Advertisement
Google Ads BL

డెడ్ లైన్ ఫస్ట్ లుక్ విడుదల


తాండ్ర సమర్పణ్ సమర్పణ లో అపర్ణా మాలిక్ హీరోయిన్ గా విలక్షణ నటుడు అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలో శ్రీ విఘ్నతేజ ఫిలిమ్స్ పతాకంపై బొమ్మారెడ్డి VRR రచన దర్శకత్వం లో తాండ్ర గోపాల్ నిర్మిస్తున్న సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం డెడ్ లైన్ (Dead Line). ఈ చిత్రం యొక్క మొదటి ప్రచార చిత్రం మరియు మోషన్ పోస్టర్ ని విడుదల చేస్తున్నారు చిత్ర బృందం. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా ఉంది. త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా దర్శకుడు బొమ్మారెడ్డి VRR మాట్లాడుతూ.. నేటి సమాజంలో ప్రతి స్త్రీ ఎదుర్కొంటున్న సమకాలీన సమస్య ను గురించి చర్చించే చిత్రం ఈ డెడ్ లైన్. నేటి యువత అభిరుచులను దృష్టిలో పెట్టుకుని మా చిత్రాన్ని చాలా కొత్తగా మోడరన్ గా తెరకెక్కించాం. ప్రేక్షకుడు ఊహించని విధంగా స్క్రీన్ ప్లే ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉత్కంఠ భరితంగా చిత్రీకరించాం. విలక్షణ నటుడు అజయ్ ఘోష్ చాలా ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. ఎక్కడ రాజీ పడకుండా చిత్రాన్ని నిర్మించాము. ఈరోజు మా చిత్రం యొక్క మొదటి పోస్టర్ ను మరియు మోషన్ పోస్టర్ ను విడుదల చేస్తున్నాం. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేస్తాము అని తెలిపారు.

నిర్మాత తాండ్ర గోపాల్ మాట్లాడుతూ.. మా దర్శకుడు చెప్పిన కథ చాలా బాగా నచ్చింది. అన్ని తన్నై చాలా గొప్పగా చిత్రీకరించారు. సినిమా చాలా బాగా వస్తుంది. ప్రేక్షకులందరికీ మా డెడ్ లైన్ చిత్రం నచ్చుతుంది. అనుకున్న బడ్జెట్ లో రాజీ పడకుండా చిత్రాన్ని నిర్మిస్తున్నాము. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆఖరి దశలో ఉంది. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తాం అని తెలిపారు.

Deadline Movie First Look Release:

Deadline Movie Released soon
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs