Advertisement
Google Ads BL

గని ఓటిటి ప్లాట్ ఫామ్ అండ్ రిలీజ్ డేట్ ఫిక్స్


యంగ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ డీజే టిల్లు, పవర్‌ఫుల్‌ బ్లాక్‌బస్టర్‌ భీమ్లానాయక్‌...  తర్వాత యాక్షన్‌ ఫ్యామిలీ డ్రామా గనిని విడుదల చేయడానికి సిద్ధమవుతోంది అచ్చ తెలుగు ఓటీటీ ఆహా. మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌, సాయి మంజ్రేకర్‌, సునీల్‌ శెట్టి, ఉపేంద్ర రావు, నవీన్‌ చంద్ర, జగపతిబాబు, నదియ లీడ్‌  రోల్స్ లో నటించిన సినిమా గని.

Advertisement
CJ Advs

100 శాతం తెలుగు స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫార్మ్, అచ్చ తెలుగు లోగిళ్లలో ఆదరణ పొందిన తెలుగు ఓటీటీ ఆహా... ప్రతి శుక్రవారం కొత్త సినిమా ప్రసారం అని, తన అభిమాన ప్రేక్షకులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటోంది. ప్రతి శుక్రవారం సరికొత్త కంటెంట్‌తో అలరిస్తోంది.

కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా గని. తమన్‌ సంగీతం అందించారు. అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించిన సినిమా ఇది. 

గని సినిమా విడుదలకు సంబంధించి పవర్‌ ప్యాక్డ్ యాక్షన్‌ ప్రోమోతో అనౌన్స్ చేశారు ఆహా టీమ్‌. మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ మునుపెన్నడూ కనిపించని అవతార్‌లో ఇందులో కనిపిస్తున్నారు. ఈ సినిమా మేకింగ్‌కి పడ్డ కష్టమంతా, అందులో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.

Aha announces streaming date of Ghani:

Aha announces streaming date of Ghani, To premiere on April 22nd  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs