Advertisement
Google Ads BL

మిత్రా ఎపిసోడ్ తో బిగ్ బాస్ కి భారీ కంటెంట్


బిగ్‌బాస్‌ నాన్ స్టాప్‌లో ముక్కుసూటిగా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లేది ఎవరైనా ఉన్నారంటే.. అది మిత్రా శర్మ అని ఎలాంటి సందేహం లేకుండా చెప్పవచ్చు. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ రేంజ్‌కు చేరుకోవాలని ప్లాన్ చేస్తున్న మిత్రా శర్మ బిగ్ బాస్ రియాలిటీ షోలో మెరిసింది. అయితే గత నామినేషన్ల ప్రక్రియ నుంచి హోస్ట్ నాగార్జున నిర్వహించే వీకెండ్ షో వరకు ఆమె ఫైర్ బ్రాండ్‌గా నిలిచింది. అయితే నాగార్జున వేదిక మీద పంపించిన ఫోటో చూసి మిత్రా శర్మ ఎమోషనల్ కంటతడి పెట్టుకొన్నారు. అయితే ఆ ఫోటో వెనుక కథ ఏమిటంటే..

Advertisement
CJ Advs

గతవారం నామినేషన్ల ప్రక్రియ విషయంలో తనను టార్గెట్ చేసిన బిందు మాధవి చేసిన వ్యాఖ్యలను మిత్రా శర్మ తప్పుపట్టింది. అయితే టాస్క్ ఆడుతున్న సమయంలో తనకు వెన్నునొప్పి ఉందని చెబితే.. దానిని తప్పుడు విధంగా చెబుతూ మిత్రా శర్మ వెన్నుముకకు సర్జరీ, ఆపరేషన్ చేసిన ఆరోపణలను నాగార్జున తప్పుపట్టారు. బిందుమాధవి టార్గెట్ చేయడాన్ని మిత్ర బలంగా తిప్పి కొట్టింది. మిత్రా శర్మను ఉద్దేశించి బిందు మాధవి చేసిన కొన్ని వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఎదైనా ఏమైనా విషయం చెబితే.. వాటిని ఊహించుకోవద్దు అని నాగార్జున సలహా ఇంటి సభ్యులకు ఇచ్చారు. అయితే వేదికపైకి కంటెస్టెంట్ల ఇంటి సభ్యులను పిలిచి ఫన్ గేమ్ ఆడించారు. అయితే చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకొన్న మిత్రాశర్మకు తన తండ్రి ఫోటోను పంపించడంతో మిత్రా శర్మ ఎమోషనల్ అయింది. నాగార్జున పంపిన తన తండ్రి ఫోటోను చూసి మిత్రాశర్మ భోరున విలపించింది. ఇంటిలోకి అందరి కుటుంబ సభ్యులు వస్తుంటే.. నా ఫ్యామిలీ మెంబర్స్ రాకపోవడంపై ఆవేదన చెందారు. నాకు నా అనే వాళ్లు లేరు అని కన్నీరుమున్నీరయ్యారు. అయితే ఇలాంటి భావోద్వేగమైన క్షణాల్లో మిత్రాశర్మకు ఇష్టమైన సిరి హన్మంతు, గంగాధర్‌ను పరిచయం చేశారు. వారిని చూడగానే మిత్రాశర్మ ఎమోషనల్ అయింది.

తనను చూడటానికి వచ్చిన గంగాధర్‌ గురించి మాట్లాడుతూ మిత్రాశర్మ ఎమోషనల్ అయింది. తన తండ్రి తర్వాత తండ్రి లాంటి వారు. నాకు అన్నయ్య లాంటి వారు అని ఆనందాన్ని వ్యక్తం చేసింది. వారిద్దరని చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అని మిత్రాశర్మ చెప్పింది. మిత్రాశర్మ గురించి గంగాధర్ మాట్లాడుతూ.. ఆమె సివంగి. అలానే ఇంటిలో ఆడుతున్నది. బయట ఎలా ఉంటుందో.. ఇంటిలో కూడా అలానే ఉంది. షోలో బాగా ఆడుతున్నది అని గంగాధర్ చెప్పాడు. ఇక మిత్రా గేమ్ గురించి సిరి హన్మంతు కూడా ప్రశంసలు కురిపించిది. టాప్ 5లో ఉండటం ఖాయం అని సిరి హన్మంతు జోస్యం చెప్పింది.

Mitra Sharma Episode is Highlight:

Bigg Boss Huge Content with Mitra Sharma Episode
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs