Advertisement
Google Ads BL

‘ధీర’గా లక్ష్ చదలవాడ.. మూవీ ప్రారంభం


వరుస సినిమాలకు కమిటవుతూ కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడు యంగ్ హీరో లక్ష్ చదలవాడ. ‘వలయం’ సినిమాతో విమర్శకుల ప్రశంసలందుకున్న ఆయన.. త్వరలోనే ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ క్రమంలోనే మరో ప్రాజెక్టు ఓకే చేసి ఆ సినిమాను సెట్స్ మీదకు తీసుకొచ్చాడు. ‘ధీర’ అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను శనివారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. తొలి సన్నివేశానికి ఖ్యాతి చదలవాడ  క్లాప్ ఇవ్వగా.. ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ నెల 14వ తేదీ వరకు హైదరాబాద్‌లో మొదటి షెడ్యూల్ షూటింగ్ జరగనుంది.

Advertisement
CJ Advs

 

విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సరికొత్త కథాంశంతో ఈ సినిమా రూపొందిస్తున్నారు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 12గా ఈ సినిమా నిర్మిస్తున్నారు. పలు సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించిన సాయి కార్తీక్ ఈ సినిమాకు బాణీలు కడుతున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ హంగులతో ఈ సినిమా నిర్మాణం పూర్తి చేయనున్నారట మేకర్స్.

 

విలక్షణ కథలకు కేరాఫ్ అడ్రస్ అవుతున్న హీరో లక్ష్ ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కడం ఖాయమని చిత్రయూనిట్ చెబుతోంది. నేటితరం కోరుకునే అన్ని అంశాలు జోడించి ఈ సినిమా రూపొందిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు. 

Laksh Chadalvada Starring Dheera Movie Launched:

Hero Laksh Dheera Movie Shooting Started
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs