Advertisement
Google Ads BL

ఆహా అందిస్తుంది అద్భుతమైన లక్కీ ఛాన్స్


తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహాలో ప్ర‌స్తుతం భీమ్లా నాయ‌క్ స్ట్రీమింగ్ అవుతుంది. రీసెంట్‌గా ఆహా ఓ కంటెస్ట్‌ను లాంఛ్ చేసింది. అందులో గెలిచిన‌వారికి భీమ్లా నాయక్ సినిమాలో ప‌న‌వ్ క‌ళ్యాణ్ ఉప‌యోగించిన బైక్‌ను గెలుచుకుంటారు. ఆహా ఓటీటీని ఏప్రిల్ 15 లోపు ఎవ‌రెవ‌రు సబ్ స్క్రైబ్ చేసుకుంటారో వారు ఈ కంటెస్టెంట్‌కు అర్హ త సాధిస్తారు. ఈ కంటెస్టెంట్‌ను రీసెంట్‌గా భీమ్లా నాయ‌క్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ అనౌన్స్ చేశారు. 

Advertisement
CJ Advs

ఈ కంటెస్టెంట్‌లో భాగంగా భీమ్లా నాయక్‌లో ప‌వ‌న్ ఉప‌యోగించిన బుల్లెట్ బైక్‌ను తెలుగు రాష్ట్రాల్లోని ఖ‌మ్మం, రాజ‌మండ్రి వంటి ప్ర‌ధాన న‌గ‌రాల్లో టూర్‌లా ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ప‌వ‌న్ ఫ్యాన్స్ నుంచి ఈ టూర్‌కు అద్భుత‌మైన వెల్‌క‌మ్ దొరుకుతుంది. త్వ‌ర‌లోనే ఈ బైక్ టూర్‌లో భాగంగా కొత్త‌గూడెం, విజ‌య‌న‌గ‌రం ప్రాంతాల‌కు చేర‌నుంది. 

బుధ‌వారం రోజున ఈ బైక్ వైజాగ్ న‌గ‌రానికి చేరుకుంది. దీనికి ప‌వ‌న్ ఫ్యాన్స్ నుంచి పెద్ద ఎత్తున స్వాగ‌తం ల‌భించింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్.. ప‌వ‌ర్ స్టార్ అని రాసిన‌ టీ ష‌ర్ట్ ధ‌రించి వెల్ క‌మ్ చెప్పారు. కొంద‌రు ఫ్యాన్స్ ఆ బైక్‌ను ఆహా కేన్‌ట‌ర్ వ్యాన్ చుట్టూ న‌డిపారు కూడా. 

మార్చి 24 అర్ధ రాత్రి నుంచి ఆహాలో భీమ్లా నాయ‌క్ స్ట్రీమింగ్ అవుతుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి, నిత్యామీన‌న్‌, సంయుక్తా మీన‌న్ న‌టించారు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సినిమా రూపొందింది. భీమ్లా నాయ‌క్ సినిమాతో ఆహా త‌న మాధ్య‌మంలో 4కె, డాల్బీ 5.1 టెక్నాల‌జీని అందుబాటులోకి తెస్తున్న‌ట్లు తెలియ‌జేసింది. 

భీమ్లా నాయ‌క్ చిత్రం ఓ పోలీస్ ఆఫీస‌ర్ ఆత్మ గౌర‌వానికి, రిటైర్డ్ మిల‌ట‌రీ ఆఫీస‌ర్ అహానికి మ‌ధ్య జ‌రిగే పోరు. ఇందులో  పోలీస్ ఆఫీస‌ర్ భీమ్లా నాయ‌క్‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తే, రిటైర్డ్ మిల‌ట‌రీ ఆఫీస‌ర్ డానియల్ శేఖ‌ర్ పాత్ర‌లో రానా ద‌గ్గుబాటి న‌టించారు. పోలీస్ ఆఫీస‌ర్ అయిన భీమ్లా నాయ‌క్ త‌న విలువ‌లను పాటిస్తూ డానియ‌ల్ శేఖ‌ర్ చేసిన త‌ప్పుకు కేసు న‌మోదు చేస్తాడు. అక్కడ నుంచి వారి మ‌ధ్య యుద్ధం మొద‌ల‌వుతుంది. 

అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే, తెలుగు ఇండియ‌న్ ఐడిల్‌, డీజే టిల్లు, సేనాప‌తి, భామా క‌లాపం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌, ల‌వ్ స్టోరి, లెవ‌న్త్ అవ‌ర్, స‌ర్కార్, జాంబిరెడ్డి, చావు క‌బురు చ‌ల్ల‌గా, నాంది, త్రీ రోజెస్‌, ఇది ది నేమ్ ఆఫ్ గాడ్‌, కాలా, ఆహా భోజ‌నంబు, వ‌న్‌, సూప‌ర్ డీల‌క్స్‌, చ‌తుర్ ముఖం, త‌ర‌గ‌తి గ‌ది దాటి, ది బేక‌ర్ అండ్ ది బ్యూటీ, మ‌హా గ‌ణేశ‌, ప‌రిణ‌యం, ఒరేయ్ బామ్మ‌ర్ది, కోల్డ్ కేస్‌, అల్లుడు గారు, ఇచ‌ట వాహ‌న‌ములు నిలుపురాదు వంటి తెలుగు సినిమాలు, వెబ్ ఒరిజిన‌ల్స్‌ను ప్రేక్ష‌కుల‌కు అందిస్తూ తిరుగులేని ఎంట‌ర్‌టైన్మెంట్‌ను అందిస్తోంది ఆహా.

Aha is running an exciting contest:

Aha is running an exciting contest to subscribe and win Pavan Kalyan bike from Bheemla Nayak
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs