Advertisement
Google Ads BL

ప్రేమకథా చిత్రం శ్రీరంగాపురం


చిందనూరు విజయలక్ష్మీ సమర్పణలో శ్రీ సాయిలక్కీ క్రియేషన్స్ పతాకంపై నూతన నటీనటులు వినాయక్ దేశాయ్, పాయల్ ముఖర్జీ హీరో హీరోయిన్లుగా చిందనూరు నాగరాజు సత్యప్రకాష్, రోబో గణేష్, శ్రావణ సంధ్య, శ్రీమణి ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం శ్రీరంగాపురం యం.ఎస్.వాసు దర్శకత్వంలో ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకొని త్వరలో ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్ననట్టు చిత్ర నిర్మాత చిందనూరు నాగరాజు తెలిపారు.

Advertisement
CJ Advs

మేనమామ అంటే అమ్మకి అన్నలానో, దూరపు బంధువులానో, వాట్సాప్ వీడియో కాలో పలకరించే ఒక వ్యక్తిలా మిగిలిపోయిన ఈ రోజుల్లో మామ అంటే అమ్మకి అన్ననే కాదు కోడలి కంటికి కాపలా అని కోడలు ఆకలికి ఏడుస్తుందేమో అని పాల ఆవుల మందను ఇంటికి తెచ్చిన అమ్మలాంటి మనసున్న వ్యక్తి అని, కోడలికి ఆపద వస్తే అడ్డుగా నిలబడే నాన్నలాంటి మనసున్న శక్తి అని అందమైన ప్రపంచాన్ని తన చేతుల్లో మొదటిగా మనకి పరిచయం చేసే గొప్ప మనసున్న మనిషి అని, మన జీవితంలో తన పాత్ర మన పుట్టుకతో మొదలై తన చావులే ముగిసే వరకు ఎంత ప్రాముఖ్యమైనద్ గొప్ప సినిమాగా చరిత్రలో నిలుస్తుందని చిత్ర బృందం తెలిపారు. కుటుంబ విలువలకు అద్దంపడుతూ సాగే ఈ చిత్రం కుటుంబం మొత్తం కూర్చొని హాయిగా సినిమా చూసేలా నిర్మించామని చిత్ర నిర్మాత ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నో ప్రేమ చిత్రాలు చూశారు రక్త సంబంధంలో.. పాశం పెన వేసుకున్న ప్రేమకథా చిత్రం చూశారా..? త్వరలో చూద్దాం.. సృష్టిలో తల్లి ప్రేమ పవిత్రమైనది.. సృష్టిలో తండ్రి ప్రేమ విలువైనది.. ఆత్మీయ ప్రేమ అపూర్వమైనది.. తోబుట్టువుల ప్రేమ సంతోషకరమైనది.. ఈ ప్రేమలకన్నా అమితమైన స్వచ్ఛమైన ప్రేమ.. ఎవరిదనే.. తెలిపే ప్రేమ కధా చిత్రం శ్రీరంగాపురం.

Srirangapuram movie Its a Love story :

<pre id="tw-target-text" class="tw-data-text tw-text-large tw-ta" dir="ltr">Its a Love story Srirangapuram movie</pre>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs