Advertisement

సినీ జోష్ రివ్యూ: క్లాప్


సినీ జోష్ రివ్యూ: క్లాప్

Advertisement

నటీనటులు: ఆది పినిశెట్టి, ఆకాంక్ష సింగ్, కృష్ణకురుప్‌ ప్రకాశ్‌రాజ్, నాజర్, బ్రహ్మాజీ తదితరులు

సంగీతం: మేస్ట్రో ఇళయరాజా

నిర్మాతలు: యం.రాజశేఖర్‌ రెడ్డి, జవ్వాజి రామాంజనేయులు

కథ-దర్శకత్వం: పృథ్వీ ఆదిత్య

విడుదల: 11-03-2023 (డైరెక్ట్ ఓటిటి సోని లివ్)

టాలీవుడ్ కి స్టైలిష్ విలన్ గా టర్న్ తీసుకున్న కోలీవుడ్ హీరో ఆది పినిశెట్టి.. హీరోగానూ మంచి ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. అల్లు అర్జున్ తో సరైనోడు సినిమాలో సరైన విలన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆదిపిని శెట్టి.. తర్వాత అజ్ఞాతవాసి, రంగస్థలంలో హీరో బ్రదర్ గా లీడ్ కేరెక్టర్ చెయ్యడం, అలాగే రీసెంట్ గా హీరో రామ్ ద వారియర్ లోను ఆది పినిశెట్టి కీరోల్ చేస్తూ బిజీగా మారారు. ఆది హీరోగా నటించిన క్లాప్ మూవీ  తెలుగు, తమిళ భాషల్లో సోనీ లివ్ లో ఎక్సక్లూజివ్ గా స్ట్రీమింగ్ అవుతోంది. పృథ్వీ ఆదిత్య దర్శకత్వంలో ఆకాంక్ష సింగ్ తో జతకట్టి క్లాప్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం.. చూసి ప్రేక్షకులు ఎలా ఎంజాయ్ చేసారో అనేది సమీక్షలో చూసేద్దాం.

కథ: 

విష్ణు(ఆది పినిశెట్టి) కి జరిగిన ఓ యాక్సిడెంట్‌ లో విష్ణు తన తండ్రి(ప్రకాష్ రాజ్)తో పాటుగా తన కాలుని కోల్పోతాడు. అప్పటికే రన్నింగ్‌లో స్టేట్‌ చాంపియన్‌ అయిన విష్ణు నేషనల్స్ లో పరుగులు పెట్టడానికి ప్రిపేర్ అవుతుంటాడు. ప్రమాదంలో కాలు పోవడంతో.. తనకిష్టమైన రన్నింగ్ కి దూరమవుతారు. కానీ ప్రేమించిన అమ్మాయి మిత్ర (ఆకాంక్ష సింగ్) తనని పెళ్లి చేసుకోకపోతే చనిపోతాను అని బెదిరించడంతో.. విష్ణు మరో దారి లేక ఆమెను పెళ్లి చేసుకుంటాడు. స్పోర్ట్స్‌ కోటాలో వచ్చిన చిన్న ఉద్యోగంలో స్థిరపడి… తను కోల్పోయిన కెరీర్‌ గురించి రోజు ఫీలవుతూ ఉంటాడు. తాను సాధించలేని దాన్ని తన ద్వారా వేరొకరితో తన లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదలతో విష్ణు ఉంటాడు. అలా విష్ణు ఓ అమ్మాయి ని రన్నర్ ని చేయాలనుకుంటాడు. మరి విష్ణు కలని ఆ అమ్మాయి నెరవేర్చిందా? నేషనల్ ఛాంపియన్ అవ్వాలనుకున్న తన కలను ఎలా నెరవేర్చుకున్నాడు? అనేది మిగతా కథ.

కథనం: 

గతంలో ప్రభుదేవా - లారెన్స్ ప్రధాన పాత్రలుగా ఇటువంటి స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ లోనే స్టైల్ మూవీ తెరకెక్కింది. ఆటలకు సంబంధించిన కథలను తెరకెక్కిస్తున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా కథ చెప్పాలి. ఈ విషయంలో దర్శకుడు పృథ్వీ కొత్త డైరెక్టర్ అయినప్పటికి ఎక్కడా తడబడకుండా తను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పాడు. అలాగే ఆది పినిశెట్టి పాత్రను డిజైన్‌ చేసిన విధానం చాలా కొత్తగా అనిపిస్తుంది. హీరో అంటే నాలుగు ఫైట్‌లు, నాలుగు పాటలు, మధ్యలో కొంచెం కామెడీ ఉంటే చాలు అనుకునే ఈ కాలంలో ఇటువంటి కథను తెరకెక్కించటం కత్తి మీద సాములాంటిదే. చెప్పాలనుకున్న పాయింట్‌ని ఎక్కడ పక్కకు వెళ్లకుండా ఏ కమర్షియల్‌ అంశాలను జోడించకుండా కథ ఒకే పంథాలో ప్రయాణం చేస్తుంది. 

నటీనటులు:

విష్ణు కేరెక్టర్ లో ఆది పినిశెట్టి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. కాలు పోగొట్టుకొని బాధపడే యువకుని పాత్రలో మెప్పించాడు. భాగ్యలక్ష్మిగా కృష్ణ కురూప్ మంచి పెరఫార్మెన్స్ చూపించింది. ఇక ఈ సినిమాలో మరో హైలైట్ సీనియర్ నటుడు నాజర్. చాలా కాలం తర్వాత తనలోని విలనిజాన్ని సాలిడ్ గా చూపించారు. హీరోయిన్ ఆకాంక్ష సింగ్ గ్లామర్ గా ఆకట్టుకుంది. మైమ్ గోపి తదితరులు అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేసారు.

విశ్లేషణ: స్పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో చాలా కథలను వెండితెరపై ఆవిష్కరించారు. ఇవన్నీ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. ఇప్పుడు ప్రముఖ నటుడు ఆది పినిశెట్టి.. కూడా అలాంటి కథనే ఎంచుకుని క్లాప్ మూవీతో మన ముందుకు వచ్చాడు. ఇది వరకు మనం చూసిన పలు స్పోర్ట్స్ డ్రామాస్ తరహాలోనే ఈ సినిమా కూడా కొన్ని ఇంప్రెసివ్ ఎలిమెంట్స్, ఎమోషన్స్ తో కూడి ఉంటుంది. స్పోర్ట్స్ డ్రామాలో వుండే మంచి ఇన్ స్పైర్ చేసే సన్నివేశాలు.. డైలాగ్స్ అన్నీ ఉన్నాయి. దాంతో సినిమా మరింత ఆసక్తి కరంగా ఉంటుంది.  కథనంలో మరింత మంచి డ్రామా ప్లే చేయడంలో దర్శకుడు విజయం సాధించారు. 

సాంకేతికంగా..

క్లాప్ సినిమాకి ఇళయరాజా సంగీతం మంచి ఎఫెక్టివ్ గా ఉందని చెప్పాలి. సినిమాటోగ్రఫీ.. సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా కంపోజ్ చేయడం బాగుంది. అలాగే ఎడిటింగ్ కూడా బాగుంది. ఇంకా నిర్మాణ విలువలు బాగున్నాయి. 

ఫంచ్ లైన్: పొర్ఫెక్ట్ ఓటిటి జన్యూన్ అటెంప్ట్ 

రేటింగ్: 2.75/5

Clap Movie Review:

Clap Movie Telugu Review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement