Advertisement
Google Ads BL

వర్మదే విజయం, మా ఇష్టం మే 6న విడుదల


రాం గోపాల్ వర్మ ప్రెస్ నోట్ 👇

Advertisement
CJ Advs

గత కొద్ది రోజులుగా మీడియా లో చక్కర్లు కొడుతున్న నట్టి కుమార్, నట్టి క్రాంతి, నట్టి కరుణ ల విషయమై ఇప్పుడు నేను క్లారిటీ ఇస్తున్నాను. ఏప్రిల్ 8, 2022 న మూడు బాషల్లో రిలీజ్ కి సిద్దంగా ఉన్న నా డేంజరస్ చిత్రాన్ని ఆపటానికి నట్టి క్రాంతి, నట్టి కరుణ లు కుట్ర పన్ని, ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్ ఆధారంగా 5వ జూనియర్ సివిల్ జడ్జి, సిటీ సివిల్ కోర్టు లో పిటీషన్ ఫైల్ చేసి చిత్రాన్ని అడ్డుకున్నారు. ఆ క్రింది కోర్టు ఇచ్చిన injunction ఆర్డర్ ని ఇప్పుడు తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది.

నేను ఇప్పుడు నట్టి క్రాంతి నట్టి కరుణ ల మీద ఫోర్జరీ కి సంభందించిన కేసే కాకుండా, వివిధ మీడియా ఛానళ్లలో నా పై చేసిన నిందలు, ఆరోపణలకు సంబంధించి నట్టి క్రాంతి,నట్టి కరుణ ల ఫాదర్ అయినటువంటి నట్టి కుమార్ మీద నేను, తుమ్మలపల్లి రామత్యనారాయణ గారు డిఫమేషన్ కేసు వెయ్యటమే కాకుండా రిలీజ్ కి ముందు forged డాక్యుమెంట్ ని ఉపయోగించి సినిమా ని ఆపి మాకు అపారమైన ఆర్థిక నష్టం కలిగించినందుకు కూడా నేను, తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు వాళ్ల మీద damage కేసు వెయ్యబోతున్నాము.

ఇప్పుడు విడుదల చేసేందుకు క్లియరెన్స్‌ ఆర్డర్ వచ్చింది కనుక డేంజరస్ చిత్రాన్ని May 6 న విడుదల చెయ్య బోతున్నాము. దానికి సంభందించి మాకు జారీ చేసిన సెన్సార్ సర్టిఫికెట్ లు కూడా పబ్లిక్ డొమైన్ లో పెడుతున్నాము. ఫోర్జరీ చేసి, దానిని నిజమైన డాక్యుమెంట్‌గా ఉపయోగించడం ద్వారా నట్టి క్రాంతి, నట్టి కరుణ లు  చేసిన  క్రిమినల్ చర్యలకి సంబంధించిన విషయాలు, అలాగే పైన పేర్కొన్న ఇంజక్షన్-ఆర్డర్‌ను నట్టిలు సేకరించిన విధానాన్ని, యంత్రాంగాన్ని దుర్వినియోగ పరుచుకున్న తీరు నట్టి ఫ్యామిలీ యొక్క నేరపూరిత స్వభావాన్ని తెలియజేస్తుంది.

ఈ ప్రెస్ నోట్ తప్ప, ఇకపై నేను ఈ విషయంపై ఇంకేం మాట్లాడబోను.. జస్ట్ వాళ్ల పైన చట్టపరమైన చర్యలపై మాత్రమే దృష్టి పెడతాను.. అతి త్వరలో వాళ్ల అసలు రూపం బయట పడబోతోంది.

Ram Gopal Varma Press Note:

may 6th maa istam movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs