Advertisement
Google Ads BL

అప్పుడే ముగించేసిన గాడ్ ఫాదర్


మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రంగా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ మూవీని  కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం ప్రస్తుతం ముంబై లో చిత్రీకరణ జరుపుకుంటుంది. గాడ్ ఫాదర్ లో బాడీ గార్డ్ గా నటించబోతున్న స‌ల్మాన్ ఈ మధ్యనే షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. మీ నటన ప్రేక్షకులకు అద్భుత కిక్‌ని ఇస్తుందనడంలో సందేహం లేదు.. అంటూ చిరంజీవి ఈ సంద‌ర్భంగా ట్వీట్ కూడా చేసారు. ఈ సిఎంమాలో స‌ల్మాన్ ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌ను పోషిస్తున్నారు. చిరంజీవి, స‌ల్మాన్ ఖాన్‌పై తెర‌కెక్కిస్తున్న స‌న్నివేశాలు చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయ‌ని చిత్ర‌యూనిట్ చెబుతోంది.. ఇలా మెగాస్టార్ చిరంజీవి, స‌ల్మాన్ ఖాన్‌లు ఇద్ద‌రూ ఒకేచోట కనిపించ‌డం అభిమానుల‌కు పండుగే. 

Advertisement
CJ Advs

సల్మాన్ ఖాన్ - చిరు కాంబో లో ముంబై లోని ఓ స్టూడియో లో చిత్రీకరించారు. ప్రస్తుతం సోమ‌వారంతో గాడ్ ఫాదర్ ముంబై షెడ్యూల్ పూర్త‌యింది. ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత‌లు RB చౌదరి & NV ప్రసాద్ ముంబై సెట్లో మ‌ర్యాద‌పూర్వ‌కంగా చిరంజీవి, స‌ల్మాన్ ఖాన్‌ని క‌లిశారు. ఇందులో ద‌ర్శ‌కుడు మోహన్ రాజా కూడా వున్నారు. ఈ ఫొటోను చిత్ర యూనిట్ ఈరోజు విడుద‌ల చేసింది. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో నయనతార కీలక పాత్ర పోషిస్తోంది.

Salman threatens to walk out of Godfather:

Godfather: When Salman threatened to walkout
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs