Advertisement
Google Ads BL

కొత్తగా బ్రహ్మానందం తనయుడు గౌతమ్


బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా రూపొందతున్న సినిమా గ్లిమ్స్ ని గౌతమ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ తో టాలీవుడ్ ప్రత్యేక ముద్రను వేసుకున్న యస్  ఓరిజినల్స్ బ్యానర్ నుండి ప్రోడక్షన్ నెం 10 గా నిర్మిస్తున్న ఈ సినిమా తో సుబ్బు చెరుకూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఒక బ్లాంక్ స్క్రీన్ పై వాయిస్ మొదలవతుంది. ఒంటరి తనం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా అనే డైలాగ్ తో గౌతమ్ లుక్ రిలీవ్ అవుతుంది. ఈ డైలాగ్ లో గౌతమ్ క్యారెక్టర్ లోని పెయిన్ తెలుస్తుంది. అలాగే లుక్స్ కూడా రచయిత క్యారెక్టర్ ని ఫరెఫెక్ట్ గా మ్యాచ్ చేసే విధంగా ఉన్నాయి.

Advertisement
CJ Advs

ఆర్టిస్ట్ గా మనుతో సర్ ప్రైజ్ చేసిన గౌతమ్ ఈ సారి మరో కొత్త ఎక్స్ పీరియన్స్ ని ప్రేక్షకులకు అందించబోతున్నాడు. మోనోఫోబియాతో బాధపడుతున్న రచయితగా కనిపిస్తున్నాడు. ఒక ప్రమాదం అతని జీవితాన్ని ఎలా మార్చింది..? తను ఎదుర్కొంటున్న సమస్య మరో పెద్ద సమస్యకు కారణం అయితే దాన్ని అతను ఎలా అధిగమించాడు అనేది థ్రిలింగ్ ఉండబోతుంది అని చిత్ర యూనిట్ చెబుతుంది. ఈ కాన్సెప్ట్ ని యునిక్ గా తెరకెక్కిచడంలో సుబ్బు చెరుకూరి తన దైన ముద్రను వేసాడని చిత్ర యూనిట్ అంటుంది. ఎస్ ఒరిజినల్స్ పతాకంపై సృజన్ యరబోలు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరిషెడ్యూల్ జరుపుకుంటుంది.

ఎమ్ యస్ జోన్స్ రూపెర్ట్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి మోహన్ చారి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నిర్మాత సృజన్ యరబోలు, దర్శకత్వం సుబ్బు చెరుకూరి.

Newly Brahmanandam son Gautam:

The film unit has released the movie Glimpses on the occasion of Gautam birthday
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs