Advertisement

హార్ట్‌ అండ్ సోల్‌గా చేసిన సినిమా ఇది


దేశానికి త‌ల‌మానికం అయిన క‌శ్మీర్‌లో హిందూ పండితులపై టెర్ర‌రిస్టుల దాడి ఎందుకు జ‌రిగింది? వారిని ఊచ‌కోత ఎందుకు కోశారు? ఆ త‌ర్వాత వారు ఎక్క‌డికు వెళ్ళారు? అనంత‌రం  జ‌రిగిన ప‌రిణామాలు ఏమిటి? అనే విష‌యాల‌ను నిక్క‌చ్చిగా త‌మ క‌శ్మీర్ ఫైల్స్ చిత్రంలో చెప్పామ‌ని  చిత్ర ద‌ర్శ‌కుడు వివేక్ అగ్నిహోత్రి, నిర్మాతలు అభిషేక్ అగ‌ర్వాల్‌, పల్లవి జోషి తెలియ‌జేశారు. 

Advertisement

ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు వివేక్ అగ్నిహోత్రి మాట్లాడుతూ, ఈ క‌థ‌ను నేను రాయ‌లేదు. టెర్ర‌రిజం ద్వారానే తెలుసుకుని సినిమా తీశాను. 1990 ద‌శ‌కంలో హిందూ పండితుల‌ను టార్గెట్ చేసి కొంత‌మంది టెర్ర‌రిస్టులు ఊచ‌కోత‌కోశారు. వారి పిల్ల‌ల‌ను చంపేశారు. పెద్ద‌ల‌ను పారిపొమ్మ‌ని భ‌య‌పెట్టి, మ‌హిళ‌ల‌ను ఇక్కడే బందీలు పెట్టుకుని న‌ర‌క‌యాత‌న చూపించారు. ఈ విష‌యాలేవీ ప్ర‌పంచానికి తెలీయ‌నీయ‌కుండా కొంద‌రు దాచేశారు. వాటికి వెలికితీయ‌డంలో ప్ర‌భుత్వం, మీడియాకూడా త‌ప్పుదోవ ప‌ట్టించింది. అందుకే బాధ్య‌తాయుత పౌరుడిగా నేను ఈ సినిమా తీశాను. 

అభిషేక్ నామా మాట్లాడుతూ, క‌శ్మీర్ ఇండియాలో భాగం. 30 ఏళ్ళ‌గా ఇలాంటి క‌థ‌ను ఎవ్వ‌రూ తీయ‌లేదు. వాస్తం ఏమిటి అనేది ఈ సినిమా ద్వారా చూపించామ‌ని. ఇందులో భాగ‌మైనందుకు ఆనందంగా వుంద‌ని తెలిపారు.

నిర్మాత ప‌ల్ల‌వి జోషి మాట్లాడుతూ, ఈ సినిమా తీయ‌డానికి నాలుగేళ్ళు ప‌ట్టింది. ఓ ఆప‌రేష‌న్ చేసిన‌ట్లుగా వుంది. ఈ చిత్రానికి ప‌నిచేసిన అంద‌రి కృషి ఇందులో వుంది. ఇంత‌మందితో సినిమా తీసినందుకు ల‌క్కీగా ఫీల‌వుతున్నా. మేం సినిమా మొద‌లు పెట్టిన‌ప్పుడు స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌నుకోలేదు. క‌శ్మీర్ నుంచి ఢిల్లీవ‌ర‌కు రీసెర్చ్ చేసి తీసిన సినిమా ఇది. ఇదేదో 200 ఏల్ళ‌నాటి క‌థ కాదు. ముప్పై ఏళ్ళ భార‌త్ క‌థ‌. క‌శ్మీర్‌లో జ‌రిగిన విష‌యాల‌ను రాజ‌కీయ‌నాయ‌కులు, మీడియా కూడా నిజాన్ని నొక్కేసింది. ఈ సినిమా చేశాక వివేక్ ను ట్విట్ట‌ర్‌పై ఎటాక్ చేశారు. 

న‌టుడు ద‌ర్శ‌న్ కుమార్ మాట్లాడుతూ, హార్ట్‌ అండ్ సోల్‌గా చేసిన సినిమా ఇది. ఇందులో మేం న‌టించ‌లేదు. జీవించాం. కంటెండ్ ఓరియెంటెడ్ చిత్రాలు ఇష్ట‌ప‌డేవారికి త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది. ఇందులో థ్రిల్ల‌ర్ కూడా వుంది. ఇందులో ప్ర‌తీ స‌న్నివేశం ప్రేక్ష‌కులను క‌ట్టిప‌డేస్తుంద‌ని న‌మ్మ‌కంగా చెప్ప‌గ‌ల‌ను. మార్చి 11న చూసి నిజాన్ని తెలుసుకోండ‌ని అన్నారు.

Kashmir files Press meet:

Abhishek Agrwal Arts Kashmir files Press meet
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement