Advertisement
Google Ads BL

అధీర గా దానయ్య కొడుకు కళ్యాణ్ లుక్


ఇండస్ట్రీకి మరో హీరోని పరిచయం చేస్తూ మరో సూపర్ హీరో ఫిలిం చేయబోతున్నాడు ప్రశాంత్ వర్మ. ఇప్పుడు ఈ చిత్రం ద్వారా కళ్యాణ్ దాసరి హీరోగా పరిచయం అవుతున్నారు.  ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి అధీర అనే టైటిల్ నిర్ణయించారు. ప్రెజెంట్ తేజ సజ్జా తో హను మాన్ అనే సూపర్ మ్యాన్ కాన్సెప్ట్ తో మూవీ చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ.

Advertisement
CJ Advs

భారతీయ పౌరాణిక పాత్రల నుండి ప్రేరణ పొందిన ప్రశాంత్ వర్మ, మార్వెల్, DC వంటి సూపర్ హీరోలను క్రియేట్ చేస్తున్నాడు. సినిమాటిక్ యూనివర్స్ నుండి ప్రశాంత్ వర్మ సృష్టిస్తున్న ఈ చిత్రం స్క్రిప్ట్, కథను చెప్పే విధానం ప్రత్యేకంగా వుండబోతోంది.  కళ్యాణ్ టైటిల్ రోల్లో కనిపించనున్న ఈ సూపర్ హీరో చిత్రం అధీర ఎంతో ప్రత్యేకతను సంతరించుకోనుంది.

గ్రాండ్ గా ఉండేలా డిజైన్ చేసిన అధీర పోస్టర్ ని ఆర్.ఆర్.ఆర్. త్రయం అయిన ప్రముఖ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సంయుక్తంగా విడుదల చేసి అధీర టీం కి తమ బెస్ట్ విషెస్ తెలియజేసారు. దాంతో అధీర నుంచి వచ్చిన ఫస్ట్ స్ట్రైక్  ప్రారంభంలోనే భారీ స్థాయిలో క్రేజ్ను సంపాదించుకుంది.

ఫస్ట్ స్ట్రైక్ చూస్తుంటే,  చిన్నప్పటి నుంచీ అధీరకు పవర్స్ వున్నాయనే ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేస్తూ సన్నివేశాలతో ఆకట్టుకుంది. విజువల్స్ గ్రాండియర్గా వున్నాయి. బ్యాక్ గ్రౌండ్ సంగీతం మరోస్థాయిలో వుంది. వీటిని చూస్తే ప్రశాంత్ వర్మ కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయబోతున్నాడని స్పష్టమవుతోంది.

విజువల్స్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి. ప్రత్యేకంగా రూపొందించిన ఆయుధంతో ఎనర్జీ లెవెల్ పెంచేలా వీడియోలో అధీరగా కళ్యాణ్ కనిపించాడు. తన చేతిలో వున్న ఆయుధం వెన్నెముక ఆకారంలో ఉండి,  ఇంద్రుడి శక్తివంతమైన ఆయుధం వజ్రాయుధం ను పోలివుంది.

కళ్యాణ్ దాసరి ఫేస్ కొద్దిగా రివీల్ చేయబడింది.  అందమైన లుక్ తో, తగినంత ఎత్తుతో పాత్రలో ఒదిగిపోయాడు.

Prashanth Varma, Kalyan Dasari Adhira look revealed :

Rajamouli, NTR, Ram Charan Launched First Strike Of Prashanth Varma, Kalyan Dasari, Primeshow Entertainment Adhira
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs