాకూ అనిపించింది.  మొదట నేను భయపడ్డాను. ఎందుకంటే కెజిఎఫ్ లో చూసిన ఆయన నటన అలాంటిది. కానీ సెట్లో ఆయన చాలా హంబుల్గా వుండడం చూసి ఆశ్చర్యపోయా.  పైగా  ఆయన మన తెలుగు వాడు కావడం విశేషం.

టైటిల్ లో కత్తి, కలం ఉంది దాని అర్థం ఏమిటి?

కలం అనేది జర్నలిస్టు వృత్తి.  కత్తి అనేది విలన్ కోణంలోనిది.  హీరోకీ సంబంధం లేదు.

ఇప్పటివరకు విష్ణుకి సెన్సేషనల్ హిట్ అనేది లేదు కదా?

నిజమే. ఇప్పటి వరకూ నాకు అటువంటిది దక్కలేదు. అయితే ఇప్పుడే మంచి మంచి కథలు వస్తున్నాయి.  ఈ ఏడాదిలో మాత్రం సెన్సేషనల్ హిట్ ఒకటి ఇస్తాను.

కొత్త ప్రాజెక్టులు ఏమిటి?

ఇప్పుడిప్పుడే మంచి కథలు వస్తున్నాయి. అల్లూరి అనే సినిమా చేస్తున్నా. పోలీసు ఆఫీసర్ బయోపిక్. ఈ సినిమాతో మంచి హిట్ ఇవ్వగలననే నమ్మకముంది.

Sree Vishnu Interview:

Sree Vishnu Interview about Bhala Thandhanana
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs