Advertisement
Google Ads BL

వ‌ర‌ల్డ్ బిగ్గెస్ట్ స్టేజ్ తెలుగు ఇండియన్ ఐడల్


వ‌ర‌ల్డ్ బిగ్గెస్ట్ స్టేజ్ తెలుగు ఇండియన్ ఐడల్ లో ఈ వారం ఛాలెంజింగ్ ఎపిసోడ్.. టాప్ 12 కంటెస్టెంట్స్ మధ్య ఓటింగ్ ప్రారంభం 

Advertisement
CJ Advs

మార్చి 25, 26 తేదీల్లో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఓపెన్ అవుతున్న ఓటింగ్ లైన్స్ అత్యుత్త‌మ‌మైన తెలుగు గాత్రాన్ని క‌నుగొనే ఉద్దేశంతో ప్ర‌పంచంలోనే బిగ్గెస్ట్ స్జేజ్ ప్రోగ్రామ్ తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్‌ను ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహా నిర్వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే. సాయంకాల స‌మ‌యంలో కుటుంబంలోని స‌భ్యులంద‌రూ క‌లిసి చూసే షోగా ఇది ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకుంది. 

వేలాది ఆడిష‌న్స్‌, స్క్రీనింగ్ రౌడ్స్ త‌ర్వాత షోలో పాల్గొన‌బోయే 12 మంది టాప్ ఫైన‌లిస్ట్‌ను గ్రాండ్‌గా అనౌన్స్ చేయ‌బోతున్నారు. ఈ 12 మంది త‌మ శ్రావ్య‌మైన గొంతుతో బెస్ట్ గాత్రాన్ని అందించ‌డానికి సిద్ధంగా ఉన్నారు. ఈ వారంతంలో జ‌ర‌గ‌నున్న‌ కాంపిటీష‌న్ చాలా స‌వాళుతో కూడుకున్న‌ది. ఇందులో ఆడియెన్స్ ద‌గ్గ‌ర నుంచి ఓటింగ్ సంపాదించుకున్న వారు పోటీలో ఉంటే మిగిలిన వారు ఎలిమినేష‌న్‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. ఎలిమినేష‌న్, ఓటింగ్ ప్ర‌క్రియ గుంచి ఓ కంటెస్టెంట్‌ను అడిగిన‌ప్పుడు నా బెస్ట్ పెర్ఫామెన్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అని తెలిపారు. 

నిత్యా మీన‌న్ మాట్లాడుతూ.. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన అన్ని ఎపిసోడ్స్ చ‌క్క‌గా జ‌రిగాయి. ఇందులో బెస్ట్ టాలెంట్‌ను వెలికి తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నారు. సింగర్స్ కూడా చక్కగా పెర్ఫామెన్స్ చేశారు. ఇందులో ఒక విన్న‌ర్ మాత్ర‌మే ఉంటారు. కాబ‌ట్టి ప్రేక్ష‌కులు చ‌క్క‌టి జడ్జ్‌మెంట్ ఇస్తార‌ని న‌మ్మకం ఉంది అన్నారు. 

ఓటింగ్ లైన్స్ 25, 26 తేదీల్లో రాత్రి 9 నుంచి ఉదయం 7 గంటల వరకు ఓపెన్ అవుతాయి. యాప్‌ను ఉప‌యోగించి ఓటు వేయ‌చ్చు. ఈ యాప్‌లో తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ అనే చోట్ల క్లిక్ చేయ వ‌చ్చు లేదా మిస్డ్ కాల్ ఇవ్వ‌డం ద్వారా కూడా ఓటింగ్‌లో పాల్గొన వ‌చ్చు. 

Top 12 contestants of the world s biggest stage Telugu Indian Idol:

<span>Telugu Indian Idol gear up for a challenging episode this week, as voting begins.</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs