Advertisement
Google Ads BL

సర్కారు వారి పాట టైటిల్ సాంగ్ వచ్చేస్తుంది


సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం సర్కారు వారి పాట పై అంచనాలు ఆకాశాన్ని  తాకుతున్నాయి. సినిమా నుంచి బయటికి వస్తున్న కంటెంట్ కు వస్తున్న స్పందన అంచనాలని ఇంకా భారీగా పెంచుతుంది. ఇప్పటికే సినిమాలోని మొదటి రెండు పాటలు చార్ట్‌బస్టర్స్ గా నిలిచాయి. మూడవ సింగిల్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు మూడో సింగల్ కి సంబధించిన అప్డేట్ కూడా వచ్చింది.

Advertisement
CJ Advs

ఈ సినిమాలో మూడో పాట టైటిల్ సాంగ్ ను ఈ నెల 23న ఉదయం 11.07 కు  విడుదల చేయనున్నారు. అదే పాట ట్యూన్ ని సినిమా టీజర్‌కి బీజీఎంగా కూడా ఉపయోగించడం మరో విశేషం. మ్యూజికల్ సెన్సేషన్  థమన్ ఈ ఆల్బమ్ కోసం అద్భుతమైన సౌండ్‌ట్రాక్‌లను కంపోజ్ చేశారు.

ప్రస్తుతం మహేష్ బాబు, కీర్తి సురేష్, డ్యాన్సర్లపై ఓ సాంగ్ చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ అందిస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్ లో షూట్ చేస్తున్న ఈ పాట మాస్ సాంగ్ గా అలరించనుంది. ఈ పాటతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.

ఇప్పటికే కళావతి, పెన్నీ పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలవడంతో ఆల్బమ్‌పై  భారీ అంచనాలు నెలకొన్నాయి. అటు రిలీజ్ డేట్ కూడా దగ్గర పడటంతో రెగ్యులర్ అప్డేట్స్ తో ప్రమోషన్స్ లో జోరు కొనసాగిస్తుంది చిత్ర యూనిట్.

Sarkaru Vaari Paata Title Song To Be Out On April 23rd:

Superstar Mahesh Babu Sarkaru Vaari Paata Title Song To Be Out On April 23rd
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs