Advertisement
Google Ads BL

నిఖిల్ కూడా పాన్ ఇండియా అంటున్నాడు


నిఖిల్ సిద్ధార్థ్ కార్తికేయ 2, 18 పేజెస్ సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉంటున్నాడు. ఇప్పుడు నిఖిల్ పాన్ ఇండియా మర్కెట్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. గూడాచారి, ఎవరు, హిట్ లాంటి సూపర్ హిట్ చిత్రాల ఎడిటర్ గా చేసిన గ్యారీ బిహెచ్ దర్శకత్వంలో నిఖిల్ పాత్రకు తగట్టు పాన్ ఇండియా లెవల్ కి తగ్గట్టుగా స్పై అని టైటిల్ ఖరారు చేసింది చిత్ర యూనిట్. టైటిల్ పోస్టర్ డిజైన్ చాలా ఆసక్తికరంగా వుంది. గన్‌లు, బుల్లెట్‌లు, స్నిపర్ గన్ స్కోప్‌ తో పాటు టైటిల్ లెటర్ ని గన్ సేఫ్ లో సాలిడ్ గా డిజైన్ చేశారు. టైటిల్ పోస్టర్ లో నిఖిల్ లుక్ స్టన్నింగా వుంది.  బ్లాక్ టీ-షర్ట్, బ్లాక్ జాకెట్, బ్లాక్ కార్గో ప్యాంట్, క్లాసిక్ ఏవియేటర్స్ ధరించి, చేతిలో గన్ తో సూపర్ స్టైలిష్‌ స్పై గా కనిపించారు నిఖిల్. అందరి ద్రుష్టిని ఆకర్షించిన ఈ టైటిల్ పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.

Advertisement
CJ Advs

సరికొత్త గెటప్, పాత్రలో కనిపించనున్న స్పై ని నిఖిల్ తొలి పాన్ ఇండియా చిత్రంగా నిర్మాతలు భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో 2022 దసరాకు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయబోతుందని చిత్ర యూనిట్ ప్రకటించింది.

Nikhil, Gary film titled in a powerful manner :

Nikhil 19 gets a powerful tile
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs