Advertisement
Google Ads BL

ఆర్జీవీ మా ఇష్టం (డేంజరస్) మే 6న విడుదల


డిఫరెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అవుతూ నేటితరం ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. జానర్ ఏదైనప్పటికీ తాను ఏదైతే చెప్పాలని అనుకుంటున్నారో దానికి తెర రూపమిస్తున్నారు. విలక్షణ దర్శకుడిగా వెండితెరపై తన మార్క్ చూపిస్తున్న ఆయన.. దేశంలోనే తొలిసారి మా ఇష్టం సినిమా రూపంలో ఓ లెస్బియన్ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇద్దరమ్మాయిల ప్రేమకథతో తెరకెక్కిన్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, వీడియోస్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.

Advertisement
CJ Advs

మా ఇష్టం (డేంజరస్) చిత్రాన్ని మే 6వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు రామ్ గోపాల్ వర్మ. ఈ మేరకు చిత్ర ప్రమోషన్స్ చేపట్టిన ఆర్జీవీ.. ఆస్క్ ఎనీథింగ్ అనే కార్యక్రమం చేపట్టారు. హైదరాబాద్ అంబేద్కర్ యూనివర్సిటీలో జరిగిన ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, చిత్రంలో లీడ్ రోల్స్ పోషించిన నైనా గంగూలీ, అప్సర రాణి పాలొన్నారు. లెస్బియన్ శృంగారం విషయమై పలువురు స్టూడెంట్స్, రాముయిజం ఫాలోవర్స్ అడిగిన ప్రశ్నలకు వర్మ ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు. ఈ సినిమా ఓ డిఫరెంట్ అనుభూతి కలిగిస్తుందని ఆయన చెప్పారు.

ఇది మహిళల మధ్య సాగే ఘాటు ప్రేమ కథ. స్త్రీ, పురుషుని మధ్య ప్రేమ, లైంగిక వాంఛ ఎలా అయితే ఉంటాయో వీరి మధ్య కూడా అలాగే ఉంటాయి. ఎందుకంటే ప్రేమ అనేది ప్రేమ మాత్రమే. దానికి లింగబేధంతో ఎలాంటి సంబంధం లేదు అని పేర్కొంటూ వదిలిన మా ఇష్టం ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేసింది. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Maa Ishtam Movie Release May 6th:

RGV Maa Ishtam (Dangerous) release worldwide on May 6th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs