Advertisement
Google Ads BL

జయమ్మ పంచాయితీ: సుమ నోట బూతు మాట


పాపులర్ యాంకర్, టెలివిజన్ వ్యాఖ్యాత, హోస్ట్ సుమ కనకాల చాలాకాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై ప్రధాన పాత్రలో నటించిన జయమ్మ పంచాయితీ విడుదలకు సిద్ధమైయింది. ప్రస్తుతం ప్రమోషన్స్ జోరుగా జరుపుకుంటున్న ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదగా ఈ ట్రైలర్ గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

Advertisement
CJ Advs

2 నిమిషాల 15 సెకండ్ల నిడివి గల ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఆకట్టుకుంది. తనకు వచ్చిన సమస్య పై జయమ్మ పంచాయితీ పెట్టడం, గ్రామ పెద్దలు జయమ్మ సమస్యని తేలికగా తీసుకోవడం, జయమ్మ ఎదురు తిరగడం.. వంటి అంశాలతో సినిమా పై ఆసక్తిని పెంచేలా ట్రైలర్ వుంది. 

ఉత్తరాంధ్ర మాండలికంలో సాగిన సంభాషణలు ఆసక్తికరంగా వున్నాయి. ఎవరు వల్ల సెడ్డావురా వీరన్న అంటే నోటి వల్ల సెడ్డానురా కాటమరాజా అని జయమ్మ పలికిన డైలాగ్, అలాగే సుమ నోటి వెంట ఈ ట్రైలర్ బూతుమాటలు కూడా వినిపించాయి. ట్రైలర్ లో వినిపించిన డైలాగ్స్ , జయమ్మపాత్రలో సుమ కనిపించిన తీరు అద్భుతంగా వుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక సుమ కనకాల బుల్లితెర మీద పాపులర్ ఛానల్స్ లో పాపులర్ షోస్ లో తన జయమ్మ పంచాయితీ ని ప్రమోట్ చేస్తూ బిజీగా వుంది.

Pawan launches Jayamma Panchayathi trailer:

Jayamma Panchayathi trailer revealed 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs