Advertisement
Google Ads BL

మూడు భాషల్లో హాన్సిక మై నేమ్‌ఈజ్ శృతి


 

Advertisement
CJ Advs

ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటి వరకు రానటువంటి ఆర్గాన్ మాఫియా నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం మై నేమ్‌ఈజ్ శృతి ఇటీవల విడుదలైన టీజర్‌లో చర్మం వలిచి బిజినెస్ చేస్తానమంటున్నారు ఏం చేయాలి వాళ్లను అంటూ కథానాయిక హాన్సిక చెప్పే డైలాగ్‌తో చిత్రంపై క్యూరియాసిటీ పెరిగింది. హాన్సిక ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ ఓంకార్ దర్శకుడు. లేడి ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై బురుగు రమ్య ప్రభాకర్ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నారు. 

ఇటీవల తెలుగులో విడుదలైన టీజర్ చక్కని స్పందన వచ్చింది. శుక్రవారం ఈ చిత్రానికి సంబంధించిన హిందీ, తమిళ టీజర్‌లను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ తెలుగులో విడుదల చేసిన టీజర్‌కు వచ్చిన స్పందన అనూహ్యం. టీజర్ ఆద్యంతం ఆసక్తిగా వుండటంతో సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడింది. వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో, ప్రతి సన్నివేశాన్ని ఎంతో ఆసక్తికరంగా దర్శకుడు మలిచాడు. తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ సినిమా చూస్తున్నంత సేపు తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ...ముగింపు వరకు ఎవరూ ఊహించలేని ట్విస్ట్‌లతో వుంటుంది  అన్నారు. 

మురళీశర్మ, ఆడుకలం నారాయణ్, జయప్రకాష్ (జేపీ), ప్రవీణ్, సీవీఎల్ నరసింహారావు, కేదారి శంకర్, పూజా రామచంద్రన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కిషోర్ బోయిడపు, సంగీతం: మార్క్ రాబీన్, ఎడిటర్: చోటా.కె.ప్రసాద్, స్టంట్స్: రాబిన్ సుబ్బు, సాహిత్యం: కృష్ణకాంత్, ఆర్ట్: గోవింద్ ఎరసాని, లైన్‌ప్రొడ్యూసర్: విజయ్‌కుమార్ కర్రెం, కో-ప్రొడ్యూసర్: పవన్‌కుమార్ బండి, నిర్మాత: బురుగు రమ్య ప్రభాకర్, రచన-దర్శకత్వం: శ్రీనివాస్ ఓంకార్.

Hansika My Name Is Shruti in three languages:

Hansika My Name Is Shruti update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs