Advertisement
Google Ads BL

సర్కారు వారి పాట పవర్ ప్యాక్డ్ కమర్షియల్ ఎంటర్టైనర్


సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం సర్కారు వారి పాట ఆల్బమ్ చార్ట్ బస్టర్ గా  నిలిచింది. సంగీత సంచలనం ఎస్.ఎస్. తమన్ స్వరకల్పనలో ఇప్పటికే విడుదలైన కళావతి, పెన్నీ, టైటిల్ సాంగ్ అన్నీ వర్గాల ఆడియన్స్ ఆకట్టుకొని టాప్ ట్రెండింగ్ వున్నాయి. తాజాగా సర్కారు వారి పాట మ్యూజికల్ సెన్సేషన్ తమన్ మీడియాతో ముచ్చటించారు. ఆయన పంచుకున్న సర్కారు వారి పాట విశేషాలు...

Advertisement
CJ Advs

ఒక పెద్ద స్టార్ హీరో సినిమాకి పని చేయడంలో లాభ నష్టాలు ఎలా వుంటాయి ?

భారీ అంచనాలు వుండటం ఒక ఇష్యూ. ఆ అంచనాలు అందుకోవడం కోసం ఏదైనా స్పెషల్ స్కూల్ వుంటే బావున్ననిపిస్తుంటుంది. మ్యూజిక్ చేయడమే కాకుండా దాన్ని చక్కగా ప్రమోట్ చేసి జనాల దగ్గరికి తీసుకెళ్ళడం కూడా ఒక భాద్యతగా మారింది. చెవులకి మాత్రమే కాదు మేము కూడా కనిపించాల్సిన తప్పనిసరి పరిస్థితిలోకి వచ్చేశాం. ఒకసారి చేశాం.,, ఇప్పుడది అలవాటు గా మారిపోయింది. 

ఇది వరకూ పాట స్లోగా హిట్టు అయ్యే పరిస్థితి వుండేది. కానీ ఇప్పుడన్నీ ఇన్స్టెంట్ హిట్స్ వస్తున్నాయి కదా .. ? 

ఇది వత్తిడితో కూడుకున్న వ్యవహారమే. మంచి మ్యూజిక్ ఇవ్వడం ఒక ఎత్తు అయితే , అంచనాలు, వత్తిడి ని భరించగలడా ? అనేది కూడా చూస్తున్నారు. దర్శకుడు, హీరో, ఫ్యాన్స్ .. ఇలా అందరూ మ్యూజిక్ తప్పు ఒప్పులు చెబుతుంటారు. దీంతో పాటు మిగతా భాషల పాటలతో కూడా పోటీ వుంటుంది. అయితే ఇలాంటి ఆరోగ్యకరమైన పోటీ వుంటే మంచిది. ఈ వత్తిడి కూడా ఓ మంచి పాటని ఇవ్వడానికి అడ్వాంటేజ్ గా వుంటుంది. 

ట్యూన్ బావుంటే ఆటోమేటిక్ కన్విన్స్ అవుతారా ? లేదా వేరే పద్దతి వుంటుందా ? 

మేము ఎన్ని ట్యూన్స్ అయిన చేయడానికి రెడీగా వుంటాం. అయితే అది కథకు సరిపొతుందా లేదా ? అనేది ముఖ్యం. దర్శకుడు ఎంతో కాలం కష్టపడి ఒక కథని రెడీ చేసుకుంటాడు. కథని లిరికల్ గా చెప్పడానికి పాట కావాలి. ఇది చాలా పెద్ద భాద్యత. ఇప్పడు కథలో నుంచి వచ్చే పాటలే ఎక్కువ. సర్కారు వారి పాటలో కళావతి పాట ఇలా కథలో నుంచి వచ్చిందే. చాలా రోజుల తర్వాత ఒక మెలోడి పాటకు థియేటర్ స్టేజ్ ఎక్కి ఆడియన్స్ డ్యాన్స్ చేస్తారు. అంత అద్భుతంగా వుంటుంది కళావతి సాంగ్. 

కళావతి పాట ఓకే అవ్వడానికి ఎన్ని వెర్షన్స్ చేశారు ? 

ఒకటే వెర్షన్. 2020 లాక్ డౌన్ లో చేసిన పాటది. నేను, దర్శకుడు పరశురాం గారు, గీత రచయిత అనంత శ్రీరామ్ జూమ్ కాల్ మాట్లాడుతూ సినిమాలో హీరోయిన్ పేరుతో అనుకున్న ఫస్ట్ లైను. నాకు సామజవరగమనా , దర్శకుడు పరశురాం కి ఇంకేం ఇంకేం కావాలె లాంటి మేలోడిస్ వున్నాయి. ఖచ్చితంగా ఆడియన్స్ చాలా అంచనాలతో వుంటారు, అన్నిటికంటే ముఖ్యం మహేష్ బాబు గారు చాలా కాలం తర్వాత హీరోయిన్ పాత్రని ఉద్దేశించి పాడుతున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్..ఇది చాలా ప్యూర్ గా డిజైన్ చేయాలనీ ముందే అనుకున్నాం. అలా కళావతి పాటతో కంపోజింగ్ స్టార్ట్ చేశాం. అయితే పాట కంపోజ్ చేసి రెండేళ్ళు దాటిపోయింది. ఈ గ్యాప్ లో పాటకు రోజు ప్రాణం  పోస్తూ చివరిగా రిలీజ్ చేశాం. మా కష్టం వృధా కాలేదు.  ఫాస్టెస్ట్ గా 150మిలియన్స్ వ్యూస్ క్రాస్ చేసి కళావతి పాట అందరినీ అలరించింది.         

Music Director Thaman Interview:

Music Director Thaman Interview about Sarkaru Vaari Paata
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs