Advertisement
Google Ads BL

అర్జున్ అల్లంగాడి గురించి విశ్వక్ సేన్


అశోకవనంలో అర్జున్ కళ్యాణం సినిమా బావుంది. పాటలు బావున్నాయి అని మాట్లాడటం కంటే ఇప్పుడు నేను అర్జున్ అల్లంగాడి గురించి మాట్లాడతా. వాడికి కాస్త భయం ఎక్కువ.. ఇన్ సెక్యూరిటీగా ఫీలవుతుంటాడు.. మనందరిలానే.. పాతికేళ్లు రాగానే చదువు.. ముప్పై ఏళ్లు రాగానే సెటిల్ అవ్వాలి.. పెళ్లి చేసుకోవాలి.. ఇలాంటి ఇన్‌సెక్యూరిటీస్‌తోనే ఉంటాం.. 35 ఏళ్లు వచ్చాక పెళ్లి చేసుకుంటే తప్పా? జైల్లో వేస్తారా? ఇప్పుడు అమ్మాయి అబ్బాయి కలిసి ఉంటే కూడా తప్పుగానే చూస్తారు. మనం మన గర్ల్ ఫ్రెండ్స్‌‌ని సమంత, ఐశ్వర్యా రాయ్‌లతో పోల్చితే.. వాళ్లు మనల్ని ఎలా ఉండాలని అనుకుంటున్నారో అని భయపడాల్సి వస్తుంది.. అమ్మాయిలకు కూడా చెబుతున్నా.. మీరు మీ ఫ్రెండ్.. బాయ్ ఫ్రెండ్‌‌తో కంపేర్ చేయొద్దు.. అలా చేస్తూ కలిసి ఉన్నారంటే.. మీరు సగం చచ్చినట్టే.

Advertisement
CJ Advs

మన ఇంటికి చుట్టాలు వస్తారు.. మీ పిల్లలు ఏం చేస్తున్నారు అని అడుగుతారు.. ఆ తరువాత ఇంట్లో పెద్ద చర్చే జరుగుతుంది.. మన అందరం కూడా ఈ భయాలతో బతుకుతాం.. అలా బతకొద్దు.. ఇవన్నీ రిలేటబుల్ అయినోడే అర్జున్ అల్లం.. 33 ఏళ్లు ఇలానే బతుకుతాడు.. వాటి నుంచి బయటకు వచ్చి పెళ్లి చేసుకుని ఎలా ఉన్నాడనేది ఈ కథ.. నన్ను బాగా చూసుకున్న నిర్మాత సుధీర్‌కు థ్యాంక్స్. వంద రూపాయలుంటే ఇవ్వండి.. అడ్వాన్స్ తీసుకుంటాను.. నెక్ట్స్ కూడా మీతోనే సినిమా తీయాలని ఉంది.. మీరు స్వీట్ హార్ట్ పర్సన్.. బీవీఎస్ఎన్ గారి ప్రజెంట్‌లో సినిమా రావడం నా అదృష్టం. సాగర్ నా ఫ్రెండ్.. కలిసి షార్ట్ ఫిల్మ్‌లు తీశాం.. నేను ఈ కథకు సూట్ అవుతాను అని ఆయనకే అనిపించిందట.. 

ఇంత వరకు నా సినిమా కష్టాల గురించి ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడు చెప్పాలని అనుకుంటున్నా. ఎవరైనా ఇంట్లో హీరో అవుతాను అని చెబితే అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. కానీ నన్ను మాత్రం మా అమ్మ నమ్మింది.. ఆ తరువాత నాన్న నమ్మాడు.. ఎంతో కష్టపడి ఫిల్మ్ కోర్సులు.. నేర్చుకున్నాను. డ్యాన్స్, యాక్టింగ్ అన్నీ నేర్చుకున్నాను. 12 లక్షలు పెట్టి వెళ్లిపోమాకే చేశాను.. నిర్మాతకు నచ్చి కొని రిలీజ్ చేశాడు. అదే పెద్ద సక్సెస్.. నా దగ్గర ఏం లేని సమయంలో తరుణ్ భాస్కర్ నన్ను పెట్టి సినిమా తీశాడు. ఆయనకు థ్యాంక్స్.

అమ్మా నీకు ఒకటి చెబుతున్నా.. నీ కొడుక్కి ఏం కాదు.. ఎవరూ ఏమీ చేయలేరు.. నేను అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇవ్వనని అంటున్నారు.. అదే నిజమైతే.. ఆ రోజు స్టూడియోలో అలా వచ్చి ఉండేవాడిని కాదు.. నీ కొడుక్కి నువ్ నేర్పిన సంస్కారం అందరికీ తెలుసు.. నాకు బ్యాక్ గ్రౌండ్ లేదు.. చిన్న ఈగలాంటివాడిని.. నలుగురు కలిపి కొడితే పడిపోతాను..కానీ నాకు రక్షణగా మీరున్నారు (అభిమానులు).. మీరు (ఫ్యాన్స్) పెట్టిన మెసెజ్‌లు చేశాను.. మీరే నా ఆస్తి.. నన్ను ఎవ్వరూ ఏం చేయ‌లేరు అనిపించింది.. నాకు మీరున్నారు.. డౌట్ వస్తే.. హ్యాష్ ట్యాగ్ విశ్వక్ సేన్ అని కొట్టి చూడండని చెబుతాను.. అని ఎమోషనల్ అయ్యాడు.

అనంతరం మోకాళ్ల మీద కూర్చుని అభిమానులను ఉద్దేశించి మాట్లాడాడు. మీరు లేకపోతే.. మీరు లేకపోతే.. నా ప్లేస్‌లో వీక్ హార్టెడ్ పర్సన్ ఉంటే.. ఏమైనా జరిగిదే.. కానీ నేను మీరు బాధపడే పని ఏం చేయను.. మీరు పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటా.. ఈ ఏడాది మూడు సినిమాలు ఇస్తా.. నా కోసం నిలబడినందుకు అందరికీ థ్యాంక్స్.. నేను చెప్పుకునేది ఒకటే.. నాకు మీరు తప్పా ఎవ్వరూ లేరురా.. థ్యాంక్స్ అన్నారు. 

Vishwak Sen speech at Ashoka Vanam Lo Arjuna Kalyanam :

Ashoka Vanam Lo Arjuna Kalyanam Pre release event
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs